దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం ... 179 మంది దుర్మరణం 

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మయాన్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై ల్యాండ్ అవుతున్న విమానం స్వల్పంగా రక్షణ గోడను తాకడంతో ప్రమాదం సంభవించింది. దీంతో రన్ వేపై భారీ మంటలు చెలరేగాయి. 181 మందితో ల్యాండ్ అవుతున్న విమానం ప్రమాదవశాత్తు  రక్షణ గోడను ఢీ కొట్టగానే భారీ మంటలు చెలరేగి 179 మంది అక్కడికక్కడే చనిపోయారు.