మధుమేహం ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని పండ్లు ఇవే..
posted on Oct 11, 2023 12:33PM
డయాబెటిస్ లేదా మధుమేహం అనేది చాలా పెద్ద సమస్య. దీనికి శాశ్వత నివారణ లేదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా మాత్రమే మెరుగైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు పండ్లు తినాలా వద్దా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. డయాబెటిక్ పేషెంట్లు తమ పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి, రక్తంలో చక్కెర స్థాయిని, దాని లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారంలో పండ్లను ఒక భాగం చేసుకోవాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ సూచిస్తోంది.
పండ్లు, కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అద్భుతమైన మూలాలతో కలిగి ఉంటాయి. కొన్ని పండ్లలో అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లను తినకుండా ఉండటానికి కారణం ఇదే. అయితే మధుమేహం ఉన్నవారికి శత్రువు లాంటి పండ్లు ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా ఎప్పుడూ తినకూడదు.
పుచ్చకాయ, అరటి పండు..
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఆహారం తిన్న తర్వాత ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో కొలుస్తుంది. ఆహారం GI స్కోర్ 70 నుండి 100 మధ్య ఉంటే, అది అధిక చక్కెరను కలిగి ఉంటుంది. పుచ్చకాయ, అతిగా పండిన అరటిపండ్లు ఈ కోవలో ఉన్నాయి.
యాపిల్..
ఒక వ్యక్తి తినే కార్బోహైడ్రేట్ మొత్తం వారి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావాన్ని చూపుతుంది.. యాపిల్, అరటి పండ్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
మామిడి..
మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు, ఎందుకంటే దాని రుచి అలాంటిది. కానీ డయాబెటిక్ పేషెంట్ దీన్ని తినేముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక మామిడికాయలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది.
పైనాపిల్.. లిచీ..
పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీని GI విలువ కూడా ఎక్కువే. ఇది కాకుండా లిచీ కూడా అలాంటి కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఈ జ్యుసి పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు లిచీ, పైనాపిల్ తినాలని అనిపిస్తే చాలా పరిమితంగా తీసుకోవాలి.
మధుమేహం ఉన్నవారు పండ్లరసాలు తాగచ్చా..
భోజనం సమయంలో పండ్ల రసాన్ని తాగడం లేదా వేరే దేనివల్లనైనా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పండ్లను ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో పండ్ల రసాలు తాగే వ్యక్తులు మధమేహానికి గురయ్యే అవకాశం ఉంది. జ్యూసులకు బదులుగా మధుమేహం ఉన్నవారు ఆప్రికాట్లు, బ్లాక్బెర్రీస్, చెర్రీస్, నారింజ, బొప్పాయి, పీచెస్, రేగు, స్ట్రాబెర్రీ వంటి పండ్లను పుష్కలంగా నేరుగా తీసుకోవచ్చు.
*నిశ్శబ్ద.