నచ్చిన ముఖాలు ఎంచక్కా మనముందే..

ప్రపంచం వేగంగా పరిగెడుతుంటే, ఆ వేగానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు జరిగిపోతున్నాయి. కొన్ని మన జీవితాన్ని, జీవన విధానాన్ని సౌకర్యవంతంగా చేస్తే, మరికొన్ని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈమధ్య అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తున్న మరో ప్రయోగం ఏమిటంటే, సాధారణంగా ఇష్టమైన వారి ఫొటోని మన హాలులో పెట్టుకుంటాం కదా. కానీ, వారి ముఖాన్నే ఎంచక్కా పెట్టుకోగలిగితే...

ఆ ముఖంలో విలువైన వస్తువులను దాచుకునే ఏర్పాటువుంటే.. ఉంటే ఏంటి? ఆ అవకాశం వుంది ఇప్పుడు! ఎలా అంటే, మనం ఒక ఫొటో ఇచ్చామనుకోండి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అచ్చం అలాంటి ముఖాన్నే తయారుచేసి ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. లోపలంతా ఖాళీగా వుండే ఈ రబ్బరు ముఖాలకు డబ్బాల్లా పైన మూత తీసుకుని పెట్టుకునే వీలుంటుంది. ఇలా మనకిష్టమైన వాళ్ళని ఎవరినైనా మన కళ్ళముందు ఉంచుకోవచ్చు.

.....రమ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News