ప్రపంచంలోనే ప్రమాదకరమైన 10 ఉద్యోగాలు


జీవితం సాఫీగా సాగాలంటే డబ్బులు కావాలి. అందుకోసం ఉద్యోగం చేయాల్సిందే. అయితే తాము చేసే పని అంటే ఆడుతుపాడుతూ జరిగిపోవాలనుకుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం ప్రతి పనిలో కాసింత కిక్కు ఉండాలి అని కోరుకుంటారు. రిస్కు అయినా పర్లేదు కిక్కిచ్చే పనిలోనే థ్రిల్ ఉంటుందని వాటివైపే మొగ్గుచూపుతుంటారు మరికొందరు . అలా కిక్ కోసం ప్రమాదకరమైన పనులను ఎంచుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 10 ఉద్యోగాల గురించి  తెలుసుకుందాం.

1. పాము విషం సేకరించడం :
అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో ఇది ఒకటి.  పాము విషాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లలోకి బలవంతంగా పిండుతుంటారు. ఈ ప్రక్రియలో ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. పాము కాటునుండి తప్పించుకున్న వాళ్ళు తక్కువనే చెప్పవచ్చు.
పాము విషం (పాయిజన్)  వైద్య పరిశోధనలో లేదా "యాంటివేనోమ్" ను ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగిస్తారు.
 పాముల నుండి విషం తీసేవారికి సగటు వార్షిక జీతం 30,000 డాలర్ల వరకు ఉంటుంది.

2. మొసలి మల్లయోధులు :
ఇది ఎప్పుడూ ప్రమాదకరమైన పనే అనవచ్చు. మొసలి మల్లయోధులు తమ  శరీర భాగాలను మొసలి దవడల మధ్య ఉంచడం, తోకలతో ఆడుకోవడం, కొన్నిసార్లు వెర్రి పనులు చేస్తూ ఉంటారు. అయితే మొసలి ఎప్పుడూ కూల్ గా పడుకోని ఉండదు. అప్పుడప్పుడు చురుగ్గా కదులుతుంది, ప్రతిస్పందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పనిలో చాలామంది  తమ ప్రాణాలను కోల్పోతుంటారు. ఈ జాబ్ చేసే వాళ్లకు గంటకు  సుమారు 8 డాలర్లు ఇస్తూ ఉంటారు.

3. చేపలు పట్టే పని :
చేపలు పట్టే పని ప్రమాదకరమైన పనే. ఫిషింగ్‌ అనేది మనం చూసేంత ప్రశాంతంగా ఉండదు. అనుకోకుండా మారే వాతావరణ పరిస్థితులు, లోపభూయిష్ట పడవలకు సంబంధించిన అంశాల కారణంగా తరచు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ వృత్తిలో అత్యధిక మరణాల రేటు నమోదు అవుతోంది. ఈ పని చేసే వారికి సగటు వార్షిక జీతం 30,000 డాలర్లు

4. బుల్ రైడర్ :
1990లో చివర్లో ఈ వృత్తి చాలా పాపులర్ అయింది.  ఈ పనిలో 8 సెకన్ల రైడ్ కోసం చాలా పెద్ద మొత్తంలో నగదు ఇవ్వడం మొదలెట్టాక దీనికి ప్రాచుర్యం వచ్చింది.
వాస్తవానికి, జీతం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఈ పనిలో ప్రతి 15 రైడ్లకు ఒక బుల్ రైడర్ గాయాల పాలు కావడం, బోన్స్ విరగడం వంటి ప్రమాదాలకు గురవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ పనిలో జీతం బాగానే ఉంటుంది.  వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. ఈ పనిలో సగటు వార్షిక జీతం 107,000 డాలర్ల వరకూ ఉంటుంది. 

5. ఆయిల్ రిగ్గర్ :
ఆయిల్ రిగ్గర్ అంటే ప్రపంచంలో అత్యంత మండే పదార్థాలతో పనిచేయడం అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆయిల్ రిగ్గర్స్ కంటిన్యూగా 16 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి నిద్ర లేకుండా  2 రోజులు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇందులో మంటలు రావడం, చమురు పేలుళ్లు జరగడం, మునిగిపోవడం ఒక్కోసారి శరీర భాగాలు యంత్రాల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. తరచుగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ పనికి సగటు వార్షిక జీతం: 70,000 నుండి, 140,000 డాలర్ల వరకు ఉంటుంది.

6. లాగర్ :
లాగింగ్ అనేది చాలా ప్రమాదకరమైన పనులలో ఒకటి, ఎందుకంటే  ఈ రంగంలో చనిపోయే అవకాశం 20 రెట్లు ఎక్కువ. ఈ పనిలో రోజూ భారీ యంత్రాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఫలితంగా, పరికరాల వైఫల్యం, కార్మికులపై చెట్లు పడటం వలన చాలా మరణాలు సంభవిస్తాయి. ఈ పనికి సగటు వార్షిక జీతం: 36,000 నుండి, 000 41,000 డాలర్ల వరకు ఉంటుంది. 

7. నిర్మాణ కార్మికుడు :
భద్రతా సామగ్రిని ఉపయోగిస్తునప్పటికీ, ఈ ఉద్యోగం  ప్రాణాంతకమనే చెప్పవచ్చు. భారీ వస్తువులతో పనిచేయడం, బరువైన వస్తువులను మోసుకెళ్లడం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రమాదకరమని చెప్పవచ్చు.  కొన్ని సార్లు ప్రమాదవశాత్తు కార్మికులపై గోడలు, స్తంభాలు కూలీ పడిపోతుంటాయి. ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఈ పనికి సగటు వార్షిక జీతం 31,000 నుండి 70,000 డాలర్ల వరకు ఉంటుంది.

8. మౌంటైన్ గైడ్ :
ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించడం కొందరి కల. ఇందులో కొత్త ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అనేది ఇందులో రిస్కు తో పాటు థ్రిల్ ఉంటుంది. అయితే ఈ పనిలో  గైడ్ మాత్రమే ఉండరు. కొన్నిసార్లు భారీ పరికరాలను మోసుకెళ్లాలి. అంతకంటే ముందు ప్రమాదకరమైన మార్గాన్ని ముందుగా అధిరోహించి ఆ తర్వాత ఇతరుల భద్రతకు బాధ్యత వహించాలి. అత్యంత ప్రమాదకరమైన వృత్తి లో ఇది ఒకటి. ఈ వృత్తిలో సగటు వార్షిక జీతం 70,000 డాలర్ల వరకు ఉంటుంది.

9. మైక్రోచిప్ తయారు చేసే పని :
ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగింది.  రోజువారి జీవితంలో అవి భాగమయ్యాయి. కానీ వాటిని తయారు చేయాలంటే ఎంతో కష్టంతో కూడిన పని.  కంప్యూటర్ చిప్స్ ఉత్పత్తి చేయడానికి ఆర్సెనిక్ వంటి అనేక ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తారు. అవి తక్షణమే ప్రాణాంతకం కాకపోయినా  దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. గర్భస్రావం, జనన లోపాలు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పనికి సగటు వార్షిక జీతం 61,000 డాలర్ల వరకు ఉంటుంది.

10. వార్ కరస్పాండెంట్ :
యుద్ధాలు జరిగే ప్రదేశం నుంచి ఎప్పటిప్పుడు సమాచారాన్ని చేరవేయడం ఆషామాషీ కాదు.  ప్రపంచానికి సత్యాన్ని తెలపడం అనేది డాక్టర్ వంటి ఉన్నతమైన ఉద్యోగం లాంటిదే. అయితే ఈ వృత్తి ఎక్కువ ప్రమాదం కరమైనది.  పనిచేస్తున్నప్పుడు జర్నలిస్టుగా కంటే శత్రువుగానే కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృత్తిలో సగటు వార్షిక జీతం 36,000 డాలర్ల వరకు ఉంటుంది.