విశాల్ కోర్టు నోటీసులు.. బీజేపీ తీరుపై ఆగ్రహం
posted on Oct 25, 2017 5:57PM
మెర్శల్ చిత్రంపై జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా గురించి సెటైర్లు వేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా చూసిన తమిళ స్టార్స్ మాత్రం సినిమా చాలా బాగుందని విజయ్ కు మద్దతుగా నిలిచారు. వారిలో విశాల్ కూడా ఉన్నాడు. విశాల్ కూడా ఆ సినిమాకు మద్దతు తెలపడంతో పాటు..బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా తాను ఈ సినిమాను పైరసీలో చూశానని చెప్పడంపై దానిపై కూడా స్పందించి.. మీరు మెర్సల్ ఫైరసీ కాపీ చూశానని చెపుతున్నారు…అసలు మీకు సిగ్గుందా ? అంటూ ఫైర్ అయ్యాడు. ఇంకే ముంది.. విశాల్ కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. తన ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ సరిగానే ఉన్నాయని విశాల్ చెప్పినప్పటికీ.. ఆ తనిఖీల ద్వారా ఆయన రూ. 51 లక్షల పన్ను చెల్లించలేదని అధికారులకు తెలిసినట్టు సమాచారం. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్‌కి సమన్లు జారీచేశారు. ఈ నెల 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. ఇదిలా ఉండగా మరోవైపు విశాల్ కార్యాలయంలో దాడులపై పలువురు స్పందిస్తున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే విశాల్ కార్యలయంలో దాడులు జరిపారని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూద్దాం...