ఒకేసారి 36 ప్రాంతాల్లో ఐటీ దాడులు..

 

గత కొద్ది రోజులనుండి తమిళనాడులో ఐటీ శాఖ దాడులు జరుగుతున్న సంగతి తెలసిందే. వరుస పెట్టి ఐటీ శాఖ చేస్తున్న దాడులకు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే మంత్రి విజయ్‌ భాస్కర్‌ నివాసంతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేసిన ఐటీ అధికారులు.. ఇప్పుడు తాజాగా  రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 36 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఈరోజు ఉదయం సోదాలు చేపట్టారు. గోకులం చిట్‌ఫండ్స్‌ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు తమిళనాడుతో పాటు కేరళ, బెంగళూరులోనూ దాడులు చేశారు. ఈ సందర్భంగా ఐటీశాఖ అధికారి మాట్లాడుతూ చెన్నైతో పాటు మొత్తం 78 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు.