బాబ్రీ మసీదు కేసు... బీజేపీ పెద్దలకు ఎదురుదెబ్బ...

 

బాబ్రీ మసీదు కేసులో బీజేపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అద్వాని సహా పలువురు బీజేపీ నేతలను బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా సుప్రీంకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పక్కన పెట్టి... కేసు విచారణను పునరుద్దరణకు ఆదేశించింది. కుట్ర కేసు విచారణ కొనసాగించాల్సిందేనని చెబుతూ..లఖనవూలోని ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతినిచ్చింది. అంతేకాదు రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా అద్వానితో పాటు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి విచారణ ఎదుర్కొననున్నారు.