కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ...

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈరోజు బాధ్యతలు చేపట్టారు.  ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి , భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రఘువీరారెడ్డి, జేడీ శీలం, పల్లం రాజు హాజరయ్యారు. కాగా ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఐదో వ్య‌క్తిగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu