చిక్కుల్లో పూనమ్...!
posted on Nov 10, 2012 3:35PM
పూనమ్ పాండే గత రెండు సంవత్సరాలుగా మీడియాకు ఒక హాట్ టాపిక్. ఆమె ఎప్పుడు ఏ కామెంట్ విసురుతుందా, ఎప్పుడు ఎలాంటి స్థాయిలో నగ్న పోజులిస్తుందా…అనే విషయం గురించి ఎప్పటికప్పుడు ఆమె ట్విటర్ అకౌంట్ ను వెదుకుతుంటుంది మీడియా. అందుకు తగ్గట్టుగా పూనమ్ పాండే కూడా వారి అంచనాలను అందుకుంటూ, వివాదాలను రాజేస్తుంటుంది. వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ టీమ్ ఎదురుగా నగ్నంగా పెరేడ్ నిర్వహిస్తానన్నా, భారత ప్రధాని ట్విటర్ అకౌంట్ కు తన నగ్న చిత్రంతో వెల్కమ్ పలికినా…అది పూనమ్ కే చెల్లింది. అయినా ఇన్ని రోజులూ ఆమె విషయంలో ఎవరూ నోరు మెదపలేదు. ఆమె ఏం చేసినా, కొంత మంది బాగా చూసి, మరి కొంతమంది అసలు చూడకుండా వెల్లిపోయారు.
ఈ నేపథ్యంలో పూనమ్ పాండే వ్యవహారంపై ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. ఆమె తన మాటలతో, చర్యలతో భారత సంస్కృతిని అవమాన పరుస్తోందని ఒక వ్యక్తి బెంగళూరు హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. తరచూ నగ్న చిత్రాలను పోస్టు చే స్తూ, యువతను పక్కదారి పట్టిస్తోందని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో ఆరోపించాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అలాగే పూనమ్ పాండేకు నోటీసులు జారీ చేస్తూ 2013 ఫిబ్రవరి 26 న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.