బాలసాయికీ ఢమరుకానికీ లింకేంటి?
posted on Nov 12, 2012 12:45PM
హైదరాబాద్ లో డిజిపి కార్యాలయం ఎదురుగా పట్టుబడ్డ కోట్లాది రూపాయల సొమ్ము నాదేనంటూ బాలసాయి తరఫున ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తెరమీదికొచ్చాడు. నిజంగానే ఆ సొమ్ము తనదేనని, పోలీసులు ఆపేసరికి తీసుకెళ్తున్న వ్యక్తి భయపడి పారిపోయాడు తప్ప దాని వెనక మతలబు ఏం లేదని రావుగారు నమ్మబలికారు. కానీ.. పట్టుబడ్డ సొమ్ము ఎవరిదన్న విషయంపై అనుమానాలు పూర్తిగా వీడిపోలేదు.
పట్టుబడ్డ నోట్ల కట్టలు ఢమరుకం సినిమా ప్రొడ్యూసర్ కి సంబంధించినవని, ప్రింట్లు ల్యాబ్ లో ఇరుక్కుపోయాయ్ కనుక వాటిని విడుదల చేయడానికి చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తూ పట్టుబడ్డారని మరో కథనం హైదరాబాద్ లో వినిపిస్తోంది. పట్టుబడింది బ్లాక్ మనీ కనక ఎటూ చెప్పలేక బాలసాయి తరఫున మరో వ్యక్తి తెరమీదికొచ్చాడని సినీవర్గాల్లో భారీ ప్రచారం జరుగుతోంది.
బ్లాక్ మనీ భారీ ఎత్తున పట్టుబడింది కనుక, ల్యాబ్ వాళ్లకు సమయానికి డబ్బందక ఢమరుకం సినిమా రిలీజ్ ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. సొమ్ము ఆదాయంపన్ను అధికారుల చేతికి చిక్కింది కనుక దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా రోజులు
పడుతుంది కనుక ఇప్పట్లో ఢమరుకం రిలీజ్ గురించి ఆశలుపెట్టుకోవడం సరైంది కాదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.