నాగ్ ఫ్యాన్స్ వీరంగం
posted on Nov 10, 2012 1:37PM
‘ఢమరుకం’ చిత్రం మరో సారి విడుదల వాయిదా పడడంతో నాగార్జున అభిమానులు భగ్గుమన్నారు. తిరుపతి సంధ్య థియేటర్‌ను నాగార్జున అభిమానులు ధ్వంసం చేశారు. ఫర్నిచర్, అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ చిత్రం చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. శనివారం విడుదల తేది మరోసారి వాయిదా పడింది.
దీపావళి కానుక అంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న డమరుకం శనివారం మళ్లీ నిరాశపర్చింది. అనేక అవరోధాలను ఎదుర్కొని ఈ సినిమా చివరికి నేడు విడుదల కావల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోవటంతో నాగార్జున అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. గ్రాఫిక్స్ ఇబ్బందుల్ని, టైటిల్ వివాదాన్ని దాటుకుంటూ వచ్చిన డమరుకం నేడు విడుదలంటూ భారీగా ప్రచారం కూడా జరిగింది. అభిమాన హీరో సినిమా కోసం ఆశగా వచ్చిన అభిమానులు సినిమా విడుదల లేదని తెలియగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.