మోపిదేవికి పెరిగిన సానుభూతి
posted on May 30, 2012 12:40PM
జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పట్ల ప్రజలలో సానుభూతి పెరిగింది. తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం లేకపోయినా కేవలం నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చెప్పిన మేరకు జి.వో లపై సంతకం చేశానని చెప్పడం, ఇదే సమయంలో తనకు తీరప్రాంత భూములు అప్పగించినందుకే రాజశేఖరరెడ్డి కోరిక మేరకు జగన్ కంపెనీలో వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్టు నిమ్మగడ్డ ప్రసాద్ ప్రకటించడంతో నిజంగానే మోపిదేవి ఎటువంటి డబ్బు ఆశించకుండా సంతకాలు చేసినట్టు అర్థం అవుతోంది. వీరు అరెస్టు అయినప్పుడు వేల కోట్ల స్వాహా చేసిన జగన్ కాని, అక్రమ ఆస్తులను అనుభవిస్తున్న జగన్ కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిలా, భారతి వంటివారు కనీసం సానుభూతి కూడా చూపకపోవడంతో సంతకాలు మంత్రులవి....వేల కోట్లు మాత్రం జగన్ కు చెందాయనే భావన క్రమంగా ప్రజలకు అర్థం అవుతోంది. దాంతో మోపిదేవి అరెస్టు పట్ల ప్రజలలో సానుభూతి పెరిగింది.అదే విధంగా మోపిదేవితోపాటు జగన్ స్వార్ధానికి బలై అరెస్టు అయిన శ్రీలక్ష్మీ , రాజగోపాల్ వంటి అధికారులు పట్ల కూడా సానుభూతి వ్యక్తం అవుతోంది.