ఖడ్సే కు క్లీన్ చిట్.. దావూద్ ఇబ్రహీం ఫోన్ కాల్స్ కాదట..
posted on Jun 11, 2016 12:12PM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు ఉన్నాయంటూ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దావూద్ ఇబ్రహీంకు, ఖడ్సే కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. దావూద్ పలుమార్లు ఖడ్సేకు ఫోన్ చేశాడని కథనాలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఖడ్సేకు క్లీన్ చిట్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పాక్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఫోన్ కాల్స్ దావూద్ ఇబ్రహీం ఇంటి నుంచి వచ్చినవి కావని.. దావూద్ ఇంటి నుంచి ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని చెబుతున్న నెంబరును అసలు ఆయన ఏడాదిగా వాడటమే లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దావూద్ తో లింకుల విషయంలో ఖడ్సేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి దీనిపై ఖడ్సే ఏవిధందా స్పందిస్తారో చూడాలి.