కొండా లక్ష్మణ్ బాపూజీ కన్నుమూత
posted on Sep 21, 2012 11:11AM
స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ(96) ఈ రోజు ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండ లక్ష్మణ్ బాపూజీ హైదరాబాద్ లోని తన స్వగృహంలోఈ రోజు మృతి చెందారు. 27 సెప్టెంబర్1915 జన్మించిన బాపూజీ సొంత ఊరు ఆదిలాబాద్ జిల్లా వాంకిడి. 1969లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలో పాల్గోన్నారు. తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలిమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ. 2009 తెలంగాణ ఉద్యమంలో కుడా బాపూజీ కీలక పాత్ర పోషించారు. ఆయనకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పడి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇంటియా ఉద్యమంలో బాపూజీ చురుకుగా పాల్గొన్నారు. బాపూజీ మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు, మాలమహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు బాబూజీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. రెండు రోజుల కిత్రం ఖైరతాబాద్ మహా గణపతికి నల్గొండ జిల్లాలో తయారు చేసిన 72 అడుగులు కండువాను బాపూజీ చేతుల మీదుగా సమర్పించిన విషయం తెలిసిందే.