కొడాలి పై పోటికి రావిని సిద్దం చేస్తున్నబాలయ్య
posted on Sep 9, 2012 3:06PM
గుడివాడ మాజీ శాసన సభ్యుడు రావిని కొడాలి నాని పై పోటికి బాలకృష్ణ సిద్దం చేస్తున్నారు. గుడివాడలో మంచి పట్టున్న రావి తిరిగి టిడిపిలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రావి సోమవారం లేదా మంగళవారం తన అనుచరులతో పార్టీలో చేరనున్నారని సమాచార౦. రావి ప్రజారాజ్యం తరుపున 2009 లో కొడాలి నాని పై పోటి చేసి ఓడిపోయాడు, కాని రావి వెంకటేశ్వర రావు తండ్రి శోభానాద్రి రెండుసార్లు టిడిపిలో ఎమ్మెల్యేగా చేశారు. దీంతో అక్కడ వారికి మంచి పట్టు ఉంది. దీంతో రావి గుడివాడ ఎమ్మెల్యేగా 2004 వరకు కొనసాగారు. 2009 లో టిడిపి టికెట్ జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానికి ఇప్పించడంతో, రావి అప్పుడే పెట్టిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి కొడాలి నాని పై పోటి చేసి ఓడిపోయాడు. ఇప్పుడు రావి తిరిగి పార్టీలో చేరడంతో రానున్న ఎన్నికల్లో గుడివాడ నుండి కొడాలి నాని పైన రావి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఓ సమయంలో బాలకృష్ణనే స్వయంగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ఆశీర్వాదంతో పార్టీలోకి వచ్చిన రావియే నానిపై పోటీ చేస్తారని సమాచారం.