నేడు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంక‌టేశం 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కం ఆవిష్క‌రణ

తెలుగువ‌న్ డాట్ కామ్‌, అక్ష‌ర‌యాన్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంక‌టేశం ర‌చించిన 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కం ఆవిష్క‌ర‌ణ ఈ రోజు (మే 22) సాయంత్రం 6 గంట‌ల‌కు జూమ్ ద్వారా జ‌ర‌గ‌నున్న‌ది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి హాజ‌రై, పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.

ఐనంపూడి శ్రీ‌ల‌క్ష్మి స్వాగ‌తం ప‌లికే ఈ కార్య‌క్ర‌మంలో తెలుగువ‌న్ డాట్ కామ్ అధినేత కంఠంనేని ర‌విశంక‌ర్ శుభాకాంక్ష‌లు అంద‌జేయ‌నున్నారు. అనంత‌రం శ‌త‌క‌క‌ర్త బుర్రా వెంక‌టేశం స్పందిస్తారు. ఇదే సంద‌ర్భంగా ఇదివ‌ర‌కు శ‌త‌కాలు ర‌చించిన డా. కోడూరి సుమ‌న (అమ్మ‌), చివుకుల శ్రీ‌ల‌క్ష్మి (సాయి గీతాంజ‌లి), డా. దేవుల‌ప‌ల్లి ప‌ద్మ‌జ (ప్ర‌కృతి ప‌లుకుల‌లో లోక‌రీతులు), నండూరి రామ‌చంద్ర‌రావు (చంద్ర గ‌ద్య శ‌త‌కం), షేర్ భార‌తీమూర్తి (అంత‌ర్మ‌ధ‌నం), శైల‌జా శ్రీ‌నివాస్ (మ‌ల్లినాథ‌సూరి - ఇంకా ఆవిష్క‌ర‌ణ కాలేదు) ల‌ను గౌర‌వించ‌నున్నారు.

'జీవ‌న ధ‌న్య' శ‌త‌కాన్ని ఆవిష్క‌రించాక త‌న స్పంద‌న‌ను డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి తెలియ‌జేస్తారు. శ‌త‌కంపై సుప్ర‌సిద్ధ క‌వి ఆచార్య ఎన్‌. గోపి, తెలంగాణ సాహిత్య అకాడ‌మీ చైర్మ‌న్ నందిని సిధారెడ్డి, పొట్టి శ్రీ‌రాములు తెలుగు యూనివ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఎస్వీ స‌త్య‌నారాయ‌ణ త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో కోట్ల వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి, డా. అమ్మంగి వేణుగోపాల్‌, వ‌డ్డేప‌ల్లి కృష్ణ‌, డా. చిల్ల‌ర భ‌వానీదేవి, డా. వెలుదండ వెంక‌టేశ్వ‌ర‌రావు, దాస్యం సేనాధిప‌తి, జె. చెన్న‌య్య‌, బి.వి.ఎన్‌. స్వామ్య‌. వేణు సుంకోజు, డా. కేత‌వ‌ర‌పు రాజ్య‌శ్రీ‌, డా. మంగ‌ళ మ‌క్క‌పాటి, ఘాలి ల‌లిత ప్ర‌వ‌ల్లిక‌, ర‌మాదేవి కుల‌క‌ర్ణి, హ‌రిప్రియ‌, కాట్ర‌గ‌డ్డ భార‌తి, చివుకుల శ్రీ‌ల‌క్ష్మి, స‌త్య నీలిమ‌, వేలేటి శైల‌జ‌, బొమ్మ విమ‌ల‌, శార‌ద హ‌నుమాండ్ల త‌దిత‌ర క‌వులు పాల్గొంటున్నారు. ప్ర‌సంగాల అనంత‌రం ర‌చ‌యిత‌తో ముఖాముఖి ఉంటుంది.