టీకాకు డోకా లేదు   కేంద్రం భరోసా 

కరోనా సెకండ్ వేవ్, ప్రమాదకరంగా మారింది. ఫస్ట్ వేవ్’ను సమర్ధవంతంగా కట్టడి చేశామని, తమకు తామే భుజకీర్తులు తగిలించుకున్న కేంద్ర ప్రభుత్వం, సెకండ్ వేవ్ విషయంలో చేతులెత్తేసింది. విమర్శలను ఎదుర్కుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాహుల గాంధీ, అలాగే ఇతర పార్టీల నాయకులు, కేంద్ర ప్రభుత్వ వైఫలయ్యాలను ఎండగడుతూ వచ్చారు. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజిని, ఓ పద్దతి ప్రకారం, సక్సెస్ఫుల్ ‘గా  డ్యామేజి చేశారు. 
 

కొంచెం ఆలస్యంగానే అయినా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతాపార్టీ జరిగిన నష్టాన్ని గుర్తించాయి. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగానే, ముందుగా, అంతర్గత అసంతృప్తిని అడ్రస్ చేసేందుకు, బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్, సెకండ్ వేవ్ కట్టడి  వైఫల్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో పాటుగా, మనమందరి నిర్లక్ష్యం కూడా కారణం అయిందని, చెప్పు కొచ్చారు. ఆ విధంగా తప్పంతా కేంద్రానిది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీదీ అనే ఆలోచనలను పక్కదారి మళ్ళించే ప్రయత్నం చేశారు.అలాగే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెరపై  కొచ్చారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయినవారిని పోగొట్టుకోవడం అత్యంత బాధాకరమని, అయినా, వజ్ర సంకలపంతో అందరు కలిసి కరోనను జయిద్దామని పిలుపు నిచ్చారు.

అలాగే, బెంగాల్ ఎన్నికల మాయలో పడి, ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకున్నారు. మెల్లి మెల్లిగా, దిద్దుబాటు చర్యలు ప్రరంభించారు. దేశంలో ఎక్కడెక్కడ, పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటూ, సమీక్షిస్తున్నారు. అవసరమైన చర్యలు సూచిస్తున్నారు. అలాగే, అన్నిటికంటే ప్రధానంగా, అస్తవ్యస్తంగా, అద్వానంగా సాగుతున్న వాక్సినేషన్ (టీకాలు) విషయంలో, కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. దేశంలో  అనేక రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అలాగే టీకాల కేటాయింపులో, కేంద్ర ప్రభుత్వం, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. అంతే కాకుండా రెండు తర్వాత వచ్చే మూడవ వేవ్, మరింత భయంకరంగా ఉంటుందని వార్తలు వినవస్తున్న నేపధ్యంలో, టీకా ఒక్కటే రక్షణ కవచమని భావిస్తున్న ప్రజలు టీకా కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే, ఈ తరుణంలో దేశంలో జనాభాకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయా? ఈ ఏడాదిలోపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందా? అంటే,ప్రస్తుతం అంతా అయోమయం, గందరగోళంగా సాగుతున్న, టీకా కార్యక్రమం భరోసా ఇవ్వలేక పోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, . అయితే, కేంద్రం మాత్రం ఈ ఏడాదిలో 200 కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉంటాయని భరోసా వ్యక్తం చేస్తోంది. 

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది. దేశీయంగా తయారైన కోవాక్జిన్‌, కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌లను రెండు డోసుల చొప్పున ప్రజలకు ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రవేశించడానికి ముందు ఈ కార్యక్రమం స్తబ్దుగా జరిగింది. మరో వంక, కేంద్ర ప్రభుత్వం కరోనా కథ ముగిసినట్లే భావించిందో, ఏమో, మన దేశంలో తయారైన వాక్సిన్లను  ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. మొతానికి సెకండ్ వేవ్ విషయంలో సరైన అంచనాలు లేక పోవడం వల్లనే, ఇప్పడు  ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, నిపుణులు భావిస్తున్నారు. 

దేశంలో ఇంతవరకు కేవలం 18 కోట్ల మందికి మాత్రమే, అంటే దేశ జనాభాలో మూడు శాతం మందికి మాత్రమే వాక్సినేషన్ పూర్తయింది. మరి, మిగిలియన్ 97 శాతం మందికి, వాక్సినేషన్ ఎప్పటికయ్యేను. మన దేశంలో కనీసం 60 నుంచి 80 శాతం మందికి రెండుసార్లు వాక్సినేషన్ పూర్తయితేనే కానీ, కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని నిపుణులు అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం, డిసెంబర్ నాటికీ, రెండు వందల కోట్ల టీకాలు అందుబాటులో ఉంటాయని, కొత్త సంవత్సరంలో కరోనా కష్టాలు ఉండవని అంటోంది.. అందులో 

కోవిషీల్డ్‌ 75 కోట్లు, కోవాక్జిన్‌ 55 కోట్లు, బయో ఈ సబ్‌ యూనిట్‌ వ్యాక్సిన్‌ 30 కోట్లు, జైడస్‌ క్యాడిలా డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఐదు కోట్లు, ఎస్‌ఐఐానోవావ్యాక్స్‌ 20 కోట్లు, బీబీ నాసల్‌ వ్యాక్సిన్‌ 10 కోట్లు, జెన్నోవా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఆరు కోట్లు, స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 15.6 కోట్ల డోసులతో కలిపి మొత్తం 216 కోట్ల డోసులు ఉత్పత్తి లేదా అందుబాటులో ఉండగలవని కేంద్రం సమాచారం. అయితే, ఈ లెక్కలు ఎంతవరకు వానిమ అవుతాయో .. చూడవలసి వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu