కుటుంబం ప్రాణం తీసిన పేకాట.. 

మనిషికి ఏదైనా సరే మితిమీరితే మరణం తప్పదు. మనిషికి అప్పు, అలాగే మందు మత్తు, పేకాట లాంటివి అలవాటు పడితే ఇంకా అంతే వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే అందులో ఉండే కిక్ అలాంటిది.. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదంచోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కుమార్తెతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీకి చెందిన వీరమ్మ భర్త గోపీ పేకాటకు బానిసై ఇంటిని రూ.10లక్షలకు అమ్మేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వీరమ్మ.. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెల మృతదేహాలను చెరువులోంచి వెలికితీశారు. కేసు నమోదు చేసి గోపిని అదుపులోకితీసుకొని విచారిస్తున్నారు.  

ప్రకాశంలో.. తండ్రి ని చంపినా కొడుకు..  

డబ్బులివ్వ‌లేద‌ని తండ్రిని కుమారుడు దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా బేస్త‌వారిపేట మండ‌లం పెద్ద ఓబేనేనిప‌ల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భూమి విక్ర‌యించ‌గా వ‌చ్చిన డ‌బ్బుల కోసం తండ్రీ, కుమారుల‌ మ‌ధ్య నిన్న‌ ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో నిద్రిస్తున్న తండ్రిపై కుమారుడు(18) గొడ్డ‌లితో దాడి చేసి చంపేశాడు. డ‌బ్బులు ఇవ్వ‌లేద‌నే కోపంతోనే  యువ‌కుడు ఈ హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధ‌ర‌ణ‌కు వ‌చ్చారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

గుంటూరు లో ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య

ఒంటిపై యాసిడ్ పోసుకొని వ్య‌వ‌సాయ ఉద్యోగిని ఉమాదేవి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న గుంటూరులో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు .. ఉమాదేవి కుమారుడు బాజీ కిర‌ణ్‌ ఈ నెల 8న క‌రోనాతో మృతిచెందాడు. అప్ప‌టి నుంచి కుటుంబంలో ఆస్తుల విష‌యంలో వివాదం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఇవాళ త‌న కార్యాలయంలోని భూసార ప‌రీక్ష కేంద్రంలో బాధితురాలు ఒంటిపై యాసిడ్ పోసుకున్నారు. గ‌మ‌నించిన స్థానికులు జీజీహెచ్‌కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఉమాదేవి మృతిచెందారు. న‌గ‌రంపాలెం పోలీసులు వేధింపులే  ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. కోడలి ఫిర్యాదుపై విచార‌ణ పేరుతో ఉమాదేవిని వేధించార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.