అంతర్జాతీయ బాలికా దినోత్సవం!
posted on Oct 14, 2022 9:30AM
బాల్యం, కౌమారం,యవ్వనం దశలో కి చేరినప్పుడు బాలిక బాలురలలో శరీరంలో అనేక మార్పులు వస్తాయి.ఒక వయస్సు వచ్చేసరికి బాలురు,బాలికలలో హార్మోన్ విడుదల ప్రారంభమౌతుంది. హార్మోన్ పిట్యుట రీ గ్లాండ్ కు చేరి వెంటనే గ్లాండ్ రెండు హార్మోన్లను విడుదల చేస్తుంది.లూటినింగ్, ఫాలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ అది బాలికల ఒవేరియన్ ను చేరుతుంది. యుక్తవయస్సు రాగానే శరీరంలో మార్పులు వాస్తాయి బరువు పెరగడం, బాలికలకు వక్షోజాలు రావడం అంటేపెరగడం ఋతుస్రావం నెలసరి ప్రారంభమౌతుంది.శరీర మార్పులు మానసిక మార్పులకు దారితీస్తుంది.
తల్లి తండ్రులు యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు..
యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో సరిగా వ్యవహరించక పోవడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి వారితో దురుసుగా ప్రవర్తించడం వారిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కొన్నిరకాల సమస్యలకు పిల్లలకు అవగాహన కల్పించడం లో ను పిల్లల ను వారిసమస్యలను అర్ధం చేసుకోక పోవడం లో వారి సమస్యకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లో ఏమాత్రం తాత్సారం చేసిన పిల్లల మనో భావాలు దెబ్బతినడం వల్ల వచ్చే శారీరక మానసిక సమస్యలకు సమాధానం చెప్పగాలిగినప్పుడే పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంబంధాలు బాగుంటాయి.ముఖ్యంగా బాలికలలో వచ్చే మార్పుల వల్ల వారిలో వచ్చే శారీరక మార్పులు సహజమే అని వక్షోజాలు పెరగడం సహజమే అని వారిలో రుతుశ్రావ సమస్యలు వచ్చినప్పుడు తల్లి ఆమెతో చర్చించాలి వారు అసమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో కూడా చెప్పడం తల్లి తండ్రుల బాధ్యత.ఇక మగపిల్లలో వచ్చే మార్పులు వస్తున్నపుడు వారిని గమనించడం ఇతర అంశాల కన్నా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు,మానసికంగా ఎదురయ్యే సవాళ్లు లక్ష్యం దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక మార్గదర్శిగా సామాజికంగా ఇతరులతో వ్యవహరించేతీరు పలు అంశాల పై పిల్లకు చెప్పడం అవసరం అప్పుడే పిల్లలు వక్రమార్గం లో కాక సక్రమైన మార్గం తండ్రి,తండ్రి అడుగుజాడల్లో నడవడానికి వీలుంది.