బరువు పెరగడం

1. మీకు ఎప్పుడు జలుబు చేసినట్లుగా అనిపిస్తుంటుందా? మందకొడిగా వుంటారా? మలబద్దకం వుందా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)

2. మీరు స్త్రీలైతే - గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? లేదా, మీకు బహిష్టు ఆగిపోయే వయసు వచ్చేసిందా?

హార్మోన్ల తేడాలు

3. స్టిరాయిడ్స్ కలిసిన మందులేవన్నా వాడుతున్నారా?

మందుల దుష్పలితం

4. కొద్దిపాటి శ్రమకే ఆయాసపడుతున్నారా? అలాగే, పాదాలూ, మడిమలూ. వాస్తున్నాయా?

గుండె కండరాలు బలహీనపడటం (హార్ట్ ఫెయిల్యూర్)

 

శారీరక అవసరాలకు మించి తీసుకునే ఆహారం ద్వారా శక్తి ఎక్కువగా విడుదలవ్వటమూ, అలా విడుదలైన శక్తిని వినియోగించుకోవాల్సిన అవసరం లేకపోవడమూ అనే రెండు అంశాల కారణంగా - అంటే, విడుదలయ్యే శక్తికి, అది ఖర్చయ్యే తీరుకీ మధ్య సమతూకం దెబ్బతినడం వల్ల నరువు పెరుగుతారు. అయితే, కొన్ని సార్లు బరువు పెరగడానికి కారణం ఆహారం కాకుండా మరేదైనా కావచ్చు, అదెలాగో చూద్దాం.

 

1. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం) నిస్సత్తువ, నిత్య రొంప, మలబద్దకం అనే లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీని వల్ల విపరీతంగా బరువు పెరిగి పోతుంటారు. వెంట్రుకలు పలచనవుతాయి. చల్లటి వాతావరణాన్ని భరించలేరు. చమట పట్టదు. ఫలితంగా చర్మమెప్పుడు పొడిగా వుంటుంది. వీటన్నిటితోపాటు మనిషిని నిలువెల్లా నిరాశా నిస్పృహలు, అత్మనూన్యతా భావాలు కమ్ముకొని వుంటారు. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు శరీర క్రియను వేగవంతం చేసే మందులను వాడాల్సి ఉంటుంది.

 

ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకర ధ్వజ సింధూరం, పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం. స్వర్ణక్రవ్యాధి రసం, వసంత కుసుమాకర రసం, ఆరోగ్య వర్ధిని వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగుఉలు, కాంచనారా గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజు గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజు గుగ్గులు, భృంగరాఙాసపం, ధాత్రీలోహం, కుమార్యాసవం, కాంత వల్లభ రసం, లోహాసవం, లోహ రసాయనం, లోకనాధ రసం, నవాయన చూర్ణం, ప్రాణదా గుటిక రజత లోహ రసాయనం, స్వర్ణమాక్షీక భస్మం, స్వర్ణకాంత వల్లభ రసం, సప్తామృత లోహం.

 

2. హార్మోన్ల తేడాలు: హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వల్ల శరీరంలో నీరు ఎక్కువగా చేరుతుంది. దీని ఫలితంగా శరీరం బరువుగా తయారవుతుంది. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలలో ఇలా జరుగుతుంది. సమస్య వీటితోనైతే ఈ మాత్రల వాడకాన్ని ఆపేయాలి. ఇలాగే, రాజోనివృత్తి (మెనోపాజ్) సమయంలో కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు మెనోపాజ్ కి సంబంధించిన 'సహాయక చికిత్స' తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.

ఔషధాలు: అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాది వటి, కళ్యాణక ఘృతం, క్షీరబాలా తైలం (101 ఆవర్తాలు), నష్టపుష్పాంతక రసం, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.

 

3. మందుల దుష్పలితం: రుమాటిజం, క్యాన్సర్ మొదలైన వ్యాధుల్లో కొంతమంది స్టీరాయిడ్స్ కలిసిన మందుల్ని వాడుతుంటారు. చాలా కాలం నుంచి స్టీరాయిడ్స్ వాడాల్సి వచ్చినప్పుడు, అదీ హెచ్చు మోతాదుల్లో తీసుకుంటున్నప్పుడు శరీరపు బరువు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ స్టీరాయిడ్స్ వల్లనే లావెక్కుతుంటే ఆ విషయం మీకు ట్రీట్ మెంట్ చేసున్న డాక్టరుకు చెప్పండి; మందుల మోతాదును సరిచేయటమో, లేక మరేదైనా మందును సూచించడమో చేస్తారు.

 

4. గుండె కండరాలు బలహీనపడటం (హార్ట్ పెయిల్యూర్) కొద్దిపాటి శ్రమకే అయాసపడటం, పాదాలూ, మదిమలూ వాయడం వంటివి గుండె కండరాలు దెబ్బతినడాన్ని సూచిస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. గుండె సమర్థవంతంగా పని చేయనప్పుడు (హార్ట్ ఫెయిల్యూర్) రక్తనాళాల్లోని రక్తం ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. ఇలాంటి రక్తం నుంచి కొంత ద్రవాంశం చుట్టుపక్కల కణజాలాల మధ్యకు చేరుకొని సంచితమవుతుంది. దీంతో కొద్ది కాలంలోనే శరీరపు బరువు అనూహ్యంగా పెరుగుతుంది. ఈ స్థితి ఏర్పడినప్పుడు గుండె మీద వత్తిడిని తగ్గించేందుకుగాను మూత్రాన్ని జారీచేసే మందుల్ని వాడవలసి ఉంటుంది. ఈ లక్షణంతో పాటు, ఒకవేళ పెదవులు, నాలుక, కాళ్లు, చేతులూ నీలంగా మారితే వెంటనే వైద్య సహాయం పొందాలని గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రమాదకరమైన లక్షణాలు.

ఔషధాలు: (మూత్రల ఔషధాలు / మూత్ర విరేచనీయ ఔషధాలు / డైయూరిటిక్స్)- చంద్రప్రభావటి, దుగ్ధవటి, గోక్షురాది గుగ్గులు, గోక్షురాది చూర్ణం, గుడ పిప్పలి, కర్పూర శిలాజతు భస్మం, పునర్నవాది మండూరం, ప్రాణదా గుటిక, శతావరి ఘృతం, శతావరి లేహ్యం, శోథారి మండూరం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం.