రక్తనాళాలు:

 

1. కడుపులో పిసుకుతున్నట్లు నొప్పి రావడంతోపాటు, ఆహారం తీసుకున్న తరువాత మలద్వారం నుంచి రక్తం పడుతుందా?

పేగుల కండరాలకు రక్తసరఫరా తగ్గటం (మిసెంటరిక్ యాంజైనా)

2. నొప్పి తీవ్రంగా ఉండటంతోపాటు వీపు / నడుము ప్రాంతంలోకి విస్తరిస్తుందా?

బృహద్దమని చీరుకుపోవడం (అయోర్టిక్ ఎన్యూరిజం)

 

చాలా అరుదుగా, ఉదర ప్రాంతంలో ఉండే బృహద్దమని గట్టిపడిపోయి చీరుకుపోయే అవకాశం ఉంది. ఈ కారణాలచేత కూడా ఈ ప్రదేశంలో నొప్పి రావచ్చు.

 

1. పేగుల కండరాలకు రక్తసరఫరా తగ్గటం (మిసెంటరిక్ (యాంజైనా):

గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గితే ఏ విధంగా గుండెనొప్పి వస్తుందో, అదేవిధంగా పేగులకు చేరే రక్త సరఫరాలో లోపం ఏర్పడితే ఉదర ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఈ స్థితిలో కడుపునొప్పితో పాటు మలద్వారం నుంచి రక్తం పడే అవకాశం కూడా ఉంది. దీనికి తదుపరి పరీక్షలు అవసరమవుతాయి.

2. బృహద్దమని చీరుకుపోడటం (అయోర్టిక్ ఎన్యూరిజం):

రక్తపోటు తీవ్రంగా ఉన్నప్పుడూ, కొలెస్టరాల్ అధికంగా, ఉన్నప్పుడూ, బృహద్దమని చీరుకుపోయి తీవ్రస్థాయిలో నొప్పి కలిగేందుకు అవకాశం ఉంది. దీనికి కూడా వైద్యసహాయం తీసుకోవాలి. దేనికి సత్వర చికిత్స అవసరమవుతుంది.