యోగా లో జాగ్రత్తలు

యోగా లో జాగ్రత్తలు యోగ చేయడమన్నది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ యోగ వైపు మొగ్గు చూపుతున్నారు . యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా, అది చేసే ముందు కొన్ని విషయాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా యోగాసనాలు చేయడానికి నేలమీద టవల్ పరచి చేస్తుంటారు. అయితే టవల్ కన్నా సూపర్ మార్కెట్ లో దొరికే యోగా మేట్ వాడటం మంచిది అంటున్నారు యోగ నిపుణులు. యోగ చేసే గది లేదా ఆ ప్రదేశంలో ఎలాంటి  ఫర్నీచర్ లేకుండా చూసుకోవడం అవసరం. యోగ చేసే గది వాతావరణం మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాక ఆ గదిలోని ప్రశాంతతకు భంగం కలగకుండా కూడా చూసుకోవాలి. వారంలో రెండూ లేదా మూడు సార్లు అని కాకుండా ప్రతిరోజూ యోగా చేసే విధంగా మీ దినచర్యని మార్చుకోండి. అలా చేయడానికి వీలున్నప్పుడే యోగా మొదలుపెడితే  ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. యోగ చేయడం ఎవరికోసమో అన్నట్లు కాకుండా మీ కోసమే మీరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఆహారం తీసుకున్న రెండు గంటల తరవాత యోగ చేయడం మంచిది. యోగ చేసే ముందు చాక్లెట్ లు, కాఫీ, ఆల్కహాల్, ఉల్లిపాయ , పుల్లటి పండ్లు, స్పైసీ లేదా మసాల నిండిన ఆహారం , ఇంకా మాంసాహారం తీసుకోకూడదు.. యోగ చేస్తున్నంత కాలం తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. అందువల్ల అనుకున్న రీతిగా బరువుతగ్గడం, సౌందర్య పోషణ వంటి ఫలితాల్ని త్వరగా పొందగలుగుతారు . కొన్ని సందర్భాలలో మీ శరీరం యోగ చేయడానికి సహకరించకపోవచ్చు. అలాంటి  సందర్భాలలో మొండిగా యోగ చేయడానికి ప్రయత్నించక, విశ్రాంతి తీసుకోండి. యోగ చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో చేస్తేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు.  

read more
గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల గర్భస్రావం జరుగుతుందా...

  గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల గర్భస్రావం జరుగుతుందా...   గర్భధారణ సమయంలో స్త్రీల మనస్సులలో అనేక రకాల భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమి చేయడం సురక్షితం,  ఏమి చేయకూడదు, ఏమి తినవచ్చు,  ఏమి తినకూడదు వంటి వాటి గురించి చాలా భయాలు ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణించడం సరైనదేనా? అదేవిధంగా, గర్భధారణ సమయంలో యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా?  లేదా యోగా చేస్తే మంచిదేనా అనే గందరగోళంలో కూడా ఉంచారు.   అదేవిధంగా కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో యోగా చేయడం గర్భస్రావానికి దారితీస్తుందా అని కూడా అయోమయానికి లోనవుతారు.  యోగా అనేది ఫిట్నెస్ కు  సంబంధించిన చర్య కాబట్టి ఈ విషయం పూర్తీగా తెలుసుకుంటే మంచిది. యోగా గురించి మహిళల విభిన్న భయాలు,  అపోహలను తొలగించడాని ప్రముఖ వైద్య నిపుణులు కొన్ని విషయాలను స్పష్టంగా తెలియజేశారు. మొదటి త్రైమాసికం.. గర్భధారణ మొదటి త్రైమాసికంలో (0 నుండి 13 వారాలు)  యోగా చేయడం సురక్షితమని వైద్యులు అంటున్నారు. అయితే ఇది సరైన టెక్నిక్‌తో, నిపుణుల పర్యవేక్షణలో,  కొన్ని ఆసనాలను మాత్రమే  చేయడం మంచిది. అలా కాకుండా సొంతంగా చేయడం చాలా ప్రమాదం. శ్వాస వ్యాయామాలు మేలు.. గర్భధారణ  సమయంలో మహిళలు సున్నితమైన,  బుద్ధిపూర్వక యోగాను అవలంబించవచ్చని డాక్టర్ చెబుతున్నారు, శ్వాస వ్యాయామాలు,  తేలికగా శరీరాన్ని  సాగతీసే  భంగిమలు శరీరానికి,  మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. ఆధారాలు.. సున్నితమైన,  తేలికైన యోగా సులభంగా గర్భస్రావం కలిగిస్తుందని నిరూపించడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవట.  వాస్తవానికి యోగా సరైన టెక్నిక్,  జాగ్రత్తతో చేస్తే, అది గర్భిణీ స్త్రీలకు సురక్షితంగా ఉండటమే కాకుండా నివారణగా కూడా ఉంటుంది. తీవ్ర వ్యాయామాలు.. గర్భధారణ ప్రారంభ దశలో మహిళల శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయని, దీని కారణంగా అలసట, తలతిరుగుడు లేదా వికారం వంటి ఫిర్యాదులు సర్వసాధారణమని  వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలను నివారించాలి, ఎందుకంటే ఇది శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామాలు, యోగా చేసే విషయంలో గర్భం దాల్చిన మహిళలు వైద్యుల సలహా లేకుండా ఏదీ చేయకూడదు.                                       *రూపశ్రీ.

read more
యోగాతో స్ట్రెస్ ను తరిమికొట్టవచ్చు

యోగాతో స్ట్రెస్ ను తరిమికొట్టవచ్చు   స్ట్రెస్ అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. అబ్బో వత్తిడి, అయ్యో, నరాలు చిట్లిపోతున్నట్లు ఉన్నాయి.. స్ట్రెస్ ను తట్టుకోలేక పోతున్నాం అనే ఫిర్యాదులు అంతటా వినిపిస్తున్నాయి.ఎల్ కేజీ పిల్లలు మొదలు రిటైర్మెంట్ కి దగ్గరపడిన పెద్దల వరకూ కోట్లాదిమంది ఎదుర్కొంటున్న సమస్య స్ట్రెస్. ఎందుకింత స్ట్రెస్ అంటే మితిమీరిన పోటీ అనేది మొదటి సమాధానం. తర్వాత ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. ఏ కారణం చేత అయితేనేం నిజంగానే చాలా చాలామంది నరాలు చిట్లేంత వత్తిడికి గురవుతున్న మాట నిజం. మరి ఈ స్ట్రెస్ ను నివారించే మార్గాలు లేవా అంటే, తప్పకుండా ఉన్నాయి. పనిలో నైపుణ్యం సంపాదించడం ఒక మార్గం కాగా ప్రాణాయామం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరో దివ్యమైన మార్గం. రోజూ చేసే పనులకు తోడు మరేమైనా ఇతర పనులు చేయాల్సి వచ్చినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. ఓపిక తగ్గినప్పుడు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేకపొతే స్ట్రెస్ ఎక్కువౌతుంది. పోటీ ప్రపంచంలో టార్గెట్లు రీచ్ కాలేనప్పుడు మరింత వత్తిడి కలుగుతుంది. ఏ రకంగా అయితేనేం స్ట్రెస్ తో బాధపడుతున్నాం అని కంప్లైంట్ చేసేవారంతా రోజూ ఓ గంటసేపు బ్రీతింగ్ ఎక్సర్ సైజు  చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజు  వత్తిడిని ఎలా నియంత్రిస్తుంది, ఇవన్నీ వట్టి మాటలు అని కొందరు నమ్మరు. బ్రీతింగ్ ఎక్సర్ సైజు కల్పతరువు అని అర్ధం చేసుకోకపోగా ఎగతాళి చేస్తారు. ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప బ్రీతింగ్ ఎక్సర్ సైజు లోని గొప్పతనం అర్ధం కాదు. ఇంతకీ బ్రీతింగ్ ఎక్సర్ సైజు ఎలా చేయాలో చూద్దాం. ఉదయాన్నే  ప్రశాంత వాతావరణంలో తాజా గాలి వచ్చే ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. కుడిచేతి చూపుడు వేలితో ఒక నాసికారంద్రాన్ని మూసి ఉంచి, రెండో నాశికా రంధ్రంతో నిండా గాలి తీసుకోవాలి. మూసి ఉంచిన వేలిని తీసి ఆ రంధ్రం లోంచి పూర్తిగా శ్వాస వదలాలి. తర్వాత రెండో రంధ్రాన్ని మూసి మొదటిదానితో శ్వాస పూర్తిగా తీసుకోవాలి. ఇలా మార్చి మార్చి చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేసేటప్పుడు ఆలోచనలను సైతం నివారించే ప్రయత్నం చేయాలి. ఇది అంత తేలికేం కాదు. మనసు చాలా చంచలమైనది. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూనే ఉంటాయి. మనసు స్థిరంగా లేదని గ్రహించినప్పుడల్లా దాన్ని శ్వాస మీదికి మళ్ళించాలి. రోజులో ఓ గంటసేపు ఈ బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేయగలిగితే స్ట్రెస్ అనేది మన దరిదాపులకు రాదు. వీలు చిక్కితే, పొద్దున్న, సాయంత్రం రెండు గంటలు గనుక బ్రీతింగ్ ఎక్సర్ సైజు కు కేటాయించగలిగితే ఆరోగ్యం, ఆనందం మన సొంతమౌతాయి. రోజూ బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేయలేనివారు కనీసం బాగా స్ట్రెస్ ఫీలౌతున్నప్పుడు అయినా చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజు శారీరకంగా, మానసికంగా కూడా చెప్పలేనంత మేలు చేస్తుంది. స్ట్రెస్ నుండి బయటపడేస్తుంది. తలనొప్పులు, వికారం లాంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మానసిక జబ్బులను తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఒక్కోసారి  స్ట్రెస్ ఎక్కువై కర్తవ్యం బోధపడదు. మైండ్ బ్లాంక్ గా మారుతుంది. దిక్కుతోచనట్లు అయోమయంగా ఉంటుంది. విసుగు, అసహనం ఎక్కువౌతాయి. ఏ పనీ చేయలేని నిస్సహాయత చోటుచేసుకుంటుంది. అలాంటప్పుడు బ్రీతింగ్ ఎక్సర్ సైజు మంత్రంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బ్రీతింగ్ ఎక్సర్ సైజు ప్రాక్టీసు చేసేవారు ఎట్టి పరిస్థితిలో వత్తిడికి గురవ్వరు. ఎలాంటి సమస్యనయినా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. క్లిష్ట సమయాల్లో, స్ట్రెస్ ఫుల్ సిట్యుయేషన్ల లో కూడా సమర్ధవంతంగా పని చేయగల్గుతారు. అదీ, బ్రీతింగ్ ఎక్సర్ సైజు లేదా ప్రాణాయామం గొప్పతనం.  

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
అలసటను తీర్చే శవాసనం

అలసటను తీర్చే శవాసనం   ఆసనాల్లో మకుటాయమానం - శవాసనం యోగ సాధనలో శవాసనం (savasana)ఎంతో ముఖ్యమైంది. శవాసనాన్ని "మృతాసన" అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం అని అర్థం. మృతి చెందినప్పుడు ఎలా పడుకోబెడతామో శవాసనం లోనూ అలా పడుకుంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైన ఆసనం. అయితే దీనిపైన పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలోగాని, అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది. ఉదయం యోగాసనాలతో పాటు మాత్రమే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు, అలా చేయడం వలన మనస్సు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. మనస్సు .శాంతంగా వుంటుంది. ఈ ఆసన సమయంలో శరీరం అంతటా ప్రాణశక్తి తిరుగుతూ వున్నట్టుగా అనిపించడం ఈ ఆసనం యొక్క ప్రత్యేకత. శవాసనం వలన పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా సహజ సిద్ధమైంది కనుక మనస్సును, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకు వెళుతుంది. శరీరానికీ మనస్సుకూ విశ్రాంతి అవసరమైన సమయంలో శవాసనం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంద్ర స్థాయిలో శ్లోకాలు లేదా మనస్సుకు హాయిని గొలిపే పాటలు లేదా మాటలు వింటూ ఈ ఆసనం ఆచరిస్తే ధ్యానస్థితిని చేరుకుంటాము. శవాసనం చేసే పద్ధతిః నేలపై తివాచీ లేదా yoga mat పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ... ఒకటి, లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. ఏవైపుకు వుంచితే హాయిగా వుంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి వుంచాలి. కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా వుంచాలి. మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలుః మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా, చికాకుగా, దిగులుగా ఆందోళనగా అలిసిపోయినట్లుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా వున్నపుడు శవాసనం ఎంతో ఉపయోగకారిగా వుంటుంది. శరీర కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. కండరాలు పూర్తి విశ్రాంతిని పొంది, ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది. దృష్టిని మనస్సు పై కేంద్రీకరించడం వలన మెదడు బాగా విశ్రమిస్తుంది. వీపు వెనుక, దిగువ భాగాన లేదా పొత్తికడుపు నొప్పి వున్నా శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. అలసటకు, ఒత్తిడికి గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతిని కలిగించవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం వుంటుంది. ప్రెగ్నెంట్‍ గా వున్న సమయంలో పగటి పూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా వున్నప్పుడు శవాసనం వేయవచ్చు. సాధారణ ప్రయోజనాలు తలనొప్పి, తలతిరగడం, మానసిక నీరసం, చికాకు, తుంటి నరం నొప్పిలాంటి వాటి నుంచి ఉపశమనం. శరీరం మనస్సు పూర్తి విశ్రాంతి పొందుతాయి. శరీర భాగాలన్నింటికీ ఈ అనుభూతి తెలుస్తుంది. మనస్సు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది. బాగా వ్యాయామం చేసి అలిసి పోయాక కండరాలకు విశ్రాంతి అవసరం. ఈ ఆసనం వేస్తే కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి, ప్రశాంతత ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాలు నిర్వహించే పనులకు ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం ద్వారా లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్‍ అవసరమైతే రక్త ప్రసరణ కూడా అధికం అవుతుంది. ఈ ఆసనం వల్ల రక్తనాళాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. శవాసనం వేసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది. అన్ని శరీర భాగాల కార్య కలాపాలు నెమ్మదిగా జరుగుతాయి. ఈ ఆసనాన్ని ఆచరించినట్లయితే అంతరంగిక కార్య కలాపాలన్నీ తగ్గిపోయి, శ్వాస తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు తిరిగి ఈ ప్రక్రియ అంతా నెమ్మదిగా కొత్తగా ప్రారంభమవుతుంది. దీర్ఘకాలంగా, తీవ్రంగా జబ్బు పడిన వ్యక్తుల శరీరం, మనస్సు తిరిగి కోలుకుంటుంది. శవాసనం మనిషిని బాగా ఉత్సాహపరుస్తుంది. మళ్ళీ తాజాగా శరీరం తయారై పని చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. నిద్రలేమి, అధిక లేదా తక్కువ రక్తపోటు, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. రక్త ప్రసరణ తిరిగి మామూలు స్థితికి వస్తుంది. హృదయ సంబంధమైన వ్యాధులు, మానసిక వత్తిళ్ళు, అలసట, స్వల్ప దిగులు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేసినట్లయితే కోపం అదుపులో వుంటుంది. చికాకు పరిచే ఆలోచనలు ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  

read more
యోగా చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  యోగా చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యోగా చేయడమన్నది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకూ అందరూ యోగ వైపు మొగ్గు చూపుతున్నారు. యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా, అది చేసే ముందు కొన్ని విషయాలను తప్పక పాటించవలసి వుంటుంది. అవేమిటంటే.. * సాధారణంగా యోగాసనాలు చేయడానికి నేలమీద టవల్‍ పరచి చేస్తుంటారు. అయితే టవల్‍ కన్నా సూపర్‍ మార్కెట్లలో దొరికే యోగ మేట్‍ (yoga mat) వాడటం మంచిది అంటున్నారు యోగ నిపుణులు. * యోగ చేసే గది లేదా ఆ ప్రదేశంలో ఎలాంటి ఫర్నీచర్‍ (furniture) లేకుండా చూసుకోవడం అవసరం. * యోగ చేసే గది వాతావరణం మరీ వేడిగా లేదా చల్లగా వుండకూడదు. సాధార్ణ ఉష్ణోగ్రతలు వుండేలా చూసుకోవాలి. అంతే కాక ఆ గదిలోని ప్రశాంతతకు భంగం కలగ కుండా కూడా చూసుకోవాలి. * వారంలో రెండు లేదా మూడు సార్లు అని కాకుండా ప్రతిరోజూ యోగా చేసేవిధంtగా మీ దినచర్యని (routine) మార్చుకోండి. అలా చేయడానికి వీలున్నపుడే యోగా మొదలుపెడితే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. * యోగ చేయడం ఎవరికోసమో అన్నట్లు కాకుండా మీకోసమే మీరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. * ఆహారం (food) తీసుకున్న రెండుగంటలతరువాత యోగా చేయడం మంచిది. * యోగ చేసే ముందు చాక్లెట్లు (chacolates), కాఫీ(coffee), అల్కహాల్‍ (alcohol), ఉల్లిపాయ (onion), పుల్లటి పండ్లు, స్పైసీ లేదా మసాలా నిండిన ఆహారం, ఇంకా మాంసాహారం తీసుకోకూడదు. * యోగా చేస్తున్నంత కాలమూ తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. అందువల్ల అనుకున్నరీతిగా బరువుతగ్గడం, సౌందర్య పోషణ వంటి ఫలి౮తాల్ని త్వరగా పొందగలుగుతారు. * కొన్ని సందర్భాలలో మీశరీరం యోగ చేయడానికి సహకరించక పోవచ్చు. అలాంటి సందర్భాలలో మొండిగా యోగా చేయడానికి ప్రయత్నించక, విశ్రాంతి తీసుకోండి. * యోగ చేసేముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో చేస్తేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు.

read more
యోగాతో మెనోపాజ్ సమస్యలకు స్వస్తి

యోగాతో మెనోపాజ్ సమస్యలకు స్వస్తి నడివయసు దాటిన స్త్రీలకు మెనోపాజ్ చాలా సహజమైంది. మెనోపాజ్ దశలో స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. యోగాతో ఈ మెనోపాజ్ సమస్యలను నివారించుకోవచ్చు. అవును, ప్రత్యేకమైన మెడిసిన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే యోగా సాయంతో మెనోపాజ్ దశలోనూ హాయిగా, ఆనందంగా ఉండొచ్చు. అదెలా అంటారా? పూర్తిగా చదవండి... * మెనోపాజ్ దశలో శరీరం స్త్రీ సహజమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపుతుంది. నెలసరి ఆగుతుంది. సంతానోత్పత్తి లాంటి చర్యలు ఆగిపోతాయి. ఈ మార్పుల వల్ల శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. నిద్ర కరువౌతుంది. ఆకలి తగ్గుతుంది. ఆహారమే కాదు, నీళ్ళు కూడా తాగాలనిపించదు. ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. * కొందరు ఆడవాళ్ళు ఆస్టేపొరోసిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇక పైకి ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాల్లో కోపం, విసుగు, అసహనం ప్రధానమైనవి. శరీరంలో జరిగే మార్పుల వల్ల ఓర్పు నశిస్తుంది. అతి చిన్న విషయాలకు కూడా అతిగా రియాక్ట్ అవడం, ఎవరోఒకరి మీద , ఏదో ఒక అంశమై అరవడం చూస్తుంటాం. * ఈ రకమైన మెనోపాజ్ సమస్యలను తరిమి కొట్టేందుకు యోగాలో ఎంబ్రయో పోజ్ చాలా ఉపయోపడుతుంది. ఇది ఎలా చేయాలంటే ముందుగా బోర్లా పడుకోవాలి. పొట్ట మీద బరువు మోపుతూ తల వీలైనంత పైకి ఎత్తాలి. రెండు కాళ్ళూ దగ్గరగా ఉంచి పైకి ఎత్తి, చేతులను వెనక్కి పోనివ్వాలి. ఇప్పుడు కుడి చేత్తో కుడి కాలును, ఎడం చేత్తో ఎడమ కాలిని పట్టుకోవాలి. శ్వాసను మెల్లగా, పూర్తిగా తీసుకుంటూ, అంతే మెల్లగా, సంపూర్తిగా వదలాలి. * రోజూ క్రమం తప్పకుండా ఈ ఎంబ్రయో యోగాసనం అరగంట పాటు చేసినట్లయితే, మెనోపాజ్ సమస్యలు దూరమౌతాయి. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి.

read more
ప్రాణాయామం సర్వరోగనివారిణి

  ప్రాణాయామం సర్వరోగనివారిణి యోగ ఈనాటిది కాదు. అతి ప్రాచీనకాలంలో మహర్షులు ఆచరించి అద్భుతాలు సాధించారు. అయితే యోగసాధన మరుగున పడిపోయింది. దీనికి రావలసినంత ఖ్యాతి రాలేదు. అందుబాటులో ఉన్న అమూల్యమైన ధనాన్ని వెచ్చించడం చేతగాక పక్కన పడేశాం. కొంత ఆశాజనకమైన మార్పు ఏమిటంటే కొన్నేళ్లుగా యోగ గొప్పతనం కొందరికైనా తెలిసివచ్చింది. యోగ మహత్తు తెలిసిన కొందరు యోగాసనాలు ప్రాక్టీసు చేస్తున్నారు. యోగ భంగిమలు, ఆసనాలు చేసే మేలు గ్రహించి తమకు అనుకూలమైన ఆసనాలను ఎంచుకుని సాధన చేస్తున్నారు. సత్ఫలితాలను పొందుతున్నారు. కాళ్ళు, చేతులు, నడుము, వెన్నెముక, భుజాలు, పాదాలు - ఇలా మన శరీరంలో ప్రతి భాగాన్నీ బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా రూపొందించుకుంటున్నారు. వివిధ ఆసనాల సంగతి అలా ఉంచితే శ్వాస (బ్రీతింగ్ టెక్నిక్) చాలా ముఖ్యమైంది. ఇది ఒకరకంగా ధ్యానం. శ్వాసకోశల నిండా ఊపిరి తీసుకుని, పూర్తిగా విడిస్తే చాలు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇది సర్వరోగనివారిణి అంటే అతిశయోక్తి కాదు. రోజూ ప్రాణాయామం చేసేవారికి అసలు జబ్బులనేవి దరిదాపులకు రావని ఎందరో యోగ సాధకులు స్వానుభవంతో చెప్తున్నారు. యోగ ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాదు, ఆనందాన్నీ ఇస్తుంది. ధ్యానంతో మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. అలసట, శ్రమ, ఒత్తిడి తెలీవు. ప్రశాంతత సొంతమౌతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తప్రసరణ నియంత్రణలో ఉంటుంది.

read more
Kundalini Yoga

Kundalini Yoga kundalini yoga, kundalini yoga in telugu, Kundalini Yoga Postures: Kundalini yoga is a physical, mental and spiritual discipline for developing strength, awareness, character, and consciousness. Preaching a message of drug free living and alternative ways of getting high, the teachings of kundalini yoga became a way for anyone to experience higher states of consciousness.  Kundalini Yoga is a physical and meditative discipline that combines postures (asanas), breath (pranayama), and the chanting of mantras. Kundalini refers to the energy that lays dormant at the base of the spine. Through the practice of yoga, this energy is raised and travels up the spine, through the chakras, creating an overall sense of well being and a heightened sense of awareness. The word Kundalini literally translates as a “coiled female serpent.” Traditionally the techniques of Kundalini were only communicated from Master to disciple and through a long initation process. In 1969 Yogi Bhajan began teaching kundalini yoga openly to the public. Yogi Bhajan defines yoga as such: “Yoga means a discipline of mind and body. There is nothing mysterious about it. Yoga does not explain the meaning of life... It’s aim is to develop a quality of mind which can perceive reality and acquire self knowledge.” There are no inverted postures in Bikram yoga, unless you are in a master class. Bikram felt that most beginners could not safely do inversions, and that other poses provided the same benefits as inversions.   Why Learn Kundalini Yoga? * Stress breaks down the systems of the body opening it to all other forms of disease and discomfort.  * The massive explosion in interest in yoga and mediation in the 21st century is testament to the fact that people are in need of relaxation, ways of finding inner calm, and physical well being. * The average person is subject to as much information in 1 week as our great great great grand parents were exposed to in their whole lives. Between, iphones, blackberry's, tv, internet, the radio, not to mention advertising, the human psyche is bombarded with information at a non stop rate. Without a buffer zone for the mind, this data acts as 24/7 bombardment of emotional manipulation caussing mental overload, or what we call stress. * This "buffer zone" of the mind can be developed through yoga and mediation. And with the advent of computers and the rise of the knowledge based economy, many of us are sedentary for hours at a time. * Yoga is the best form of exercise for maintaining health as it rebuilds the body through stretching and strengthening exercises. * Through the practice of Yoga and Meditation, even for a very short period of time, major improvements in physical health and mental clarity are possible. It is also a lot of fun.  

read more
ఆడవారిలో ఋతు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే సర్వాంగాసనము!

ఆడవారిలో ఋతు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే సర్వాంగాసనము! నేటి ఆధునిక జీవన శైలిలో మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆడవారికి శారీరక సమస్యలు అన్ని హార్మోన్ల ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి. శరీరంలో వివిధ అవయవాలు ప్రభావం చెందటం వలనా…. వాటి పనితీరు మందగించడం వలనా… శరీర స్థితి మార్పుకు లోనవుతుంది. వీటన్నిటికీ చక్కని పరిష్కారం యోగ.. యోగాలో సర్వాంగాసనము గొప్ప ఫలితాలను ఇస్తుంది. అది ఏ విధంగా వేయాలి?? దాని ప్రయోజనాలు ఏంటి?? వంటివి తెలుసుకుంటే…  సర్వాంగాసనం... సర్వాంగ అంటే అన్ని అవయవాలు అని అర్థం. ఈ ఆసనం వేయటం వల్ల, శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా మహిళలలో ఎదురయ్యే థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల  "థైరాయిడ్" అనే గ్రంథి నియంత్రించ బడుతుంది. వేయవలసిన విధానం :  శిరస్సు నుంచి, పాదాల వరకూ సరిగ్గా ఉండేలా వెన్నముకను భూమికి ఆనించి నేలపై పడుకోవాలి.ఇది శవాసన భంగిమలో ఉండటం అన్నమాట. ఇలా ఉన్న భంగిమ నుండి  చేతులు తలకు ఇరువైపులా తిన్నగా వెనక్కు ఉంచాలి. ఇప్పుడు ఈ స్థితిలో నేల నుంచి 45°(నలభై అయిదు డిగ్రీలు)  కోణంలోకి కాళ్లు రెండూ ఎత్తి ఉంచాలి. అలా 45° నుండి మెల్లగా కాళ్ళను 90° కోణం వరకూ ఎత్తాలి. చేతులను శరీరం పక్కకు ఉంచాలి. తరువాత అరచేతులతో పిరుదులను పట్టుకుని, మోచేతులను భూమికి అన్చి శరీరాన్ని ఇంకా పైకి ఎత్తాలి. చేతులతో బలాన్ని ఉపయోగించి కాళ్ళను అలాగే నిలబెట్టాలి. ఈ భంగిమలో కాళ్లు గాలిలో నేలకి సమాంతరంగా ఉండాలి. కాళ్లు శరీరము ఒక్కలాగే నిటారుగా ఉండేలా భుజాలపైన బరువును ఉంచాలి. తల నేలను తాకుతూ ఉంచాలి. ఇలా కొన్ని సెకండ్ల పాటు ఉన్న తరువాత చేతులను వాదులు చేయాలి, తరువాత  90° నుండి  45° కోణం లోకి రావాలి. ఆ తరువాత కాళ్ళను మెల్లగా కిందకు దించి చేతులను తలకు రెండువైపులా ఉంచాలి. దీని తరువాత శవాసనంలోకి వచ్చి స్థిమితపడాలి.  దీని వల్ల కలిగే శారీరక లాభాలు: ఈ సర్వాంగాసనము వేయడం వలన  మెదడుకు రక్తప్రసారం  చక్కగా జరుగుతుంది. ఆడవారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే  థైరాయిడ్ గ్రంధి నియంత్రించబడుతుంది. ఈ గ్రంధి అసమతుల్యతకు గురి కావడం వలన ఆడవారిలో పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని ఈ ఆసనం ద్వారా నియంత్రించుకోవచ్చు.  ఈ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు:  ఆరోగ్య పరంగా ప్రతి ఆసనం చాలా విశిష్టమైనది, ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మొలలు, హెర్నియా, థైరాయిడ్ మొదలైన జబ్బులకూ, మలబద్ధక సమస్యకూ,  స్త్రీలలో ఎదురయ్యే  ఋతుసంబంధ ఇబ్బందులకూ చక్కని పరిష్కారం పొందగలుగుతాము.  కేవలం శారీరక, ఆరోగ్య లాభాలు మేరమే కాకుండా యోగాసనాల వల్ల ఆధ్యాత్మిక లాభాలు కూడా ఉంటాయి. సర్వాంగాసనము వేయడం వల్ల కలిగే  ఆధ్యాత్మిక లాభాలు  ఏమిటంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, మానసిక శక్తి లభిస్తుంది. తద్వారా మనిషిలో పని చేయగలిగే మానసిక సామర్థ్యం పెరుగుతుంది.  ఈ ఆసనం వేయడానికి కొన్ని సూచనలు:  మానసిక ఆందోళన, నడుంనొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు. జాగ్రత్తలు:  ఆసనం మొదలుపెట్టినప్పుడు కాళ్ళను పైకి ఎత్తేటప్పుడు కాళ్ళను నిటారుగా పైకి లేపాలి. ఆ   భంగిమలో మోకాళ్లు పంచకూడదు. అలాగే కాళ్ళను 45° నుండి 90° లకు తీసుకు వెళ్ళేటప్పుడు బలాన్ని ప్రయోగించే క్రమంలో చాలామంది తల ఎత్తుతారు. ఆ  భంగిమలోకి వెళ్ళేటప్పుడు తల ఎత్తరాదు. శరీరం బరువును  చేతులపైన, భుజాలపైన ఉంచాలి. చివరి భంగిమలో పాదాలను చాచకూడదు. ఈ ఆసనం వేసేటపుడు శ్వాస కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసన సమయంలో శ్వాస ఎలాగుండాలంటే…  కిందకు వంగే ప్రతిసారి గాలి వెలుపలికి విడవాలి. పైకి లేచే ప్రతిసారి గాలి తీసుకోవాలి. చివరి భంగిమలో సాధారణంగా ఉండాలి. ఇదీ సర్వాంగాసనం వేయవలసిన విధానం, ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు.                                     ◆నిశ్శబ్ద.

read more
వెన్ను మీద పట్టు కావాలిప్పుడు!

వెన్ను మీద పట్టు కావాలిప్పుడు! మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఆడవారిలో ఎన్నో రకాల సమస్యలే వీటికి కారణం అవుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు గర్భవతులు అయ్యి డెలివరీ అయిన తరువాత వారిలో ఎముకలు చాలా వరకు బలహీనం అయి ఉంటాయి. వీటిని దృఢంగా చేసుకోవడం ఎంతో ముఖ్యం.  ఈ మధ్య కాలంలో మహిళలలో ఎక్కువగా నమోదు అవుతున్న సమస్యలలో వెన్నెముక బలహీనంగా ఉండటం ప్రధానంగా గుర్తించబడుతోంది. చూడటానికి శారీరకంగా బలంగా ఉన్న చాలా మంది మహిళలలో   ఈ సమస్య అంతర్లీనంగా చాలా ఇబ్బంది పెడుతోంది అంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ అదే నిజమంటున్నారు స్త్రీ మరియు పోషకాహర నిపుణులు. అయితే మహిళలలో ఎదురయ్యే ఈ రకమైన వెన్ను నొప్పి సమస్యలకు మంచి పరిష్కారం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా యోగానే. వెన్నుపూసను బలంగా, దృఢంగా మార్చే యోగాసనం వేస్తే వెన్ను నొప్పిని తరిమికొట్టవచ్చు. సాధారణంగా వెన్ను నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే… ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, పడుకున్నపుడు కూడా కొద్దిసేపు కూడా సరిగా పడుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వెన్ను పూస బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇది మాత్రమే కాకుండా బరువులు ఎత్తేటప్పుడు, వంగి పైకి లేచేటప్పుడు, చురుగ్గా కదలాల్సినప్పుడు కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే అది వెన్నెముక బలహీనంగా ఉండటం వల్ల కలిగే ఇబ్బంది అని గమనించాలి. వెన్ను నొప్పి మీద యోగాస్త్రం:-  వెన్ను నొప్పి తగ్గడానికి ఒకే ఒక్క ఆసనం చాలు చాచి తరిమికొడుతుంది. అది కూడా ఎక్కువ సమయం కాకుండా కేవలం రెండే రెండు నిమిషాల సమయం వెచ్చించగలిగితే వెన్ను నొప్పి మాయమవుతుంది. దీనికి వేయాల్సిన ఆసనం మార్జాలాసనం!! మార్జాలాసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల వెన్ను నొప్పి నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. దీన్ని మార్జాలాసనం అని ఎందుకంటారనే విషయం గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. నిజమే!! ఈ ఆసనం వేసినప్పుడు పిల్లి ఎలా ఉంటుందో అలాంటి భంగిమలో ఉంటుంది శరీరం. కనుకనే దీన్ని మార్జాలాసనం అని అంటారు. ఇంగ్లీష్ లో అయితే క్యాట్ స్ట్రెచింగ్ అని అంటారు.  ఎలా వేయాలంటే… మొదటగా యోగాసనాలు వేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. యోగ మ్యాట్ లేదా మెత్తని దుప్పటి వేసుకుని  ఆసనం మొదలు పెట్టడానికి ముందు రెండు మోకాళ్ళ మీద కూర్చోవాలి.  రెండు చేతులను ముందుకు చాచి అరచేతులను నేలకు ఆనించి ఇప్పుడు మోకాళ్ళ మీద బలం వేసి పైకిలేవాలి. వీపు సమాంతరంగా ఉంటూ చేతులు, మోకాళ్ళ మీద వంగినట్టు ఉంటుంది. ఇప్పుడు కుడి కాలును వెనక్కు సమాంతరంగా చాపాలి. ఎడమచేతిని కూడా సమాంతరంగా ముందుకు చాపాలి. ఎడమ కాలును, కుడి చేతిని వంచకూడదు. ఈ భంగిమలో కొన్ని సెకెన్ల పాటు ఉండాలి. తరువాత ఎడమ కాలును వెనక్కు, కుడి చేతిని ముందుకు చాపాలి. వాటిని సమాంతరంగా ఉంచాలి.   ఈ విధంగా కాళ్ళు చేతులను మారుస్తూ ఆసనాన్ని వెయ్యాలి. ప్రతి ఆసనం కనీసం మూడు సార్ల చొప్పున కనీసం రెండు కలిపి ఆరు సార్లు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితం ఉంటుంది.  ప్రయోజనాలు:-  మార్జాలాసనం వేస్తుందం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఈ ఆసనం వేయడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ముఖ్యంగా వెన్నెముక దృఢంగా మారుతుంది. మహిళలలో చాలామందికి కనిపించే పిరుదులు, నడుము, పొత్తి కడుపు  భాగంలో క్రొవ్వు చేరడం జరగదు. వెన్ను నొప్పిలాగా వేధించే నడుము నొప్పి ఈ ఆసనం వల్ల తగ్గిపోతుంది. అధిక కొవ్వు కలిగి ఉంటే అది క్రమేపీ తగ్గిపోతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే శరీరం కూడా తేలికగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

read more
మంచి అలవాట్లు - దినచర్య

  సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి, అందులోని పనికిరాని మొక్కల్ని తొలగించి, దున్ని, నీరుబట్టి, ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాన్ని అదుపులో వుంచి చెడును తొలగించి మంచిని పెంచితే పురుషార్ధాన్ని సాధిస్తుంది. శరీరాన్ని సత్వపధాన పయనింప చేయుటకు మంచి అలవాట్లు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనస్సును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమ శిక్షణ, సచ్చీలత, సత్సంప్రదాయాల్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే యిప్పుడు రకరకాల ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగి యువకులు, పెద్దవాళ్ళేగాక బాలబాలికలు సైతం చెడు అలవాట్లకు లోనవుతున్నారు.ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు సాధకులకు అలవడుతాయి. దినచర్య, ఆహరం, ఉపవాసం, నీళ్ళు, మలవిసర్జన, మూత్రవిసర్జన, స్నానం, నిద్రలను గురించిన వివరాలు తెలుసుకొని, వాటిని సక్రమంగా అమలుబరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. 1. దినచర్య : ఆరోగ్యంగా వుండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగాను, సక్రమంగాను వుండాలి. అంటే దినచర్య మంచిగా వుండాలన్నమాట. ప్రతిరోజూ రాత్రిళ్ళు త్వరగా పడుకొని ప్రొద్దున్నే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసెడు మంచినీళ్ళు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి, ముఖం కడుక్కొని ఉదయం అవకాశం దొరికితే వాహ్యాళికి వెళ్ళాలి. తరువాత స్నానం చేయాలి. ముఖం కడుక్కునేప్పుడు నాలిక మీడగల పచిని బద్దతో తప్పక గీకివేయాలి. చాలా మంది పుక్కిలించి ఉమ్మి వూరుకుంటారు. అది సరికాదు. అంతే గాక నోటి లోపలి కొండనాలుకను చేతిబోతన వ్రేలితో (గోరు తగలకుండా చూసుకొని) రెండు మూడు సార్లు కొద్దిగా నొక్కి శుభ్రం చేయాలి. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసిన తరువాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్ళకు, నాళికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. సూదులతోను, గుండు సూదులతోను పళ్ళు కుట్టుకోకూడదు. ఏమి తిన్నా నోటిలో నీళ్ళు పోసుకుని రెండు మూడుసార్లు తప్పక పుక్కిలించి ఉమ్మివేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్ళతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ, బాగా జబ్బు పడినప్పుడు గోరు వెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయవచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలుబిగుతుగా వుండక, వదులుగా వుండాలి. ప్రతిరోజూ ఉతికిన బట్టలు ధరించాలి. కొన్ని గ్రామాల్లో యిప్పటికీ ఉతికిన బట్టలు జనం ధరిస్తూ వుంటారు. కానీ అన్ని చోట్ల యిది సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ ఉతికిన బట్టలు ధరించడం అన్ని విధాల మంచిది. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా వున్నట్లు భావించాలి. నిద్రపట్టకపోవడం ఆనారోగ్యానికి గుర్తు, పడుకునే ప్రదేశం శుభ్రంగాను, గాలి వెలుగు వచ్చే విధంగానూ వుండాలి. మంచం లేక చాప, పరుపు, పక్క గుడ్డలు శుభ్రంగా వుండాలి. ఇతరులతో మంచిగాను, తీయగాను మాట్లాడాలి. సత్యం పలుకుతూ వుండాలి. అయితే సత్యం ప్రకటించే విధానం కటువుగా వుండక, మంచిగా మధురంగా వుండాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా ! స్వార్ధచింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు ముఖ్యంగా నిస్సహాయులకు, దీనులకు, రోగులకు సేవ, సాయం, మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యకు ప్రతివ్యక్తి సమీక్షించుకొని, రేపటి దినచర్యను నిర్ధారించుకోవాలి. ఏనాటికానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలకు డైరీలో తేదీల వారీగా వ్రాసుకోవాలి. యీ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే, క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా దేశానికి మేలు జరుగుతుంది.

read more
సైనస్ రిలీఫ్ కోసం ఈ యోగాసనాలు చేయండి!

సైనస్ రిలీఫ్ కోసం ఈ యోగాసనాలు చేయండి!   మన శ్వాసకోశ వ్యవస్థ బాగుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం. కానీ కొన్ని కారణాల వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటాం. మన శ్వాసకోశ వ్యవస్థ మన ముక్కు నుండి ప్రారంభమవుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కుదిబ్బడ ఇబ్బంది పెడుతుంది. దీనిని కొన్ని ఇంటి నివారణలు లేదా ఔషధాల ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ సైనస్ సమస్యను అంత తేలికగా పరిష్కరించుకోవచ్చని చెప్పలేం. కానీ కొన్ని ప్రభావవంతమైన యోగా సాధన ద్వారా, సైనస్ సమస్యను పరిష్కరించవచ్చు. సైనస్ సమస్యకు యోగా రెమెడీ: సైనస్ బాధితులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని యోగా అభ్యాసాలు సైనస్  సమస్యను సులభంగా పరిష్కరిస్తాయి. అలాంటి యోగాభ్యాసాలను ఒకసారి చూద్దాం... ఫ్లో యోగా: ముక్కు రంధ్రాలలో మంట నుండి ఉపశమనం పొందేందుకు ఇది అత్యంత ప్రభావవంతమైన యోగాసనం. ఇది మీ భుజాలు, చేతులు కిందికి చాచి చేయగలిగే యోగా భంగిమ. నౌకాసన యోగా: గోడ సహాయంతో మీ కాళ్లను పైకి లేపే యోగాసనం ఇది. ఇది ముక్కును రద్దీని తగ్గించడంతోపాటు  రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. శరీరంలోని మంటను తగ్గించి మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు కుర్చీపై కూర్చుని, మీ శరీరాన్ని ఒక వైపుకు తిప్పి యోగాసన చేయవచ్చు. ఈ విధంగా తిప్పినప్పుడు, రక్త ప్రసరణ ప్రేరేపితమవుతుంది. శోషరస కణుపుల యొక్క ద్రవ ప్రసరణ కూడా సైనస్ ఏర్పడిన ప్రాంతానికి కదులుతుంది. ఇలా చేయడం వల్ల నాసికా రద్దీ తొలగిపోతుంది. భుజంగాసనం: ఇది మీ ఛాతీని విస్తరించి సైనస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ ప్రాంతం విస్తరించడం వల్ల, ఛాతీ బిగుతు సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఇది మీ వెన్నుపామును బలపరచడంతోపాటు వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది. ప్రాణాయామం: అనులమ విలోమ, కపాల్‌భతి వంటి విభిన్న ప్రాణాయామ పద్ధతులు నాసికా రంధ్రాలను క్లియర్ చేయడంలో పని చేస్తాయి. ఈ అభ్యాసాలు మీ శ్వాస ప్రక్రియను నియంత్రిస్తాయి.  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీంతో ఆక్సిజన్ సరఫరా పెరిగి సైనస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  

read more
హస్త ఉత్తాన ఆసనం

హస్త ఉత్తాన ఆసనం బరువు తగ్గడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం చేస్తే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చంటున్నారు యోగా నిపుణులు. మరి ఆ ఆసనం ఎలా చేయాలో వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ! హస్త ఉత్తాన ఆసనం : * ఉత్తానమంటే పైకి లేపడం. చేతుల్ని పైకి లేపి చేసే ఆసనం గనుక దీన్ని హస్త ఉత్తాన ఆసనం అన్నారు. రెండు చేతులనూ నిటారుగా ఆకాశమువైపు జతగా సాచి నిదానంగా, నిండుగా ఊపిరిని తీసుకుని లోపల బంధించాలి. ఇదే స్థితిలోనడుము పైభాగము నుంచి అర చేతుల వరకూవున్న శరీరాన్ని వీలైనంత వెనక్కి వంచాలి. * ఈ స్థితిలో చేతులు, భుజాలు, ఉదర స్థానం బాగా సాగడంవలన అవి పటిష్టంగా తయారవుతాయి. పొట్ట సాగడంవలన జీర్ణ శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులు బలాన్ని పెంచుకుంటాయి. కొవ్వు కరగటం ద్వారా క్రమంగా బరువు తగ్గుతుంది. * ఈ ఆసనం చేసేటప్పుడు ప్రారంభంలోనే వెన్ను పూర్తిగా వెనక్కి వంచే ప్రయత్నం చేయకూడదు. మొదట్లో కొంతమందికి కళ్ళు తిరిగి చీకట్లు కమ్మి కింద పడే అవకాశం ఉంది. అలా జరిగితే మరోసారి ప్రయత్నించేటప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, కాళ్ళు, పాదాలు తగినంత ఎడంగావుంచి వెన్ను వెనక్కు వంచగలిగే స్థితికి మాత్రమే వంచాలంటున్నారు యోగా నిపుణులు.

read more
ఈ ఆసనాలతో మహిళలలో ఎముక బలం రెట్టింపు అవుతుంది!

ఈ ఆసనాలతో మహిళలలో ఎముక బలం రెట్టింపు అవుతుంది! మనిషి శరీరం దృఢంగా ఉండటంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలహీనంగా ఉంటే బరువు ఎత్తడం నుండి సరిగ్గా నిలబడటం వరకు ఏ పనీ సరిగ్గా చేయలేరు. ముఖ్యంగా ఎక్కువ శాతం ఎముకలకు సంబంధించిన సమస్యలు అన్నీ మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంటి పనులు, గర్భం, ప్రసవం, ఆపరేషన్లు మహిళలల ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి. అయితే ఎముకల బలం రెట్టింపు కావాలన్నా ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గాలన్నా ఈ కింది  యోగా ఆసనాలు బాగా సహాయపడతాయి. ఉత్కటాసనం.. ఉత్కటాసనం వేస్తే తొడలు, పొత్తి కడుపు, తుంటి భాగంలో ఎముకలు బలంగా మారతాయి. దీన్ని ఎలా చేయాలంటే.. ఉత్కటాసనం వేయడానికి ముందు నిటారుగా నిలబడాలి.  రెండు చేతులను పైకి ఎత్తి మెల్లిగా నడుము భాగాన్ని కిందకు దింపాలి. ఈ ప్రయత్నంలో భుజాలు, వెన్నుపూస బెండ్ కాకూడదు. పైకెత్తిన చేతులు రెండూ కలిపి నమస్కారం ముద్రలో ఉంచాలి. కాళ్లూ, తొడలు బెండ్ చేయకుండా కేవలం నడుము భాగాన్ని మాత్రమే కిందకు వంచి వెన్నును స్టడీగా ఉంచితే ఉత్కటాసనం భంగిమ వేసినట్టే. ఈ భంగిమలో 30సెకెన్ల పాటూ ఉండి ఆ తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి.దీన్ని నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేయాలి. సేతు బంధాసనం.. సేతుబంధాసనం వీపు భాగాన్ని, తొడలను, తుంటి భాగాన్ని బలంగా మారుస్తుంది. ఈ భాగంలో ఎముకలు దృఢం అవుతాయి. సేతుబంధాసనం ఎలా వేయాలంటే.. ఈ ఆసనం వేయడానికి మొదట వెల్లికిలా పడుకోవాలి.  కాళ్లను పైకి లేపి మోకాళ్ల దగ్గర మడిచి పాదాలను భూమికి ఆనించాలి. ఇప్పుడు రెండు చేతులను తలకు రెండు వైపులా పక్కనే నేలకు ఆనించాలి. పాదాల వేళ్ల బలంతో భూమిని నెట్టుతూ తొడలు, నడుము ప్రాంతాన్ని పైకి లేపాలి.  అదేవిధంగా అరచేతులతో నేలను బలంగా నెట్టుతూ తల, భూజాలు, ఛాతీని పైకి లేపాలి. ఇలా లేపిన తరువాత మోకాళ్ల నుండి  ఛాతీ, తలభాగం వరకు సమాంతరంగా ఉంటుంది. ఇది వంతెనను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని సేతు బంధాసనం అంటారు. ఈ భంగిమలో గాలి పీలుస్తూ కాసేపు అలాగే ఉండి ఆ తరువాత తిరిగి నార్మల్ పొజిషన్ కు రావాలి. త్రికోణాసనం.. త్రికోణాసనం వేయడం చాలా సులభం. కాళ్లూ రెండూ దూరంగా ఉంచి నిటారుగా  నిలబడాలి. పాదాలను స్టైయిట్ గా కాకుండా కాస్త ఎడంగా అటూ ఇటూ ఉంచాలి.   తరువాత కుడి కాలి పాదాన్ని కుడివైపుకు  తిప్పాలి. ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. చేతులు రెండూ చాచి ఉంచాలి. ఎడమ వైపుకు వంగినప్పుడు ఎడమ చెయ్యి ఎడమ పాదానికి తగులుతుంది. కుడి చెయ్యి నిటారుగా పైకి నిలబడినట్టు ఉంటుంది.  అలాగే కుడివైపుకు వంగినప్పుడు కుడి చెయ్యి కుడి పాదానికి తగులుతుంది, ఎడమ చెయ్యి నిటారుగా పైకి నిలబడినట్టు ఉంటుంది.  ఆ భంగిమలు వేస్తున్నప్పుడు కళ్లు పైన నిటారుగా ఉన్న చెయ్యివైపు చూస్తుండాలి.  ఇదే త్రికోణాసనం. ఈ ఆసనాన్ని కుడివైపు 10సార్లు, ఎడమ వైపు 10సార్లు చెప్పున రోజూ వేస్తుంటే  కాళ్ళు, చేతులు, నడుము, ఛాతీ అన్ని భాగాలలో ఎముకలూ దృఢంగా మారతాయి.                                           *నిశ్శబ్ద.  

read more
వర్షాకాలంలో ఫిట్నెస్ విషయంలో బెంగా.. అయితే ఈ ఆసనాలు వేసి చూడండి!

 వర్షాకాలంలో ఫిట్నెస్ విషయంలో బెంగా.. అయితే ఈ ఆసనాలు వేసి చూడండి! ఫిట్ గా ఉండటం కోసం మహిళలు చాలా కష్టపడతారు. కానీ వారి కష్టానికి వాతావరణం శత్రువుగా మారే సందర్బం ఇది. ఈ వర్షాకాలంలో మహిళలు  ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడం కాస్త కష్టం.  తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య  వ్యాయామాలు,  ఇతర వర్కౌట్లు చేయడం కాస్త కష్టం.  అయితే దీనికి కూడా చక్కని పరిష్కారముంది.  తేమతో కూడిన వాతావరణంలో నీటిని సరిపడినంతగా తీసుకుంటూ కాసింత గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలోనే యోగా చేయడం వల్ల మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే..  సూర్య నమస్కారాలు.. సూర్యనమస్తారంలో  వేసే  భంగిమలు  క్రమంగా  శరీరాన్ని వేడెక్కేలా చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీలంలో పట్టుత్వాన్ని  పెంచుతుంది.  సూర్యనమస్కార  భంగిమలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడ  శరీరంలో వివిధ  అవయవాలు సుష్టంగా మారతాయి, ఇది  అంతర్గత ముఖ్యమైన అవయవాలు మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. రిథమిక్ శ్వాస ,  కదలికలు ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో ఉత్తేజాన్నిస్తాయి. సాధారణ అభ్యాసంతో..  శరీరం, శ్వాస, శరీరంలో చైతన్యం  మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకునే అవగాహనను పెంచుతుంది. త్రికోణాసనం.. త్రికోణాసనం శరీరంలో ముఖ్యంగా ఛాతీ భాగాన్ని యాక్టీవ్ చేస్తుంది.  నిలబడుకుని ఉన్నప్పుడు ఇది భుజాలను సాగదీయడానికి సహాయపడుతుంది. శరీరం సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. శలభాసనం.. దీనినే మిడత భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం శరీరం వెనుక భాగంలో ఉండే కండరాలను యాక్టీవ్ చేస్తుంది. వీపు దిగువ భాగాన్ని బలపరుస్తుంది. భుజంగాసనం.. భుజంగాసనం లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఊపిరితిత్తులు, ఛాతీ ఆరోగ్యం దృఢంగా మారడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. బాలాసనం.. బాలాసనం శరీరానికి మంచి ఓదార్పును ఇచ్చే భంగిమ. ఈ భంగిమలో వెనుక తుంటి భాగంను సాగదీసేటప్పుడు  శరీరం విశ్రాంతి దశలోకి వెలుతుంది.  ఈ కారణంగా ఇది శరీరానికి మంచి విశ్రాంతి అనుభూతి ఇస్తుంది. శవాసనం.. సాధారణంగా వెల్లికిలా శరీరాన్ని చాలా వదులుగా ఉంచి పడుకోవడమే శవాసనం. ఈ ఆసనంలో శరీరం చాలా విశ్రాంతి  దశలో ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఉష్ట్రోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.                                                *నిశ్శబ్ద.

read more
వావ్.. ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. చేతులు నాజుగ్గా మారిపోతాయ్!

వావ్.. ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. చేతులు నాజుగ్గా మారిపోతాయ్! అమ్మాయిలు తమ శరీరం మొత్తం మీద  చాలా కేర్ తీసుకుంటారు. అందుకు తగ్గట్టే అమ్మాయిల దుస్తులు బోలెడు ఫ్యాషన్లలో, బోలెడు మోడల్స్ తో మార్కెట్లోకి వస్తుంటాయి. చాలామంది అమ్మాయిలకు చూసిన మంచి డ్రెస్ ఖచ్చితంగా వేసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఆ కోరిక మాత్రం అలాగే తీరని కోరికగా ఉండిపోతుంది. దీనికి కారణం శరీరం తగిన షేప్ లో లేకపోవడమే. చాలా వరకు ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే అమ్మాయిల దుస్తులు స్లీవ్ లెస్ గానే ఉంటాయి. ఈ దుస్తులు వేసుకోవాలంటే కొందరికి భలే బెరుకు. దీనికి కారణం ఆర్మ్ ఫ్యాట్. చేతులు లావుగా కొందరికి ఉంటే.. మరికొందరికి చేతుల చర్మం వేలాడుతూ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ సమస్య తొలగిపోవడానికి కొన్ని వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. ఆ తరువాత ఎంచక్కా స్లీవ్ లెస్ దుస్తులు నచ్చినవన్నీ ట్రై చేయచ్చు.. పుషప్స్ తో ఫిట్.. చేతులు బలంగా మారాలన్నా, చేతుల కొవ్వు కరగాలన్నా పుషప్స్ బాగా సహాయపడాయి. నేలమీద బోర్లా పడుకుని చేతులను అటు, ఇటు దూరంగా ఉంచాలి. ఇప్పుడు రెండు అరచేతులను  నేలకు ఆన్చి పాదాలను మునివేళ్లమీద నిలబెట్టాలి.  అరచేతులు, పాదాల మునివేళ్ల మీద బరువు వేస్తూ శరీరం మొత్తాన్ని పైకి లేపాలి.  ఇలా పైకి లేపి మళ్లీ తిరిగి మామూలు స్థితికి రావాలి. కొత్తగా స్టార్ట్ చేసేవారు 10సార్లలోపు మాత్రమే చెయ్యాలి. ఆ తరువాత క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. ఈ పుషప్స్ వల్ల చేతుల కొవ్వు కరుగుతుంది. అలాగే కాళ్ల కండరాలతో పాటు నడుము, భుజాలు కూడా దృఢంగా మారతాయి. బైసప్స్ తో ఐస్ లా కరిగిపోద్ది.. చేతులకున్న అదనపు కొవ్వు కరిగించడానికి బైసప్ కర్ల్స్ భలే సహాయపడతాయి. దీనికోసం 5 కేజీల మొదలు 15 కేజీల మధ్య బరువున్న డంబెల్స్ తీసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచి నిలబడాలి. ఇప్పడు డంబెల్స్ తీసుకుని వెన్ను, నడుము వంచకుండా శరీరాన్ని నిటారుగా ఉంచి బరువులు మెల్లిగా ఎత్తడం దించడం చెయ్యాలి. ఒక్కోసారి ఒకో చేతిని పైకి లేపి దాన్ని కిందకు దించేటప్పుడు రెండోది పైకి  లేపాలి. ఆర్మ్ సర్కిల్స్.. చేతుల కొవ్వు తగ్గించుకోవడానికి మరొక సులువైన వ్యాయామం ఇది. స్ట్రైట్ గా నిలబడి రెండు చేతులను చాపాలి. ఈ చేతులను వృత్తాకారంలో తిప్పాలి. 30 నెంబర్స్ లెక్కపెడుతూ ఇలా తిప్పిన తరువాత మళ్లీ విరామం తీసుకోవాలి. ఇలా దీన్ని రెండు చేతులతో చేస్తే చేతి కొవ్వు తొందరగానే తగ్గిపోతుంది.                                               *నిశ్శబ్ద.

read more