రక్తంలోని పనికిరాని పదార్థాల్ని వేరుచేసి బయటకు పంపడానికి, రక్త శుద్ధితో పాటు రక్తపోటుని పరిరక్షించడానికి, శరీరంలో నీటి పరిమాణంతోపాటు మిగతా ద్రవ పదార్థాల స్థాయిని పరిరక్షించేవి మన దేహంలోని అత్యంత ముఖ్య భాగాలైన మూత్రపిండాలు. చర్మంలోని స్వేద గ్రంధులు చెమట రూపంలో కొన్ని మెటబాలిక్ వ్యర్థ పదార్థాల్ని, నీటిని బయటకు పంపుతున్నా వీటిని బయటకు పంపడానికి వుద్దేశించిన శరీరంలో ప్రత్యేకంగా వున్న అవయవాలు మూత్రపిండాలు.

మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో వున్న రెండు చిన్న అవయవాలు. ఒక్కొ మూత్రపిండం 10 సెం.మీ. పొడవు 6 సెం.మీ. వెడల్పు వుండి వెన్నెముక దిగువ భాగంలో రెండు పక్కలా రెండు వుంటాయి. చివరి రెండు రిబ్స్ మూత్రపిండాలకు రక్షణ నిస్తుంటాయి. ఒక్కో మూత్రపిండం 140 గ్రాముల బరువుంటుంది. దాదాపు మిలియన్ నెఫ్రానులు అనే వడపోత భాగాలు ఒక్కో మూత్రపిండంలో వుంటాయి. ప్రతీ నిముషం ఒక లీటరు రక్తం వాటి గుండా ప్రవహిస్తూంటుంది. 24 గంటల్లో ఈ నెఫ్రానులు 16 లీటర్ల ద్రావకాన్ని వేరు చేస్తుంటాయి. వాటిలోంచి చాలా భాగం మూత్రపిండాల నాళాలు తిరిగి గ్రహించగా ఆఖరికి 1 నుంచి లీటర్ల వ్యర్థ దావకం మూత్ర రూపంలో బయటకు పోతుంటుంది.

మూతము, మూత్రపిండాలు సాధారణంగా క్రిములు లేకుండా వుంటాయి. లోపల లేకపోయినా మూత్రాశయంలో ఆడ, మగ ఇద్దరిలో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశముంది. మూత్ర మార్గము, మర్మావయవము ఒక చోటవుండడంతో సంపర్కము వల్ల క్రిములు లోపలకు ప్రవేశించి, మూత్రాశ యాన్ని చేరుకునే ప్రమాదముంది. దీనినే 'యురెథ్రయిటిస్' అంటారు.

పైలోనె ఫ్రయిటిస్

పోస్టేట్ గ్రంధులు పెద్దవైనప్పుడు మూత్రాశయ ద్వారం మూసుకుపో తుంది. దాంతో మూత్రాశయంలో మూత్రం నిల్వ వుండిపోయే ప్రమాదముంది. ఇన్ ఫెక్షన్ ని కలిగించే సూక్ష్మజీవులు మూత్రంలో అధిక సంఖ్యలో పెరుగుతాయి. అందుకనే అలాంటి పరిస్థితుల్లో అతి త్వరగా ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. మూత్రాశయం వరకే ఇన్ ఫెక్షన్ వస్తే అది త్వరగానే తగ్గిపోతుంది. అలాకాకుండా ఇన్ ఫెక్షన్ మూత్రపిండాల వరకూ వ్యాపిస్తే 'పైలో నెఫ్రయిటిస్' అనే వ్యాధి రావచ్చు.

మూత్ర పిండాలలో రాళ్ళు

మూత్రపిండాలు పని చేసుకుపోతున్నప్పుడు వ్యర్థాలతో పాటు కొన్ని పదార్థాలు డిపాజిట్ అయి అవి చిన్న చిన్న రాళ్ళలా మారి మూత్రపిండాలలో, మూత్రనాళాలలో అడ్డంపడుతుంటాయి. అవి రకరకాల పరిమాణాల్లో వుంటాయి. కాల్షియమ్ లేక యూరిక్ యాసిడ్ డిపాజిట్ లతో ఇవి తయారవుతుంటాయి. కొన్ని రాళ్లు పెద్దవిగా కూడా వుంటాయి. అవి మూత్రనాళాలలో అడ్డం పడి మూత్ర విసర్జనకి అవరోధాన్ని కలిగిస్తాయి.

మూత్ర పిండాలు చెడిపోవడం రెండు రకాలు.

అవి. 1. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్

 2. క్రానిక్ నల్ ఫెయిల్యూర్.

ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అయితే మూత్రం తగ్గవచ్చు. వాపు రావచ్చు. రక్తపోటు పెరగవచ్చు. శరంలో నీరు తగ్గి అతిసార వ్యాధి రావచ్చు.

క్రానిక్ ఫెయిల్యూర్ లో మూత్రపిండాలు నెమ్మదిగా, పూర్తిగా చెడతాయి. తిరిగి వాటిని బాగు చేయడాని వీలుకాదు. మూతపిండాల మార్పిడి అవసరమవుతుంది.

నెఫ్రోటిక్ సిండ్రోమ్

మూత్రపిండాలలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే అనారోగ్యము వస్తుంది. రక్తంలోంచి మూత్రపిండాలు పనికిరాని పదార్థాలు వేరు చేసేప్పుడు ప్రొటిన్ కూడా లీక్ అయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయే జబ్బును 'నెఫ్రోటిక్ సిండ్రోమ్' అంటారు.

అధిక రక్తపోటుతో...

అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయి. అధిక రక్తపోటు వల్ల క్రమంగా మూత్రపిండాలలోని చిన్న ఆర్టెరీస్ దెబ్బ తింటాయి. క్రమంగా మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బ తింటుంది. దెబ్బతిన్న మూత్రపిండాల వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. మూత్రపిండాలలోని రెనిన్ రక్తపోటు పెంచుతుంది.

మూత్రపిండాల్ని పాడుచేసే మరికొన్ని కారణాలు

కొన్ని కొన్ని జబ్బులవల్ల కూడా మూత్రపిండాలు దెబ్బ తింటాయి. కొన్ని మందులు, విషపదార్థాలు తీసుకున్నా మూత్రపిండాలు చెడిపోతాయి. 

'మూత్రపిండాల అనారోగ్యాన్ని పసిగట్టడానికి చేసే పరీక్షలు'

బ్లడ్ ప్రెజర్, ఎక్సరే, కిడ్నీబయాప్సీ, యూరిన్ అనాలిసిస్, బ్లడ్ అనాలిసిస్ మొదలయిన పరీక్షలు చేసి మూత్రపిండాల పనితీరుని శోధించి ఒకవేళ ఏమైనా అనారోగ్యాలుంటే కనుగొనడంతో పాటు అవి ఏ స్థాయిలో వున్నాయో కూడా తెలుసుకుంటారు. మొదట్లోనే చికిత్సని ప్రారంభిస్తే మూత్రపిండాల జబ్బులన్నింటినీ నయం చేయవచ్చు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఉప్పు నీరు, మాంసకృత్తులు (ప్రొటీన్స్) ఒక పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. బాక్టీయావల్ల మూత్రపిండాలు కొద్దిగా పాడైతే యాంటి బయాటిక్స్ వాడాలి.

                                 ◆నిశ్శబ్ద.