ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతిఏటా ఏప్రిల్ 7 వ తేదీన నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క లక్ష్యం తమ తమ 
ఆరోగ్యం పట్ల ఆనుసరించాల్సిన పద్దతులపై అవగాహన చైతన్యం కల్పించడం చేయాల్సి ఉంటుంది. దీర్ఘ కాలం పాటు చురుకుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లు అవసరమో తెలుసుకుందాం.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం -----

మంచి అలవాట్లు అలవారచుకోవాలంటే ఒక్కరోజులో సాధ్యం కాదు. వీటిని మెల్లి మెల్లిగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఊబకాయంతో పాటు డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు,ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే గుండె పోటు,ఇతర అనారోగ్య సమస్యలు, ఇవన్ని అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చిన సమస్యలు కావు. మీరు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు సమయపాలన వల్ల సమయానికంటే ముందే మీకు కొన్ని హెచ్చరికలు చేస్తుంది. మనం మాత్రం ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఆరోగ్యం పట్ల శ్రద పెట్టాలి. ఆ సమయంలో అలా చేయనందు వల్లే ప్రతి ఏటా ఏ ప్రిల్ 7 న మిమ్మల్ని మీఅరోగ్యం పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియ చేయడానికే మా ఈ ప్రయాత్నం.

ప్రతి ఏటా ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మీరు అనుసరించాల్సిన లక్షణాలను కొన్నింటిని వివరించే ప్రయత్నం చేస్తాం. అవి మీరు సుదీర్ఘ కాలం పాటు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నాం.

మీరు తీసుకునే ఆహారం ఆస్వాదిస్తూ తినండి...

భోజనం చేయడం వల్ల ఆరోగ్యం తో పాటు శక్తి నిస్తుంది. ఈ సమయం లో ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏమిటి అంటే భోజనాన్ని మెల్లిగా ఆస్వాదిస్తూ తినాలి.త్వర త్వరగా తినాలన్న ఆలోచనలో ఒకేసారి ఎక్కువగా భోజనం తీసుకుంటారు. దీనికారాణం గానే మీ శరీరం ఊబకాయం గా మారుతుంది. మెల్లి మెల్లిగా ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఆహారం తక్కువగా తిన్న కడుపు నిండి పోతుంది. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కార మౌతాయి.

ఆహారంలో ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవాలి...

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ తో కూడిన సంపూర్ణ పోషకాల ఖజానా అవసరం. చాలా నెలలుగా మన శరీరం కోసం లాభాదాయక మైన ప్రోటీన్ లతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల మన పొట్ట నిండి ఉంటుంది. అందుకే మనకు త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు ఊబాకాయం, రెండింటిని నియంత్రించ వచ్చు. శాఖాహారులకోసం సోయా, కాబూలి చన, పన్నీరు, స్ప్రవుట్స్ వంటివి ప్రోటీన్ చాలా అద్భుత మైన ప్రత్యామ్నాయం గా చెప్పవచ్చు.

ఇంటి ఆహారంతోనే ఆరోగ్యం...

ఇంట్లో తయారయ్యే ఆహారంలో మీకు కావాల్సిన విధంగా నూనె,ఉప్పు, మసాలా, వేసుకోవచ్చు. బయట వండిన ఆహారంలో అన్నీ ఎక్కువ స్థాయిలో కలిసి ఉంటాయి ఆహారం రుచికరంగా ఉండచ్చు. కాని ఆరోగ్య పరంగా అది సరైనది కాదు. అని అంటున్నారు నిపుణులు. నెలలో ఒకటి రెండు సార్లు లేదా ప్రత్యేకమైన సందర్భం లో తీసుకోవడం తప్పుకాదని అయితే ప్రతిరోజూ ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం నిరాకరించమని నిపుణులు సూచిస్తున్నారు.

మీశారీరాన్ని మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోండి...

ఆహారం బాగా తీసుకోవడం తో పాటు శరీరక  వ్యాయామం చేయించడం చేయడం కూడా అత్యవసరం వ్యాయామం వల్ల శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉండడం తో పాటు మూడ్ కూడా బాగుంటుంది. అలసట సమస్యలు ,ఒత్తిడివంటి వాటి నుండి దూరంగా ఉండవచ్చు.అయితే ఇందుకోసం వర్క్ అవుట్ అంటే 
పెద్ద సైజు జిమ్ లు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూడా రకరకాల వ్యాయామాలు చేయవచ్చు. రకరకాల కార్యక్రమాలు చేయవచ్చు. రక రకాల కార్యక్రమాలలో భాగంగా చీపురు తో శుభ్రంగా ఊడవడం, తడి బట్ట పెట్టి తుడవడం లేదా శుభ్రం చేయడం.ఇంటిలోపల బయట మొక్కలు పెంచడం పిల్లలతో ఆడుకోవడం ఇంట్లో అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ కు బదులు మెట్ల ను వినియోగించడం వంటి వి చేయడం ద్వారా చురుకుగా ఉండవచ్చుప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా మన  ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో మన ఆరోగ్యాన్ని కాపాడతాడని అనుకోవడం వ్యర్ధం.కీలక మైన ఉపద్రవం వచ్చినప్పుడే రాణి అధికార యంత్రాంగం ఇప్పుడు మాత్రం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున వస్తుందని ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తుందని ఎలా నమ్మగలం ఎలా విశ్వసించ గలం.