కూల్ డ్రింక్స్ లో కోకాకోలా పేరు తెలియనివారు బహుశ ఉండరేమో. ఎందుకంటే
ప్రపంచంలోని ఏ మూలనైనా ఇది దొరుకుంది. రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ తో
ఇది వరల్డ్ మొత్తం ఆక్రమించేసింది. మొట్టమొదటి కోకాకోలాను అట్లాంటాలో 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ ప్రారంభించారు. ఐదువందలకు పైగా బ్రాండ్లతో అన్ని దేశాల్లో లభిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు ఏడులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచజనాభాలో అత్యధికమంది తాగే కూల్ డ్రింక్ఇదేనేమో..! సరదాగా అప్పడప్పుడు కాకుండా రోజూ కోకాకోలానే తాగితే ఏం జరుగుతుంది...! కోకాకోలా రుచికోసం, నిల్వ కోసం దాని ఎన్నో పదార్థాలను కలుపుతారు. ఇది తాగిన తర్వాత రీప్రెష్ అనిపించడానికి కారణం వాటిలో ఉండే పదార్థాలే. మరి రోజూ కోకాకోలానే జీవితాంతం తాగితే ఏం అవుతుంది. .? కోకాకోలా శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? దంతాలను ఏమి చేస్తుంది..? నీళ్ళకి బదులుగా కోకాకోలాను తాగితే శరీరానికి కావల్సిన పోషకాలను అది ఎలా భర్తీచేస్తుంది.? ఇలా అనేక అనుమానాలు వస్తాయి కదా....! వాటిని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. మోనాకోలో ఒక మహిళ 16 ఏండ్లుగా నీళ్లకు బదులుగా నేరుగా కోకాకోలానే తాగింది. మరీ ఆమె ఆరోగ్యం ఏం అయ్యింది, వాటి నుంచి సర్వైవ్ అయిందా.?
ఒక వేళ మనం కూడా ఇలానే చేస్తే ఏమవుతుంది..? ...
డాక్టర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పేది ఒక్కటే. శరీరజీవక్రియలు సక్రమంగాజరగాలంటే ప్రతి మనిషి రోజూ తప్పకుండా 3 నుండి నాలుగు లీటర్ల వాటర్ నుతీసుకోవాలని. కానీ దానికి బదులుగా కొకాకోలా ను మాత్రమే తీసుకుంటే... ప్రతి రోజు తీసుకునే ఒక సింగిల్ కోక్ లో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక వేళ 8 కోక్ లను ప్రతి రోజు తాగితే అది 312 గ్రాముల చక్కెర తో సమానం. అది 6 చాక్కెట్ బార్లను ఒకే సారి తిన్నదానితో సమానం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజులో 40 గ్రాముల కంటే తక్కువ షుగర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఎనిమిది కోక్ లు తాగితే దాదాపు 312 గ్రాముల చక్కెర తీసుకున్నట్టే. కేవలం కోక్ ను తీసుకోవడం వల్లనే వారానికి 8000 అదనపు కాలరీల తీసుకున్నట్లు అవుతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో షుగర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధిక కాలరీలు తీసుకోవడం అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. అలాగే దంత క్షయానికి హానిచేయడమే కాకుండా, కోక్ ను తీసుకున్న ప్రతి సారి దంతాలు, నాలుక చిగుళ్ళులపై పేరుకొనిపోయి గంటలు కొద్ది ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోయే పంటి మీద ఉన్న ఎనిమల్ పోవడమే కాకుండా శాశ్వతంగా పళ్లను తీసివేయాల్సి వస్తుంది. రోజంతా ఇలానే తీసుకుంటూ ఉంటే వాష్ రూమ్ కి పదేపదే
పరిగెత్తాల్సి ఉంటుంది. కోక్ లోని కెఫిన్ అనే పదార్థం అధిక మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. కాబట్టి పదే పదే వాష్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కెఫిన్ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ అందులోని ముఖ్య ఇంగ్రీడీన్ అయిన ఫ్రక్టోస్ కార్న్ సిరప్ గురించి మాత్రం ఆందోళన చెందాలసిందే. ఎందుకంటే ఫ్యాట్లీ లీవర్ సమస్యకు దారితీస్తుంది. దాని లక్షణాలు అలసటగా ఉండటం, పై కడుపులో నొప్పి. అయినా అలాగే కోక్ తాగడం కొనసాగిస్తే ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచుగా మూర్చ పోవడం, పొటాషియం నిల్వలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధిక మోతాదులో షుగర్, కెఫిన్ తీసుకుంటారు కాబట్టి హృదయ స్పందనలో కూడా మార్పులు వస్తుంటాయి.
ఈ అనారోగ్య సమస్యలు అక్కడితో ఆగవు. టైప్ -2 డయాబెటిస్ కు గురికావడం జరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ లు లోపిస్తాయి. ఫలితంగా కిడ్నీ డ్యామేజి కి దారితీస్తుంది. అయినా అలాగే కోక్ మాత్రమే తాగుతూ ఉంటే 600 పౌండ్ల వరకు బరువును పెరుగుతారు. అంతేకాదు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. 16 ఏండ్లుగా కేవలంకోకాకోలా ను మాత్రమే తాగుతున్న మహిళా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం వంటి చాలా సమస్యలు చవి చూసింది. చివరికి కోకాకోలా తాగడం ఆపేసింది. దాంతో చాలా తక్కువ సమయంలోనే ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారానికో, నెలకో, ఏడాదికో ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, రోజూ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ కాస్త రెస్ట్ ఇన్ పీస్ గా మారుతుంది. సో.. కోకా కోలా గురించి ఇంత తెలిసాక కూడా మీరు తరచుగా కోకాకోలా తాగుతారా.. అలా కావాలని అనుకుంటారా.. కాదు గా..!