మలేరియా దోమలున్న వాతావరణం లో మనిషికి దుర్భరంగా ఉంటుంది.పల్లె నుంచి పట్టణాల
దాకా ప్రతి చోటా దానాలు స్వైర విహారం చేస్తూనే ఉంటాయి.దోమలిన్న ప్రాంతంలో మనిషి ఒక్క రోజుకూడా రాత్రి హాయిగా ప్రశాంతంగా కంటి నిండా నిద్ర పోయిన దాక లాలు లేవు,ముఖ్యంగా దోమలు ప్రజా ఆరోగ్యానికి పెద్ద సవాలు విసురు తున్నా యే మో అని అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందా నీరు నిలువ ఉన్న ప్రాంతలాలో అవి చేరి తమ సంతానాన్ని వృద్ధి చేస్తాయి. అక్కడ పుట్టిన దోమలు తమ ఇష్టం వచ్చి నట్టు కుట్టి కుట్టి అక్తం పీల్చేస్తాయి.దోమల ద్వారా వ్యాపించే వ్యాదులలో ప్రభలంగా వినిపించేది నలేరియా గత కొన్ని దశాబ్దాలుగా దోమలను నిర్మూలించడానికి తద్వారా మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అన్నే ఇన్నీ కావు కాని చిత్తశుద్ది కన్నా చెత్త శుద్ధి ఎక్కువై పోవడం వల్లే దోమల నివారణలో ఘోరంగా విఫల మౌతున్నాము.మలేరియా అనఫేలేస్ అనే ఒక ప్రత్యేక దోమ మూలంగా మలేరియా వ్యాప్తి చెందుతుంది.ఈ దోమలు మురికి నీళ్ళలోను చెత్త చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృద్ధి చెందు తాయి.నిలువ ఉన్న పరిశుభ్రమైన నీటి మీద కూడా కాపురం చేస్తూ ఉంటాయి.ప్లాస్మోడియం అనబడే సూక్ష్మ క్రిమి మూలంగా మలేరియా వ్యాధి వస్తుంది. ఈ సూక్ష్మ క్రిమి ఆడ దోమ లాలాజల గ్రంధులలో నివాసం ఏర్పరుచుకుంటుంది.మనిషిని ఆడ దోమ కుట్టినప్పుడు దాని లాలా జలం ద్వారా ఈ క్రిమి అతడి చర్మం లోకి ప్రవేశించి అక్కడి నుంచి అతడి రక్తం లోకి ప్రవేశిస్తుంది.ప్లాస్మోడియం అనబడే సూక్ష్మ క్రిములు మొదట మనిషి కాలేయం లో అంటే లివర్ లోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. కాలేయంలో అసంఖ్యంగా వృద్ధి చెందాక అక్కడి నుంచి తిరిగి అతడి రక్త ప్రవాహంలోకి చేరి అక్కడి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి.మ్మాలేరియా క్రిమి కాలేయంలో వున్న దశలో మలేరియా తాలూకు లక్షణాలు ఏవి మనిషిలో కనిపించవు. రక్త ప్రవాహం లోకి చేరి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం మొదలు పెట్టాక విపరీత మైన జ్వరం,చలి వంటి లక్షణం మొదలు అవుతుంది.మాలేరియా దోమ ఒకరికుట్టి వెంటనే మరో వ్యక్తిని కుట్టిందో అతడికి కూడా మలేరియా అంటుకుంటుంది.ఈ విధంగా ఆడ దోమలు మలేరియా వ్యాప్తికి దోహదం చేస్తాయి.
మలేరియా లక్షణాలు..
మలేరియా క్రిమి కాలేయం నుంచి రక్తం లోకి ప్రవేసించాక అక్కడి ఎర్ర రక్త కణాలు చిట్లడం మొదలు అవుతాయి.సరిగ్గా ఆ సమయంలో అతడిలో 1౦3-1౦4డిగ్రీల ఫారన్ హీట్ జ్వరం తో వణుకుడు మొదలు అవుతుందిరోగికి విపరీతమైన తల నొప్పి ఉండచ్చు.వెన్ను నొప్పి ఉండచ్చు. వాంతులూ రావచ్చు. శారేరం లోపలి నుంచి వచ్చే చలిని తట్టుకోలేక రోగి దుప్పటి మీద దుప్పటి కప్పుకోవాలని సనుకుంటాడు.జ్వరం గరిష్ట స్థాయికి చేరుకున్నాక మాత్రమే అతడిలో చలి తగ్గి పోతుంది. చలి తగ్గిన కొన్న్ని గంటల లోనే జ్వరం సాధారణ స్థితికి చేరి చెమటలు పట్టడం మొదలు అవుతాయి.ఈ సమయంలో రోగి నీ రసంగా బలహీనంగా ఉంటాడు. జ్వరం తగ్గిన ఒకటి నుంచి మూడు రోజుల దాకా రోగి మామూలుగా తిరిగు తాడు.ఆతరువాత మళ్ళీ చలిజ్వరం రావచ్చు మలేరియా ముఖ్య లక్షణాలాలో ఒకటి రోజు విడిచి రోజు లేక రెండు రోజుల కొకసారి జ్వరము,చలి మొదలు అవ్వడం కాలేయం లివర్ నుండి రక్త ప్రవాహానికి మలేరియా క్రిములు ప్రవేసించినప్పుడల్లా జ్వరం చలి మొదలు అవుతుంది.
మలేరియా నిర్ధారణ...
సాధారణంగా మలేరియాకి సంబందించిన లక్షణాలైన చలి జ్వరం వస్తునప్పుడుడాక్టర్లు డాక్టర్లు పెద్దగా టెస్ట్లు చేయరు.తమకున్న అనుభవం ఆధారంగా ట్రీట్ చేయడానికి పూనుకుంటారు.ఏ కొద్ద్దిగా నైనా సందేహం ఉంటె రక్త పరీక్ష చేయించి దానిని నివృత్తి చేసుకుంటారు.చేతి వేలు నుండి రెండు రక్తపు బొట్లు తీసి గాజు పలక పైన అద్ది అందులోని ఎర్ర రక్త కణాలలో మలేరియా క్రిములు ఉన్నాయేమో పరీక్ష చేస్తారు.
మలేరియాతో రక్త హీనత...
మలేరియా జ్వరం మాటి మాటికీ వస్తోంటే రోగిలో ఎర్ర రక్తస్ కణాలు బాగా క్షీణించి అతడు రక్త హీనత కు గురి అవుతాడు.తీవ్రమైన కేసులలో అతని కాలేయం వాపు వస్తుంది. దీనివల్ల రోగి ఎక్కువసేపు నడవ లేక పోవడం,ఆయాసం వస్తూ ఉంటుంది.
మెడకు మాలేరియా వస్తుందా?
ప్లాస్మోడియం ఫల్సిపరుం అనబడే ఒక రక మైన మలేరియా క్రిమి మూలం,గా వ్యక్తి మెదడుకు సోకితే ఈ రకమైన మలేరియా వచ్చినప్పుడు వ్యక్తి మెదడులోని సూక్ష్మ సూక్ష్మ రక్త నాళాలుపూడుకు పోయి అతడికి ఫైట్స్ రావచ్చు ఒక్కో సారి మరణం కూడా సంభవిస్తుంది. ఈ మలేరియాని సెల్లబ్రల్ మలేరియా అంటారు.ఈ వ్యాధి సమయంలో ఎర్ర రక్త కణాలకు విపరీత మైన నష్టం సంభవించి కిడ్నీలో అవలక్షణం ఏర్పడి జ్వరంతో పాటు ఆవ్యక్తి మూతరం ముదురు రంగులో వెలువడుతుంది.దీనిన్ని బ్లాక్ వాటర్ ఫీవేర్ అని దీనివల్ల రోగులు మరణించ వచ్చని వైద్యులు పేర్కొన్నారు.
మలేరియా కు చికిత్స...
మలేరియా జ్వరాన్ని ట్రీట్ చెయ్యడానికి మూడు దసలు ఉంటాయి....
*మొదటగా చలి జ్వరాన్ని తగ్గించడం.
*రెండవది చలి జ్వరం రాకుండా చూడడం.
మూడోది మలేరియా క్రిములను పూర్తిగా శరీరం నుంచి తొలగించడం
చాలా కాలం నుంచి మలేరియా జ్వరానికి క్వినైన్ టాబ్లెట్లను వాడుతూ వస్తున్నారు.ఈ రోజుల్లో ఇంకా కొన్ని కొత్త మందులు ఉన్నాయి. కొత్త మందులకి దిదే ఎఫెక్ట్స్ తక్కువ.మలేరియాకి క్లోరోక్విన్,కమా క్విన్
ఆయా పరిస్థితి అప్పుడు అందుబాటులో ఉన్న మందులను దృష్టిలో ఉంచుకుని డోసేజ్ మారుతూ ఉంటుంది. మదటి రోజు సింగల్ డోస్
4 త్యాబ్లేట్లు ఒకే సారి వేసుకోమంటారు.ఆరు గంటల తరువాత మరో రెండు టాబ్లెట్లను వేసుకోవాలి.మూడు రోజులు ఉదయం ఒక టాబ్లెట్ ను సాయంత్రం ఒక టాబ్లెట్,వేసుకోవాలి.