శరీరానికి అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు అవసరం అవుతాయి.  ఏ ఒక్కటి లోపించినా శరీర పనితీరు దెబ్బతింటుంది.  ముఖ్యంగా శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లోపించడం వల్ల శరీరానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది.  ఈ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీరానికి పూడ్చలేని నష్టం జరుగుతుంది.  ముఖ్యంగా చాలా అరుదుగానూ, మాంసాహారంలోనూ లభించే పోషకాల వల్ల శాకాహారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు.  అలాంటి వాటిలో విటమిన్-బి12 లోపం కూడా ఒకటి.  విటమిన్-బి12 మాంసాహారంలోనూ,  కొన్ని శాకాహార ఆహారాలలోనూ మాత్రమే లభిస్తుంది.  ఈ కారణంగా విటమిన్-బి12 కేసులు శాకాహారులలో ఎక్కువగా ఉంటాయ.  అసలు విటమిన్-బి12 లోపిస్తే జరిగేదేంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యను అధిగమించాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే..

లక్షణాలు..

శరీరంలో విటమిన్-బి12 లోపిస్తే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.  వాటిలో అలసట,, బలహీనత,  కళ్ళు తిరగడం,  జ్ఞాపకశక్తి,  రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా విటమిన్-బి12 శరీరంలో రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది,  కొత్త ఎర్ర రక్తకణాలు అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది. కానీ విటమిన్-బి12 లోపం వల్ల రక్తహీనత ఎక్కువ అవుతుంది.  విటమిన్-బి12 భర్తీ కావాలంటే ఏం తినాలంటే..

పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారంలో కూడా విటమిన్-బి12 ఉంటుంది.  శాకాహారం తీసుకునేవారు విటమిన్-బి12 భర్తీ కావాలంటే పాలు, పాల ఉత్పత్తులు అయిన పాలు, పెరుగు, చీజ్,  పనీర్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి.

మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని చాలా తొందరగా అధిగమించడానికి చికెన్,  టర్కీ కోడి మొదలైనవి ఆహారంలో తీసుకోవచ్చు.

చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది.  చేపలతో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల విటమిన్-బి12  లోపాన్ని అధిగమించవచ్చు.  వైద్యుల సూచన మేరకు చేప సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.

గుడ్లలో పెద్ద మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది. రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటూ ఉంటే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  లేదంటే గుడ్డుతో ఆరోగ్యకరమైన పద్దతిలో ఆమ్లెట్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకుని తినవచ్చు. కానీ ఉడికించిన గుడ్లే శ్రేష్టం.

 మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి రెడ్ మీట్ కూడా తీసుకోవచ్చు.  ఇందులో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.


                                                   *రూపశ్రీ.