మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. చాలా వరకు మొక్కల పేర్లు కూడా చాలామందికి తెలియవు,  కానీ ఆయర్వేద పరంగా చూసినప్పుడు ప్రతి మొక్క ఆద్బుతం అనిపిస్తుంది.  అలాంటి మొక్కలలో నేల ఉసిరి కూడా ఒకటి.  ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉండి  నేలమీద పెరిగే ఈ నేల ఉసిరి మొక్క ఫ్యాటీ లివర్ సమస్యలకు అధ్భుతంగా పనిచేస్తుంది. అసలు ఫ్యాటీ  లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి నేల ఉసిరి ఎలా పని చేస్తుంది? తెలుసుకుంటే..


ఫ్యాటీ లివర్ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది. రెండవది ఆల్కహాలిక్ లేని ఫ్యాటీ లివర్.  ఇది జీవనశైలి, జన్యుశాస్త్రం, తినడం,  త్రాగడంలో అజాగ్రత్త లేదా కొన్ని ఔషధాల  దుష్ప్రభావాల వల్ల కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్  పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. వైద్యుల ప్రకారం 10 మందిలో 6-7 మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇది ఎక్కువగా పెరిగితే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.


కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉండే కొవ్వు,  ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీన్ని LDL లేదా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుంది.


 ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో కడుపు  కుడి ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. బరువు తగ్గడం, బలహీనంగా అనిపించడం, కళ్లు,  చర్మం పసుపు రంగులోకి మారడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ లేదా పొట్టలో ఉబ్బరం.. ఇవన్నీ ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతాలు.  

నేల ఉసిరి ఎలా పనిచేస్తుందంటే..


నేల ఉసిరి ఒక ఆయుర్వేద ఔషధం. దీని పండ్లు సరిగ్గా ఉసిరి లాగా ఉంటాయి. అలాగే దీని ఆకులు కూడా ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. కానీ  ఇది చాలా చిన్న మొక్క. అందుకే దీనిని  నేల ఉసిరి అంటారు.  నేల ఉసిరి మాత్రలు అందుబాటులో ఉంటాయి.  ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సహజంగా నయమవుతుంది. ఇది మాత్రమే కాకుండా పునర్నవ లేదా తెల్ల గలిజేరు కూడా   ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది. పునర్నవలో పునరుత్పత్తి అంటే కొత్త కణాలను తయారు చేసే గుణం ఉంది.   ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  భోజనం చేసే ముందు పునర్నవ రసం తీసుకోవడం వల్ల గ్యాస్ ఏర్పడదు, అలాగే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పునర్నవలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.  ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి.


                      *రూపశ్రీ.