వేసవి కాలంలో వేడి గాలి లేదా వేడి స్ట్రోక్ శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా ఇబ్బందికి గురిచేస్తుంది. వేడి స్ట్రోక్ కారణంగా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో వేడిగాలి కారణంగా వాత దోషం పెరగడం మొదలవుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారడం, మెరుపు కోల్పోవడం, శరీరంలో తేమశాతం తగ్గడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఎసిడిటీ, వికారం, అజీర్ణం వంటి సమస్యలను కూడా ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో కేవలం నాలుగే నాలుగు పదార్థాలను తీసుకుంటూ ఉంటే వేడి అనేది మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టలేదు. అవేంటో తెలుసుకుంటే..
ఉసిరికాయ..
ఉసిరిలో ప్రయోజనకరమైన ఆయుర్వేద లక్షణాలు ఎన్నో ఉన్నాయి, వాత పిత్త దోషాలను రెండింటినీ సమతుల్యం చేస్తుంది . ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఉసిరికాయను తీసుకోవడం ద్వారా దగ్గు కూడా తొలగిపోతుంది. ఎండాకాలంలో పచ్చి ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉసిరి శరీరాన్ని హీట్ స్ట్రోక్ వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతుంది. వేసవిలో ఉసిరి రసాన్ని, పచ్చి కాయను నేరుగా తినడం, , ఊరగాయ, ఉసిరి పొడి ఇలా ఎన్నోరకాలుగా తీసుకోవచ్చు.
గుల్కండ్
వేసవి కాలంలో శరీరాన్ని అలసట, నీరసం, మంట, దురద వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇది కాకుండా, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం కూడా వేసవిలో కడుపులో మంటను కలిగిస్తుంది. వేసవిలో వచ్చే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే గుల్కండ్ తినాలి. గుల్కండ్ పేగు, కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
వేసవిలో హీట్ స్ట్రోక్ ఉంటే శరీరంలో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలోని పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీనిని నివారించడానికి, ఖనిజాల లోపాన్ని తీర్చడానికి, ఆపిల్ వెనిగర్ తీసుకోవాలి. యాపిల్ వెనిగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
మారేడు జ్యుస్..
వేసవిలో మారేడు జ్యుస్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. మారేడులో విటమిన్ సి, ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యుస్ తీసుకోవడం వల్ల శరీరం చల్లదనాన్ని పొందుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో సంభవించే శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందాలనుకుంటే, ఆహారం తీసుకునే ముందు రోజూ రెండుసార్లు మారేడు జ్యూస్ తీసుకోవాలి.
◆నిశ్శబ్ద