ఇటీవలి కాలం లో అటు సాదారణ జంటలు ముఖ్యంగా ఐ టి రంగం లోని వారి వారి ఉద్యోగాల లో ఉన్న ఒత్తిడి కారణంగా సంసార జీవితం పై ఆశక్తి తగ్గడం, వారి వారి జీవన శైలి కారణంగా పిల్లల ను కనే ఆశక్తి లేకపోవడం వల్ల మరోపక్క ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం తో ఇంటా బయట తీవ్ర అవమానాలు ఎదుర్కోలేక తమ ముఖాన్ని అందరికి చూపించుకోలేక అసలు కొన్ని సందర్భాలలో పెళ్లి పేరంటాలకు సైతం వెళ్లేందుకు ఆశక్తి చూపడం లేదు. ఈక్రమంలో కుటుంబాల మధ్య తీవ్ర బేధాభిప్రాయాలు రావడం సంతానం కలగకపోవడానికి మీరు అంటే మీరు అంటూ చోటు చేసుకుంటున్న పరిణామాలు భార్యా భర్తల మధ్య విభేదాలకు కారణమౌతున్నాయి.
ఇది కాస్త ముందుకు వెళ్లి విడాకుల కు దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు.ఈ పరిణామ క్రమం లో ఇటీవలి కాలం లో సెలబ్రేటీలు సరోగసీ పద్ధతి లో పిల్లలను పుట్టించే పనిలో పడ్డారు.ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో సన్నీ లియోన్,శిల్పాశేట్టీ, ఖాన్ కుటుంబం అగ్రభాగాన ఉన్నారు. ఇకతెలుగులో మంచు లక్ష్మి కూడా సరోగసి ద్వారా పిల్లలను కనడం తెలిసిన విషయమే ఇందులో అటు విదేశి క్రీడాకారులు కొందరైతే ఇంకొందరు బాలివుడ్ తారలు ఉండడం గమనించవచ్చు.బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా,నికో జోనాస్ తల్లి తండ్రులు కాబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.సరోగేట్ ద్వారా పిల్లలను స్వాగతిస్తున్నా మని పేర్కొన్నారు.ఇటీవల టాలి వుడ్, కోలివుడ్ నటి నయన తార సరోగసి పద్దతిలో జన్మనివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే వివాహం జరిగి తిరుమల దర్సనంలోను వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిందే. ఇంతలోనే సరోగాసీ ద్వారా పిల్లలు కన్న విషయం గుప్పు మనడం తో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.కాగా నయన తార చట్టప్రకారం సరోగసి అమలు చేసారా.? నియమ నిబందనల ప్రకారామే వ్యవహరించారా అన్న అంశం చర్చనీయ అంశం కాగా నాలుగు నెలలోనే కవల పిల్లలకు జన్మనివ్వడం సాధ్యా సాధ్యాల పై నిపుణులను నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రియాంకా చోప్రా చెల్లెలు మీరా చోప్రాకు పాప పుట్టిందని తెలిపారు. 12 వారాల క్రితమే సరోగసి ద్వారా జన్మించినట్లు ప్రియాంకా చోప్రా వెల్లడించారు.భారత ప్రభుత్వం సరోగసి తో వ్యాపారం చేయడాన్ని నివారించేందుకు జనవరి 25 న సరోగసి చట్టం 2౦21 ప్రకటీంచింది.తమ అందం కరిగిపోతుందన్న భావనతో ఒకరకంగా స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారనడం లో ఎటువంటి సందేహం లేదు. బిడ్డకు జన్మనివ్వడం ఆతరువాత పిల్లలకు పాలు ఇవ్వడం వృత్తిపరంగాతాము అవకాశాలు కోల్పోతామన్న భావన సేలబ్రేటీలలో పేరుకుపోవడం తో సరోగాసి ని అస్రయిస్తున్నరన్నది వాస్తవం. విధం చెడ్డ ఫలం దక్క లేదన్నట్టు సేల్బ్రేటీలు సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారు.సృష్టి కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీరి ఆలోచన పూర్తిగా విమర్సలకు దారితీస్తోంది.
అసలు వీళ్ళు చట్టాన్ని నియమనిభందనలను పాటిస్తున్నారా, చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది అసలు వీరు సరోగాసికి వెళ్లేందుకు ఎవరు అనుమతించారు వీరి సరోగట్ వివరాలు గోప్యంగా ఉంచినా వ్యాపారాత్మకంగా సరోగాసికి ప్రోత్సాహం కల్పిస్తున్నారా అన్నది మరోప్రశ్న.ఇక సరోగాసిలో వైద్యులు చెపుతున్న వివరాల ప్రకారం శుక్రకణాలు X,Xకలిస్తే ఆడపిల్లని XY. కలిస్తే మగపిల్లవాడని ఒకసరోగట్ కు ఒకరిని మాత్రమే కనాలని నిబంధన ఉన్న కవలలు సాధ్యమా అన్న ప్రశ్నకు గయన కాలజిస్ట్లు లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
సరోగసి చట్టం 2౦21 యొక్కలక్ష్యం...
భారత్ లో సరోగాసి తో వ్యాపారం నివారించడమే లక్ష్యంగా పార్ల మెంట్ రూపొందించింది.
మనదేశంలో ఉన్న చట్టం ఏమి చెపుతోంది...
ప్రముఖ వైద్య నిపుణులు అంశుమన్ కుమార్ మాట్లాడుతూ సరోగసి వైద్య ప్రక్రియ దంపతులకు సంతానం కలగదో పిల్లలు కావాలని కోరు కుంటారో గర్భసంచిని అద్దెకు తీసుకోవచ్చు.అలా గర్భాన్ని అదీకిచ్చే మహిళను సరోగేట్ అని అంటారు.సంతానం కావాలని కోరుకునే వారిలో శుక్రకణాలను,అండాశయం లోనుండి తీసి ల్యాబ్ లో పరీక్షించిన తరువాత వైద్య ప్రక్రియ ద్వారా వాటిని శంకరం చేస్తారు.వైద్య విధానం ద్వారా మాత్రమే సరోగేట్ గర్భసంచిలో చేరుస్తారు.సరోగేట్ గర్భంలోనే పిండం పెరుగుతుంది.9 నెలల తరువాత జన్మనిస్తుంది ఈసమయంలో సరోగేట్ తో జరిగిన ఒప్పందం ప్రకారంఅయ్యే వైద్య ఖర్చు దంపతులే భరించాలి మనదేశం లో ఉన్న ఆర్ధిక అసమానతలు బలహీనంగా ఉన్న మహిళలు సులభంగా సరోగేట్ తల్లులు లభిస్తూ ఉండడం తో విదేశీయులు,ఆర్ధికంగా బలంగా ఉన్నవారు పిల్లలను కనేందుకు ఈ మార్గం ఎంచుకోవడం ఈ పద్దతిలో పిల్లలను పొందడం సరోగేట్ తల్కికి డబ్బులు ఆశచూపడం చట్టప్రకారం ఇది నిషేదించిన కొన్ని నియమనిబందనల ను రూపొందించి సరోగాసిని నివారించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం మంచిదే.
వ్యాపారాత్మక లాభం తో చేసే సరోగసీ పై నియంత్రణ...
డిల్లి హైకోర్ట్ న్యాయవాది కరణ్ సింగ్ మాట్లాడుతూ సరోగసి నియంత్రణ చట్టం రెగ్యు లేషన్ యాక్ట్ 2౦21 ప్రకారం వ్యాపార సంబంధ సరోగాసి ని నిలుపుదలచేసింది.డిసెంబర్ 2౦21 పార్లమెంట్ లో చట్టం ఆమోదించింది. జనవరి 25 2౦ 22 ఈచట్టానికి రాష్ట్రపతి ఆమోదించడం తో న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.చట్టం ప్రకారం సరోగసి నిబంధనలకు లోబడి పరస్పర పరోపకారం తోనే సరోగాసీకి అనుమతిస్తారు.సరోగేట్ తల్లి కి తప్పనిసరిగా దంపతులు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.ఆమెకు ౩6 నెలలు నిండి ఉండాలి. దీనితోపాటు సరోగేట్ తల్లికి అయ్యే వైద్యం ఖర్చు దంపతులె భరించాలి.సరోగేట్ తో మరే ఇతర ఆర్ధిక లబాదేవీలు నిర్వహించారాదని చట్టం లో పేర్కొన్నారు.ఏ క్లినిక్ లో అయితే సరోగాసి చేస్తున్నారో అది తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండడం తప్పనిసరి అని చట్టంలో పేర్కొన్నారు. సరోగసిలో ఎగ్ కుసంబందించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించారాదాన్న నిబంధన తప్పనిసరి అని నిబంధనలో స్పష్టం చేసారు.
అసలు సరోగేట్ మదర్ ఎవరు అవుతారు?...
హైకోర్ట్ న్యాయావాది నవీన్ శార్మ చెప్పిన వివరాల ప్రకారం కొన్ని నిబందనలు చేర్చారు.ఎవరైనా ఒకమహిళ ఒక్కసారి మాత్రమే సరోగేట్ మదర్ గా ఉంటుంది.ముందే ఆమె వివాహిత అయ్యిఉండాలి.అప్పుడే ఆమె సరోగేట్ తల్లికాగలదు. ఆమెకు ఎటువంటి మత్తు పదార్ధాలు తీసుకునే అలవాటు ఉండకూడదు.వైద్య పరంగా ఆమె ఫిట్ గా ఉండాలి.ఒక వేళ సరోగేట్ తల్లికి ఇన్సూరెన్స్ చేయించక పోవడం,వైద్య ఖర్చులు ఇచ్చే నిబంధన ను ఉల్లంఘిస్తే ఆడంపతులకి 1౦ సంవత్చరాల జైలు 1౦ లక్షల జరిమానా ఇవాల్సి ఉంటుందని నిబంధనలో పేర్కొన్నారు.
సరోగాసితో అందరూ తల్లి తండ్రులు కాలేరు. డిల్లి హైకోర్ట్ న్యాయవాది రాజీవ్ కుమార్ మాలిక్ మాట్లాడుతూ ఎవరైతే దంపతులు సరోగసి ద్వారా పిల్లలు కావాలని అనుకుంటారో వారికి ముందునుండే పిల్లలు ఉండ కూడదు.వారు వ్యక్తిగతంగా ఎవరినీ దత్తత తీసుకుని ఉండకూడదు.దంపతులలో పురుషుల వయస్సు 26-55 సంవత్సరాల మధ్య ఉండాలని స్త్రీల వయస్సు 2౩-5౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.విడాకులు తీసుకున్న వివాహిత లు, వేరుగా జీవిస్తున్న వారుహోమోసేక్షువల్స్ సరోగాసికి అనుమతిలేదని నిబంధనలో పేర్కొన్నారు.సరోగసిని తప్పుడు పద్దతులలో అనుసరించే వారు నియంత్రిచేందుకు చట్టం అమలు చేస్తున్నారు.
చట్టం లో లొసుగులు...
సరోగాసి విషయానికి సంబంధించి డాక్టర్ అంశుమన్ మాట్లాడుతూ సరోగాసి ప్రక్రియలో వైద్యనిపునులతో పాటు పిండం తయారి సంక్రమించే పద్ధతి అయ్యే అవకాసం ఉందని నిర్ధారణ కావాలి. అది అదా మగ అని అడగకూడదు. శుక్రకణా లలో 2౩ కన్నా ఎక్కువ ఉంటె ఎక్స్ క్రోమోజోమ్స్ తీసుకోవాలి అండా ణువులు 2౩ ఎక్స్ క్రోమోజోమ్స్ తీసుకోవాలి రెండింటినీ కలిపి ఫలదీకరిస్తే 46 ఎక్స్ కణాలు ఉంటె ఆడపిల్ల పుడుతుందని శుక్ర కణాలు 2౩ కన్నా ఎక్కువ క్రోజోములు తీసుకుంటే వై క్రోమో జోములు కలిస్తే బాలుడు పుడతాడని నిపుణులు అంటున్నారు.
దంపతులు వారివద్ద ఉన్న క్రోమోజోముల లభ్యత ఆధారంగా పిల్లలను సరోగాసిద్వారా పుట్టించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.ఇందులో ఏ మాత్రం చట్టానికి సడలింపు ఉండరాదని పిల్లల పట్ల లింగ వివక్ష ఉండరాదని లింగనిర్ధారణ పరీక్ష నిషేధం అమలు చేయాలాని చట్టంలో పేర్కొన్నారు.సరోగసి విషయం లో నిపునులమధ్య ఎలాంటి అంతర్గత ఒప్పందాలకు తావు ఈయరాదాని పేర్కొన్నారు.
కాగా సరోగాసి ద్వారా పుట్టిన బిడ్డకు రక్షణ సంరక్షణ విధానం లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదని ఇందుకోసం సరోగసి చట్టం తో పాటు బాలల సంరక్షణ, దత్తత కార్ నిబంధనల ప్రకారం 2౦15 ప్రకారం అనుసరించాలని తద్వారా బాలిక సంరక్షణ కలిగిస్తుందని అయితే సరోగాసి నిషేదింప బడలేదని సరోగసి ని నియంత్రణ చేసేందుకు చట్టం రూపొందించామని నిపుణులు పేర్కొన్నారు.