ఆహారమే ఆరోగ్యం అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. అయితే శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన పోషకాలు, విటమిన్లు అవసరం అవుతాయి. ఆయా విటమిన్లు తీసుకుంటేనే ఆయా భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ప్రతి అవయం పనితీరు మెదడు మీదనే ఆధారపడి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెదడు పనితీరు మందగిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చాలావరకు జ్ఞాపకశక్తి తగ్గడం అనేది వయసు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. కానీ కొందరిలో మాత్రం చిన్నవయసులోనే జ్ఞాపకశక్తి లోపిస్తుంటుంది. కానీ మెదడుకు శక్తిని ఇచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తింటే బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది.
తృణధాన్యాలు..
శనగలు, ఓట్స్, పెసలు, మిల్లెట్స్ మొదలైన తృణధాన్యాలు తీసుకోవాలి. వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
చేపలు..
సాల్మన్, సార్డినెస్ లేదా ట్యూనా వంటి చేపలను వారానికి ఒకసారి తినాలి. వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది విటమిన్ డి, ఇతర ఖనిజాలను భర్తీ చేస్తాయి. ఇది మెదడుకు అలాగే మొత్తం ఆరోగ్యానికి మంచిది.
బీన్స్..
బీన్స్, కాయధాన్యాలు, సోయాబీన్స్ మెదడుకు కావల్సిన ఆహారంలో ప్రముఖమైనవి. ఎందుకంటే అవి అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. వారానికి కనీసం నాలుగు సార్లు వాటిని తినాలి.
చికెన్
మెడిటరేనియన్, DASH డైట్‌లతో రూపొందించబడిన మైండ్ డైట్‌ని అనుసరిస్తుంటే వారానికి రెండుసార్లు చికెన్ తినమని సలహా ఇస్తారు. చికెన్ లో అధిక ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాల ఉంటాయి.
పచ్చని ఆకుకూరలు..
పచ్చని ఆకు కూరలు ప్రతి వారం 6 సార్లు కంటే ఎక్కువగా తినడం మెదడుకు అలాగే ఆరోగ్యానికి రెండింటికీ మేలు చేస్తుంది. ఇందులో బచ్చలికూర, బ్రోకలీ, పాలకర, ఆకుకూరలు, పొట్లకాయ, మెంతులు మొదలైన కూరగాయలు ప్రముఖమైనవి.
బెర్రీలు
బెర్రీలు కొన్నిప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతాయి. పైగా ఇవి ఖరీదైనవి. కానీ వారానికి రెండుసార్లు బెర్రీలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలు మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి.
గింజలు
గింజలను తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నట్స్ తినాలి. వీటి వినియోగం మెదడును చాలా షార్ప్ గా మారుస్తుంది.
*నిశ్శబ్ద.