ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని  ‘కూర్చిక’ అంటారు. ఇందులో “పంచదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు.  *”ధనియాలు”, “జీలకర్ర”, “శొంఠి” ఈ మూడిఃటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది. కూర్చిక పానీయం సాంప్రదాయ పానీయాలలో ఒకటి. చాలామంది వేసవి కాలంలో శీతల పానీయాలు ఎక్కువగా సేవిస్తుంటారు. అలాంటి వారు కూర్చిన పానీయం తీసుకుంటే మంచిది. వేసవి దాహార్తిని తీర్చుకోవడంతో శరీర ఊష్ణోగ్రతను తగ్గించడానికి కూర్చిక పానీయం దోహదపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతికుమార్ తెలిపారు.