వర్షాకాలంలో  అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. దోమలు విజృంభించడం వల్ల  అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు వర్షాకాలంలోనే మొదలవుతాయి. ఈ సీజన్‌లో స్కిన్ అలర్జీలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు సర్వసాధారణం. ఉష్ణోగ్రత, గాలి నాణ్యత, ధూళి,  తేమ కారణంగా వర్షాకాలంలో మెడ, మోచేతులు, చేతులు, రొమ్ము కింద, గజ్జ చర్మం మొదలైన ప్రాంతాల్లో చెమట ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా, బ్యాక్టీరియా,  వైరస్లు పుడతాయి. ఇది   అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంటర్‌ట్రిగో, రింగ్‌వార్మ్, తామర, చర్మపు దద్దుర్లు, గొంతు నొప్పి, తామర, జలుబు,  జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది. 

చర్మంలో తేమ కారణంగా చెమట పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపించి దురద మొదలవుతుంది. ఇది మాత్రమే కాకుండా దోమలు కుట్టడం, వర్షం కారణంగా కొన్ని పురుగులు స్వేచ్చగా సంచరిస్తూ కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది చర్మం దురద, లేదా రాషేష్ కు కారణం అవుతుంది. ఇలాంటి  పరిస్థితిలో వర్షాకాలంలో దురద  దద్దుర్లు  తగ్గడానికి ఇంటి  చిట్కాలను  అనుసరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.  ఈ నాలుగు పదార్థాలు ఉపయోగించడం ద్వారా దద్దుర్లు తగ్గించుకోవచ్చు. 

గంధపు పేస్ట్..

వర్షాకాలంలో చర్మంపై దురద ఎక్కువగా ఉంటే, అప్పుడు గంధపు పేస్ట్ చర్మానికి బాగా పనిచేస్తుంది. చందనం చర్మానికి మేలు చేస్తుందని ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో పేర్కొన్నారు. కాబట్టి నేరుగా గంధం చెక్కనుండి  తీసిన పేస్ట్ లేదా మార్కెట్ లో లభించే గంధం పొడి ఉపయోగించవచ్చు. కొద్దిగా రోజ్ వాటర్ ను ఉపయోగించి గంధం  పేస్టు తయారుచేసుకోవాలి. దీన్ని  దురద ఉన్న చోట అప్లై చేయాలి. రెగ్యులర్ ఇల్ అప్లై  చేస్తుంటే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. పనిలో పనిగా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించడంతో పాటు ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో దురద వస్తే కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. ముందే చర్మానికి రాసుకుంటూ ఉంటే దద్దుర్లు, దురదలు రావు.

నిమ్మకాయ, బేకింగ్ సోడా..

నిమ్మకాయ చర్మానికి మేలు చేస్తుంది. వర్షంలో చర్మంపై తేమ వల్ల దురద వస్తే రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత చర్మాన్ని కడగాలి. దీన్ని రోజుకు ఒకసారి చేయడం వల్ల దురద నుండి బయటపడవచ్చు.

వేప..

వేప చాలా ప్రయోజనకరమైన ఆయుర్వేద ఔషధం. చర్మ సంబంధిత సమస్యలలో వేపను ఉపయోగించడం మేలు చేస్తుంది. దురద సమస్య తొలగిపోవాలంటే వేప ఆకులను మెత్తగా చేసి చర్మానికి రాసుకోవాలి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.

                                 *నిశ్శబ్ద.