సకల జీవులకు నీరే ప్రాణాధారం. మానవ శరీరంలో దాదాపు 70శాతం నీరు ఉంటుంది. మనిషి జీవితం చాలా వరకు నీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని అంటుంటారు. కానీ నీరు తాగే విధానంలోనే దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొందరు నీటిని నిలబడుకుని తాగుతారు. మరికొందరు చాలా వేగంగా ఒక్కసారే నీటిని తాగుతారు. ఇంకొందరు మెల్లిగా నీటిని తాగుతారు. అయితే నీరు ఎలా తాగితే మంచిది? ఎలా తాగకూడదు? వైద్యులు చెబుతున్న విషయాల వైపు ఓ లుక్కేస్తే..
నిలబడి నీళ్లు తాగడం వల్ల జరిగేది ఇదీ..
నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం అస్సలు నిలబడి నీళ్లు తాగకూడదు.
కీళ్లనొప్పులు ఉన్నవారు ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి. నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలో ద్రవం పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది.
నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
నిలబడి నీరు త్రాగడం జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో గాయం అవుతుంది.
నీరు త్రాగడానికి సరైన మార్గం..
నీరు తాగేటప్పుడు హాయిగా కూర్చొని తాగాలని వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుక్కలుగా తాగాలి. నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా శరీరం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. అంతేకాదు చిన్న గుక్కలుగా నీరు తాగేటప్పుడు నీటిలో లాలాజలం కలిసి జీర్ణక్రియ పెరగడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.