అలిసిన కండరాలు...

అదేపనిగా కండరాలను ఉపయోగించడం వల్ల శక్తి ఉడిగిపోయిందని అనిపిస్తుంది. అలసట ముఖ్యంగా క్రికెట్, ఫూట్ బాల్,లేదా వాలి బాల్ ,లాంటి ఆటలు ఆడిన తరువాత పెరటి తోటలో కలుపు తొలగించి,చెట్ల కు పాదులు చేయడం చేసేటప్పుడు పట్టే సమయం. ఇల్లుమారే సమయం లో పెద్ద పెద్ద డబ్బాలు వస్తువులు స్వయంగా మోసినప్పుడు. స్వయంగా అలసి పోతారు.అలసట కారణంగా కండరాలు ఇంతకు ముందులాగా కండరాలు సంకోచించక పోవడాన్ని గమనించ వచ్చు. మనం శ్రమిస్తున్నప్పుడు కండరాలలో లాస్టిక్ యాసిడ్ పేరుకు పోవడం తో అవి అలసటకు గురి అవుతాయి.శరీరానికి అవసరమైన శక్తి అందుబాటులో లేనప్పుడు ఆక్సిజన్ లభించనప్పుడు లాస్టిక్ యాసిడ్ పరిణామం పెరుగుతుంది. మనశరీరం అధికంగా శ్రమిస్తున్నప్పుడుకండరాలలో ఆమ్ల తత్వం పెరిగి పి హెచ్ 6.4 నుంచి 6.6 వరకు పెరుగుతుంది.సహజంగా మనం నిద్ర పోతున్నప్పుడు క్షారత్వం 7.15 గా ఉంటుంది.పోటేన్షియల్ హైడ్రోజన్ ౦--14 మధ్య సూచిక గా రెండిటికీ మధ్య 7 కంటే ఎక్కువ తతస్తంగానూ ఉంటుందని. ఆరోగ్యంగా ఉండే వ్యక్తిలో క్షారత్వం కొంచం అమ్లత్వం ఉంటుందని. దీనికన్నా ఎక్కువ తక్కువలు ఉంటె అనారోగ్యంగా ఉన్నట్లు సూచికగా గుర్తించాలి.అలిసిన కండరాలకు అందించగల ప్రాధమిక చికిత్చ నీళ్ళు తాగడమే అని నీళ్ళు తాగడానికి దాహం వేసే దాకా నీళ్ళు తాగడానికి ఎదురు చూడనవసరం లేదు.శరీరం కష్టపెట్టక శ్రమించాక నీళ్ళు తాగడం కండరాల అలసటను తీర్చడానికి నీళ్ళు తోడ్పడతాయి. నీళ్ళు తాగని పక్షం లో కండరాలు తిమ్మిరేక్కుతాయి.

నీరసించే నాడీ వ్యవస్థ...

మన శరీరంలో నీరస పడడాన్ని సెంట్రల్ ఫాటిగ్యు అని అంటున్నారు వైద్యులు.కేంద్ర నాడీ వ్యవస్థ మెదడులో సేరోటినిన్ ట్రిప్టో ఫన్ అనే ఎమినో యాసిడ్ పరిమాణం పెరగడం వల్లే అలిసిపోయిన భావన కలుగుతుందని పరిశోదనలో వెల్లడి అయ్యింది.అలసట కారణం గా కాస్త విశ్రాంతి కావాలని, నిద్రపోవాలన్న బలమైన కోరిక కలిగిస్తుంది. దీర్ఘాకాలం పాటు ఫాటిగ్యు సిండ్రోమ్ సి ఎఫ్ ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది సంకేతమని వైద్య నిపుణులు సూచిన్స్తున్నారు. ట్రిప్టో ఫన్ ఎక్కువగా తాయారు కావాడానికి కారణం సిరో టోనిన్ అధికఉత్పత్తికి దారి తీస్తుంది.సేరోటోనిక్ నాడీ కణాల్ మధ్య సందేశాలను మోసుకు పోయే రసాయనం గా పేర్కొన్నారు  నిపుణులు. సెరోటోనిన్ కారణంగానే ఆకలి, జీర్ణం, నిద్ర, లైంగికవాంచ ,మానసిక స్థితి శరీరంలో రోజు వారీ పనులు క్రమబద్దీకర చేస్తుంది. సెరో టోనిన్ ఆరోగ్య కరమైన శారీరక స్థితి, విశ్రాంతి, నిద్రకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ అలసిపోవడానికి కారణం శరీరంలో గ్లైకోజన్ పరిమాణం పెరగ డాన్ని నిపుణులు గుర్తించారు.పలు అధ్యనాలు ఇప్పటికే కేంద్ర నాడీ మండలపు అలసటను ప్రేపిస్తుందని ఆఅధ్యయనం లో వెల్లడించారు.గ్లైకోజన్ లోటును పూడ్చి ప్రమాదాల బారిన పడకుండా తోడ్పడుతుందని నిపుణులు విశ్లేషించారు.

అలసటకు కారణాలు ఇవే...

మన శరీరం లోని కండరాలు నాడీ మండల అంటే మెదడు అలసట సమస్యను ఎదుర్కోవచ్చు. మీరు మీ శరీరం అదే పనిగా అలిసి పోతూ ఉండడం తీవ్రమైన అనారోగ్య సమస్య కు సంకేతమని అది హెచ్చరిక గా గుర్తించాలి.మీరు తీవ్ర మైన అలసటకు గురి అవుతున్నారన్న విషయం గుర్తిస్తే ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.వైద్య పరమైన అత్యవసర పరిస్థితికి దారి తీయకుండా మున్డుజాగ్రత్త తో వ్యవహరించడం అవసరం.

రక్తహీనత /ఎనిమియా....

రక్త హీనత మొదటి లక్షణం అలసట.
రక్త హీనత అంటే కొన్ని ఎర్ర రక్తకణాలు లేకపోవడం.
ఎర్ర రక్త కణాలలో సరిపడా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రవాణా చేసే ప్రోటీన్ ఉండకపోవడం గమనించవచ్చు. రక్త హీనత వల్ల శరీరంలో అవయవాలు వాటిలోని కణాలకు ఆక్సిజన్ అందదు.గ్లోకోజ్ ఉన్న ఆక్సిజన్ కొరత వల్లశారీర కణాలు దానిని వాడుకోలేవు. కొద్ది పాటి శ్రమకే అలసట ఏర్పడుతుంది.తత్ఫలితంగా ఊపిరి అందదు, చాతీ లో నొప్పి వస్తూ ఉంటుంది.అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీయవచ్చు.

హార్మోన్ సమస్యలు...

మనం త్వరగా అలిసిపోవడానికి కారణం హార్మోన్ లో లోటు పాట్లు కీలపాత్ర పోషిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని హార్మోన్లు విపరీతంగా పెరిగినా,తగ్గిన హైపో థైరాయిడిజం, మదుమేహం అడిసన్స్ డిసీజ్ వ్యాధులు వస్తాయని భారత్ లో పదిహేను కోట్ల మందిలో హైపో ధైరాయిడిజం  ఉన్నట్లు అంచనా ఇందులో చాలా మందికి ధైరాయిడ్ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలోవిశాఖ,చెన్నై, బెంగ ళూరు లో నివసిస్తున్న వారికంటే సముద్రానికి దూరంగా కొండ ప్రాంతాలలో హైదరాబాద్ వరంగల్ బెంగుళూరు లో నివసిస్తున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది.ముఖ్యంగా పురుషులకంటే స్త్రీలు ఈ వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తమ అధయనం లో వెల్లడించారు. జీవ ప్రక్రియను నియంత్రించేది ధైరాయిడ్ హార్మోన్లు మాత్రమే అది మనశారీరపు ఉష్ణోగ్రతను గుండె కొట్టుకోవడాన్ని ఆహారం ద్వారా శరీరానికి అందిన కాలరీలను ఎలా ఖర్చు చేయాలో నిర్ధారిస్తుంది. పోషకాహారం లేకుంటే మనశరీరం తగిన శక్తి పొందలేదు అందుకు బలహీనపడి నిస్సతువ నీరసానికి దారితీస్తుంది.

మల్టి పుల్ స్క్లేరోసిస్...

మల్టిపుల్ స్క్లేరోసిస్ తీవ్రమైన సమస్య ఈకారణంగానే వెన్నెముకలోని నాడీ కణాలు క్రమంగా తమ సహజ సామార్ధ్యాన్ని కోల్పోతూ ఉంటాయి.దీనిప్రభావాం వివిధ అవయవాల్ తాలూకు స్పందన చలన  శక్తి దెబ్బతిని శరీరం మోద్దుబారడం. ఈ కారణంగానే కన్దారాల్ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఈ సమస్య తీవ్రమైతే మానసికంగా కృంగి పోతారు.ఎమె ఎస్ ఇటీవలి కాలం లో యువకులపై తీవ్రప్రభావం చూపిస్తోందని అధ్యనాలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యాధి బారిన పడిన వారిలో 8౦% మంది 18 -౩5 సంవత్స రాల వయసులో వారే అని అఖిల భారాత వైద్య విజ్ఞానసంస్థ బాల బాలికలు వృద్ధులలో వ్యాధి బారిన పడినవారు ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. ఎం ఎస్ బారిన పడిన వారిలో యువతీ యువకుల కంటే మధ్య వయస్సులో ఉన్న మహిళలు ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళలు ఎక్కువగా దీనిబారిన పడుతున్నారని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.ముఖ్యంగా ఎం ఎస్ కు గురయ్యే వారు పొగతాగే అలవాటు ఉన్న పురుషులు తేలికగా గురి అవుతున్నారని అధయనం లో పేర్కొన్నారు.కొన్నికుటుంబాలలో   వంశపారం పర్యంగా దారి తీస్తున్న విషయాన్ని నిపుణులు గుర్తించారు.ఇప్పటికీ ఖచ్చితమైన కారాణాలు ఇవి అని నిర్దారించనప్పటికీ వారి వారి అలవాట్లు ఎం.ఎస్ వ్యాధికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు వెల్లడించారు. కాగా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు వాతావరణ అలవాట్లు వివిధ రకాల అంటువ్యాధులువిటమిన్ డి లోపం  ఎం.ఎస్ కు దోహదం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. మల్టి పుల్ స్కేరోసిస్వ్యాదివల్ల వచ్చే నీరసం అలసట అసాధారణ స్థాయిలో ఉంటుంది.దీనికి తోడు ఇతర లక్షణాలు   తోడైతే మీరు  మరింత తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు.

క్యాన్సర్...

క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో నే బద్దకం అలసట వంటి లక్షణాలు ఉంటె మామూలుగా రక్తంలో కైటో కిన్స్ పరిమాణం పెరగడం వల్లే ఇలాంటి స్థితి ఉంటుందని ఆకలి మందగించడం అలసట మందగించి నంత మాత్రాన క్యాన్సర్ అన్న అభిప్రాయానికి రాకండి. క్యాన్సర్ కారణాలు మరిన్ని లక్షణాలు ఉంటె క్యాన్సర్ గా అవమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

గుండె వ్యాధులు..

గుండె వ్యాధుల పై జరిగిన అనేక అధ్యయనాలలో వాటికి శారీరక అలసట మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు వెల్లడించారు.కాగా గుంబ్దే పోటు కు మూడు నెలల ముందే మూడింట రెండు వంతుల మంది కి ముందే తీవ్రమైన అలసట ప్రత్యేకంగా వృద్ధులు మహిళల లో గుండె వ్యాధులు బయట పడ్డాయని.  పైగా గుండెపోటుకు గురి కావడం గురికవదాన్ని వైద్యులు నిపుణులు గుర్తించారు. మరో అంశం లో దీర్ఘకాలిక సి ఎం .ఎస్ ఫ్యాటిగ్యు సిండ్రోమ్ ను గురించి తెలుసుకుందాం.