శరీర అవయవాలలో కీలక అవయవం కిడ్నీ. రెండు కిడ్నీ లలో ఒకటి పాడైనా ఒక కిడ్నీ తో బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిడ్నీ సమస్యలకు కారణం ఇన్ఫెక్షన్, డయాబెటిస్, కిడ్నీ ఇంజురీ కిడ్నీ పూర్తిగా పాడై పోవడం ఒక్కసారి కిడ్నీ స్థానం లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీర్ఘ కాలంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మందులు వాడద్దు... సహజంగా నొప్పి వచ్చిందంటే పెయిన్ కిల్లర్స్ వాడేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కో సారి డాక్టర్ ను సంప్రదించకుండా నే గత నెల వాడిన మందులు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎం ఎస్ ఏ ఐ డి ఎస్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇంఫ్లా మెటరీ మందులు ఇబుఫ్రూబిన్, నోప్రోక్సిన్, వంటి మందులు కిడ్నీలను నాశనం చేస్తాయి. ఒక్కోసారి అధికంగా ఎక్కువగా మందులు వాడితే లేదా తరచుగా వాడినా ప్రోటాన్ పంప్ ఇన్ హిబిటర్స్ ను అల్సర్స్ కు,దీర్ఘ కాలం కిడ్నీ వ్యాదులకు జీ. ఇ . ఆర్.డి వాడే టట్ల యి తే మీ డాక్టర్ సూచన మేరకు అవసర మైతే నే వాడండి.
యాంటీ బాయిటిక్స్ తో జాగ్రతగా ఉండండి...
బ్యాక్టీరియా ను ఎదుర్కునే మందులు మీకిడ్నీలను నాశనం చేస్తాయి. తరచుగా వాడినా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడిన మీకిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అందులో పెన్సిలిన్,సల్ఫనా మైడ్స్,సేఫలా స్ పోరిన్స్ వల్ల సమస్యలకు దారి తీయ వచ్చు. హెర్బల్ సప్లిమెంట్స్ కు మారండి... సప్లిమెంట్స్ ఉత్పత్తులు సురక్షితం అని నిరూపించాల్సి ఉంది.అందులో కూడా కొన్ని సప్లిమెంట్స్, కిడ్నీ లను నాశనం చేస్తాయి. మీకు ఒక వేళ కిడ్నీ వ్యాధులు ఉంటె మందుల వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతుంది. హెర్బల్ సప్లిమెంట్స్ మందులు ఎలా పని చేస్తాయి వాటి ,వాడకం అన్న అంశం పై డాక్టర్ ను సంప్రదించాలి.
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం...
మీరు తాగినా తిన్నా ఏదైనా అరగాలంటే కిడ్నీ నే కీలకం. అది మంచి అయినా చెడు చేసేవి అయినా కొవ్వు పదార్ధాలు ఉప్పు, చక్కేర, అధికంగా వాడితే బ్యాడ్ డైట్ వల్ల హై బిపి కి లేదా ఊబ కాయానికి ఇతర సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల కిడ్నీ పై భారం పడి గట్టిగా తయారు అవుతుంది. కిడ్నీ ఆరోగ్యం గా ఉండాలంటే కూరగాయలు,పండ్లు, పప్పులు,త్రుణ ధాన్యాలు కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే మీ కిడ్నీ ఆరోగ్యం గా ఉంటుంది.
మీ ఉప్పు వాడకం గురించి తెలుసుకోండి...
మనం వాడే మినరల్ వివిదరకాల ప్రభావం చూపుతుంది. ఉప్పువల్ల మూత్రం లో ప్రోటీన్ ను పెంచుతుంది. ఒక వేళ ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటె వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడితే బిపి కి దారితీస్తుంది. బి పి వల్ల కిడ్నీ వ్యాధులు పెరగ వచ్చు. కిడ్నీలో రాళ్ళు పెరగడం వల్ల కిడ్నీ దగ్గర నొప్పిగా ఉంటుంది. కిడ్నీకి చికిత్స చేయకుండా కిడ్నీ పాడై పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సరిపడా నీరు తాగండి...
నీరు తాగడం వల్ల కిడ్నీలకు అత్యంత కీలక మైన న్యూట్రియం ట్స్ అందుతాయి. మీ బ్లాడర్ ద్వారా మూత్ర విసర్జన ద్వారా శరీరం లోని పనికి రాని చెత్త బయటకు పోతుంది. మీరు కనక సరిపడా నీరు తాగ నట్లైతే శరీరంలో ఉన్న చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడి రాళ్ళలా తయారు అవుతుంది. లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా స్వల్పంగా డీహైడ్రేషన్ జరిగి కిడ్నీ కి తీవ్రంగా నష్టం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 4, లేదా 6 కప్పుల నీళ్ళు తాగడం కష్టం గా ఉంటుంది. మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే నీరు తాగాలి వేడిని తట్టుకోవాలంటే నీరు త్గాగడం తప్పని సరి.
శరీర వ్యాయామం...
అర్రోగ్యంగా ఉండేందుకు ఆహారం తో పాటు శరీర వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్, గుండెకు సంబందించిన వ్యాధులు నివారించాకుంటే కిడ్నీ ప్రమాదానికి దారి తీయవచ్చు. ఒకవేళ అందుకు మీరు సిద్ధంగా లేకుంటే మీరు తోచిన విధంగా పని చేస్తే 3౦ నిమీ 6౦ నిమి 5 వారాలలో మెల్లగా కిడ్నీ పాడై పోతుంది.లేదా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు ఉంటె ముందుగా మీరు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
స్క్రీనింగ్ చేయించండి...
అసలు మీ కిడ్నీ ఎలా ఉంది. కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున కిడ్నీ సైజు లో మార్పులు ఎలాఉన్నాయా ?అన్న విషయం తెలుసుకోవాలంటే కిడ్నీ స్క్రీనింగ్ అత్యవసరం లేదా మీ సమీప బంధువులకు గుండె వ్యాధులు ఉంటె హై బిపి డయాబెటిస్ ఉన్న చరిత్ర మీ కుటుంబానికి మీ కుటుంబం లో ఎవరికైనా కిడ్నీ ఫైల్యూర్ వంటి సమస్యలు ఉంటె డాక్టర్ ప్రత్యేకంగా కిడ్నీ పరీక్ష ను సూచించ వచ్చు. మీ రెగ్యులర్ చకప్ తో పాటు ప్రాధమిక స్థాయిలో కిడ్నీ సమస్యను గుర్తిస్తే సత్వరం చికిత్స చేసి కిడ్నీ పాడై పోకుండా నివారించవచ్చు.
మద్యంతో జాగ్రతగా ఉండండి...
మీరు ఆరోగ్యంగా ఉంటె కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీకి హానికలగ కుండా ఒకటి,లేదా రెండు గ్లాసులు తీసుకోండి. రెండు గంటలలో నాలుగు డ్రింక్స్ తీసుకుంటే తీవ్రంగా కిడ్నీ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయవచ్చు. మీరు తీసుకునే మందు మద్యం మీకు డీ హైడ్రేషన్ కలిగించ వచ్చు. మీ కిడ్నీ సరిగా పనిచేయాకుండా నిలువరిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం. హై బిపి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కిడ్నీ పై తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది.
ధూమ పానం సిగరెట్ పొగను వదిలిపెట్టండి...
మీకు సిగరెట్ తీసుకునే అలవాటు ఉంటె అది మీ కిడ్నీ సమస్యకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలుసా? కిడ్నీ క్యాన్సర్ వల్ల రక్త నాళాలు నాశనం అవుతాయి. కిడ్నీలో సమస్య వస్తే రక్త ప్రసారం నెమ్మదిగా నెమ్మదిగా ఉంటుంది. మీరు సిగరెట్ తాగే అలవాటు వల్ల కొన్ని మందుల పై ప్రభావం చూపుతుంది. హై బిపి వస్తుంది. దీనిని నివారించడం అసాధ్యం. ఇదే కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది.
అనారోగ్యాన్ని సమార్ధ వంతంగా నిర్వహించుకోవాలి...
మీ కిడ్నీ సమస్యకు కారణం రెండు ఒకటి డయాబెటిస్, రెండు హై బిపి సమతుల పోషక ఆహారం రోజూ వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ పై దృష్టి పెట్టాలి అవసరమై నప్పుడు ఇంసూలిన్ తీసుకోండి. హై బిపి ని ఎప్పటి కప్పుడు చక్ చేయండి మీ డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడండి. కిడ్నీని కాపాడుకోండి.