శాస్త్రజ్ఞుల విశ్లేషణ...

భయంకరమైన ప్యాండమిక్ ముగిసిందా ? కాని కోవిడ్ మాత్రం అలాగే ఉందని అంటున్నారు.శాస్త్రజ్ఞులు ప్రపంచంలోకోవిడ్ బాధితుల సంఖ్య కొనసాగుతోందని పేర్కొన్నారు.భయంకరమైన కోవిడ్19 మనల్ని భయపెట్టింది ప్రాణాలే హరించింది.కోవిడ్ 19ముగిసినట్లే అని శాస్త్రజ్ఞులు అంటునారు.తొలిసారిగా రెండు సంవత్సరాల ప్యాండమిక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎదో రూపం లో ప్రభావితం చేసిందని అనడం లో సందేహం లేదు.కాకుంటే ప్యాండమిక్ తీవ్రత తగ్గి ఉండవచ్చు. కోవిడ్ ఇంకా అలాగే ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.భారత్ లోకూడా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు.

 

వ్యాధికి గల కారణాల పై ఇంకాపరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి.కేసులు కోవిడ్ వ్యాప్తి కేసులు అమాంతం పెరగడం అమాంతం తగ్గిపోవడం అంచనాలను తలకిందు చేస్తూ కోవిడ్ రూపం మార్చుకోవడం దాని తీవ్రత ఎలాఉంటుందో కనీసం అంచనాలకూడా అందని ఘటనలు మనం గతంలో చూసాము.కేసులలో రకరకాల లక్షణాలు ఉంటూ ఉండడం తో ఏరకం కోవిడ్ గా నిర్దారించాలో వైరస్ వేటికి లొంగుతుందో అర్ధంకాక ఏ చికిత్చ చేయాలో డాక్టర్లకు సైతం పెద్ద సవాలుగా మారింది.

 

ఒక్కోసారి మనకు తెలీకుండానే మరణానికి తీసుకుపోతుంది.మనం కోరోనాతో సహజీవనం చేయాల్సిందే అని సర్దుకు పోవాల్సిందే అని అశోక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గౌతం మీనన్ అభిప్రాయ పడ్డారు.ప్రపంచం ఎప్పటికీ అత్యవసరంగా అప్రమత్తంగా ఉండాల్సిందే కోవిడ్ ప్రారంభ మైన నాటినుంచే కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య నిశితంగా పరిశీలించిన గౌతం మీనన్ రెండుసంవత్సరాలుగా పరిశీలించిన తరువాత కోవిడ్ అంతర్జాతీయంగా అత్యవసర పరిస్తితిని ప్రకటించిన విషయాన్ని మరచిపోరాదని ప్యాండమిక్ ముగిసిన కోవిడ్ ఇంకా ఉందని కోవిడ్ కూడా త్వరాలో ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేసారు.ఇంకా కోవిడ్ అప్పుడప్పుడు హెచ్చరికలు పంపుతోందని ఎప్పుడు ఎలామారుతుందో చెప్పడం అంచనాకు అందని అంశంగా శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడ్డారు.