చలికాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం. ఈ సమయంలో పంట చేతికి వస్తుంది. రైతులు ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఈ సమయాన్ని గొప్ప పండుగగా జరుపుకుంటారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూడు రోజులపాటు పొంగల్ ను ఘనంగా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతికి పండుగకు స్పెషల్ నువ్వులు. ఈ పండుగలో నువ్వులు, బెల్లం, చెరకు ఎక్కువగా వినియోగిస్తారు. సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పొంగల్:
పొంగల్ ను సాధారణంగా మకర సంక్రాంతి రోజు ఆరుబటయ తయారుచేస్తారు. సూర్యరశ్మి నుంచి మనకు విటమిన్ డి అందుతుంది. ఎంతో రుచికరమైన పొంగల్‌లో నెయ్యిని వాడుతారు. నెయ్యిలో కరిగే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ వంటకంలో విటమిన్ ఇ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
నువ్వులు, బెల్లం:
వేరుశెనగ, ఎండు కొబ్బరి, నువ్వులు, బెల్లం మిశ్రమంతో లడ్డును తయారు చేస్తారు. నువ్వులు విటమిన్ ఇ, రాగి, కాల్షియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలకు మంచి మూలం. నువ్వుల నూనె మన చర్మం, జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
ఎండు కొబ్బరి:
ఎండు కొబ్బరిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, ఎమ్‌సిటిలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చలికాలంలో చర్మ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
వేరుశనగ:
వేరుశెనగలో ఒమేగా-6 ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మం, కణాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. బి విటమిన్ బయోటిన్, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల, మృదువైన తల చర్మం కోసం అవసరం. ఇది వేరుశెనగలో లభిస్తుంది.
బెల్లం:
బెల్లం చెరకు నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. చెరకు కాలేయం డిటాక్స్‌లో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చల్లని వాతావరణంలో జలుబు, దగ్గును నయం చేస్తుంది.బెల్లంలో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి అనేక ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.