కరోనా వైరస్ ప్రారంభ మైన నాటి నుండి ఎన్నోరకాల వేరియంట్లు ముందుకు వస్తూనే ఉన్నాయి.అయితే ఎక్స్ ఇ నూతన వేరియంట్ ను గుర్తించారు.ఎక్స్ ఇ పై డబ్ల్యు హెచ్ ఓ అమందో చూద్దాం.ప్రపంచం లో కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గు ముఖం పడుతోందని అని అనుకుంటున్న సమయం లో అందరు తమ తమ విధులను నిర్భయం గా చేసుకుంటున్నారు. ఈ సమయంలో మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చిందని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది.డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం కోరోనా వేరియంట్ ఎక్స్ ఇ ని గుర్తించినట్లు తెలిపింది. మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటి అంటే సాధారణ ఒమైక్రాన్ తో పోలిస్తే ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా వ్యాపిస్తుందని తెలిపారు. కాగా ఇప్పటివరకూ కోవిడ్ 19 ఒమైక్రాన్ లేదా అన్ని వేరియంట్లలో కన్నా ఇది అధికంగా మ్యుటేట్ చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని మూడవ వేవ్ గా విస్తరించేందుకు పెద్ద్దసమయం పట్టలేదన్న విషయాన్ని గమనించాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఒమైక్రాన్ వేరియంట్ కారణం గా వచ్చిన ఉప్పెన మొదటి వేవ్ కన్నా మూడవ విడతలో ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య తక్కువే అని పేర్కొన్నారు. ఒమైక్రాన్ డెల్టా వేరియంట్ ను సైతం వెనక్కు నెట్టి ఆశ్చర్యాన్ని కలిగించిందని నిపుణులు పేర్కొన్నారు.
కోవిడ్ ఎక్స్ ఇ ఐ దు వాస్తవాలు...
కొత్త వేరియంట్ ఎక్స్ ఇ ఐ దు గురించిన 5 అంశాలు తెలుసుకుందాం. ఎక్స్ ఇ ఒమైక్రాన్ బిఏ 1 బి ఏ 2 కలిసి ఉన్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచే వైరస్ వేరియంట్స్ గురించిన సమాచారం అందించే ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తుంది.డెల్టా క్రాన్ కన్నా ముందుగా వచ్చిందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.గతకొంత కాలం గా వైరస్ లు మరికొన్ని కలిసి పుట్టుకు వస్తున్నాయి.అందులో ఫ్లూరాన్ కూడా ఒకటి.ఎక్స్ ఇ కూడా బిఏ1 బిఏ 2 కలిసిన వేరియంట్ గా గుర్తించారు. ఈ రెండూ కాక ఇంకెన్ని ఉన్నాయి.అవి ఎక్కడ ఉన్నాయి అన్న అంశాల పై దృష్టి పెట్టాల్సి ఉంది. అని నిపుణులు అంటునారు.
ఎక్స్ ఇ వేరియంట్ ఆందోళన కరమా?....
ఎక్స్ ఇ వేరియంట్ స్వరూప స్వభావం ఎలా ఉంటుంది అన్న విష యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన ప్రారంభ రిపోర్ట్ లో ఎక్స్ ఇ వేరియంట్ ఆందోళన కరమైన వైరస్ గా పేర్కొంది. మార్చ్ 25 న వచ్చిన రిపోర్ట్ లో యు కే లో ఇప్పటి వరకూ 6౩7 మంది పై ప్రభావం చూపించిందని ఒమైక్రాన్ బిఏ 1 బి ఏ2 కలిసిన వేరియంట్ గా పేర్కొన్నారు.యు క్ కు చెందిన ఆరోగ్య శాఖ ఎజే సి సలహాదారు సుసాన్ వా ప్కిన్స్ మాట్లాడుతూ వేరియంట్ యొక్క ప్రభావం గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా బి ఏ 1 బి ఏ 2 కలగలిసిన వేరియంట్ ఎక్స్ ఇ మార్పు ఉన్నట్లు వివరించారు. ఈ వేరియంట్ ఎక్కడ పుట్టింది, ఎలా వృద్ధి చెందింది అన్న అంశాలు పూర్తిగా తెలియాల్సి ఉంది అని అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కోరోనా వేరియంట్స్ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సహజంగా అది వంశ పా రం పర్యంగా వేరియంట్ కు పరివర్తన చెందే గుణం ఉందని ఈ పరివర్తన లేదా రూపాంతరం చెందడం అత్యంత హానికరం గా పేర్కొన్నారు.
ఎక్స్ ఇ త్వరగా వ్యాపిస్తుంది ...
ఎక్స్ ఇ వేరియంట్ ఎక్కువ మందికి త్వరగా వ్యాపిస్తుందని త్వరగా సంక్రమిస్తుందని తెలుస్తోంది. ఒమైక్రాన్ తో పోల్చినప్పుడు దీని ప్రభావం 1౦ రెట్లు ఎక్కువగా ఉంటుందని సత్వరం వ్యాపిస్తుంది. ఇప్పటి వరకూ ఒమైక్రాన్ వేరియంట్ మాత్రమే త్వరగా విస్తరించి సంక్రమిస్తుందని భావించారు. ఒమైక్రాన్ ప్రపంచాన్ని చుట్టేయడానికి పెద్ద సమయం పట్ట లేదన్న విషయాన్ని గుర్తించాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.
ఎక్స్ ఇ తీవ్రత ఎలాఉంటుంది?...
డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం మరింత సమాచారం కోసం వేచి చూడాలని. గతం లో ఉన్న ఒమైక్రాన్ బి1 బి2 ప్రభావం లో పెద్దగా మార్పు లేదని ఒమైక్రాన్ కారణం గానే మూడవ విడత వేవ్ వచ్చిందని ఇప్పుడు చైనాలో వీర విహారం చేస్తోందని మార్చ్ నెలలో చైనాలో కోవిడ్ బారిన పడిన పడిన వారి సంఖ్య ఒక లక్ష కు ఎక్కువే ఉన్నాయని, ఇందులో అత్యధిక కేసులు షాంఘై లోనే ఉండడం గమనార్హమని డబ్ల్యు హెచ్ ఓ విశ్లేషించింది.
ఇప్పటి వరకూ దీని ప్రభావం ఎక్కడ ఉంది?...
ఒమైక్రాన్ ఎక్స్ ఇ వేరియంట్ ప్రభావం పడింది. యు కే కు చెందినా రక్షణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎక్స్ ఇ వచ్చిన నాటి నుంచి 6౩7 మంది పై ప్రభావం చూపించిందని తెలుస్తోంది.ఎక్స్ ఇ ప్రభావం దీనిలక్షణా లు సోకినా వారికి చేస్తున్న చికిత్స ఎలాంటి వాతావరణం లో మరింత ప్రభావ వంతం గా ఉంటుంది అన్న అంశం పై మరింత లోతైన అధయనం చేయాల్సి ఉందని ఆ వివరాలు అందిన వెంటనే వెల్లడిస్తామని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.