మీ కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు సరైన తోక్సిన్స్ పెరుగు తాయి. అది మీ రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అది మీకు ఆస్చార్యాన్ని కలిగించ వచ్చు. కిడ్నీలో సమస్యల లో వచ్చాయిఅనడానికి ఈ పదిలక్షణాలు గమనించండి.
1)మీరు తరచుగా అలిసిపోవడం...
మీ శరీరంలో కిడ్నీ ద్వారా రక్తం శుద్ధి చేసున తరువాత వచ్చే వేస్టేజ్ ను బయటికి పంపుతుంది. మీకిడ్నీ సరిగా పనిచేయనట్లయితే టాక్సిన్స్ పెరుగుతాయి.దీనికి సంకేతంగా త్వరగా అలిసిపోవడం అలసట వారం రోజులకు పైగా ఉండవచ్చు. కిడ్నీలు మీ శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే శరీరంలో
ఎర్ర,తెల్ల రక్తకణాలు ఉత్పత్తి చేస్తాయి. మీ కిడ్నీలో సమస్య ఉంటె రక్తం ద్వారా మెదడుకు కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక పోవచ్చు.
2 )నిద్రలేమి!
మీ నిద్రలేమికి కిడ్నీ వ్యాధికి సంబంధం ఉండచ్చు. అది మీశారీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీయవచ్చు. మీ శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నట్లే. కిడ్నీ లో సమస్యకారణం గానే ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది.ఒక్కోసారి కిడ్నీ సమస్య వల్ల గొంతులో నాళాలు కుంచించుకు పోతాయి. టాక్సిన్స్ పెరిగి అనేకసమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
౩ ) చర్మం పై దురద!
మీ శరీరం లోని టాక్సిన్స్ కిడ్నీ ద్వారా బయటకు రాకుంటే రక్తంలో టాక్సిన్స్ పెరిగినట్లే. ఈ కారణం గా దద్దుర్లు రావడం దురదకు దారితీస్తుంది.మీకిద్నీ కొంత కాలానికి మినరల్స్ ను న్యుట్రీషియన్స్ సమతుల్యం గా ఉంచలేదు. మినరల్స్ సరిగా అందకుంటే ఎముకలకు సంబందించిన సమస్యలు వచ్చి మీ చర్మం ఎండిపొయినట్లు గా దురదగా ఏర్పడుతుంది.
4 )ముఖం -కాళ్ళు వాయడం!
మీకిడ్నీకి అవసరమైన సోడియం అందకుంటే శరీరంలో ఫ్లూయిడ్స్ ఏర్పడి చేతులు కాళ్ళు,పాదాలు లేదా ముఖం వాచినట్లుగా ఉంటుంది. ప్రత్యేకంగా కాళ్ళ లో,కాలిమడమల లో వచ్చేవాపులు గమనిస్తే లేదా మూత్రంలో ప్రోటీన్ కోల్పోతారు కాళ్ళు వాచినట్లు కనిపిస్తుంది.
5 )కండరాలు పట్టేయడం!
కాలినరాలు పట్టేయడం అంటే మీ కిడ్నీ పనితీరు సరిగాలేదని అర్ధం. సోడియం,కాల్షియం,పొటాషియం, సమానంగా లేకపోవడం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు కొంతమేరకు ఇబ్బంది కలిగిస్తాయి. దీని ఆధారంగానే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ పనిచేస్తాయి. సమస్య తలెత్తితే కిడ్నీ ఎలాఉంది అన్నది మొదటి ప్రశ్న.
6 )ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది!
మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎరిత్రో ప్రోటీన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. హార్మోన్ సిగ్నల్ వల్లే ఎర్రరక్త కణాలు తయారు అవుతాయి. అలా జరగ నట్లయితే పూర్తిగా రక్త హీనత ఏర్పడుతుంది. అప్పుడే మీకు ఊపిరి అందడం కష్టంగా ఉంటుంది. అది ఒక్కో సారి తీవ్రసమస్యాగా మారితే కళ్ళు తిరగడం లేదా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
7)మెదడు మొద్దుబారినట్లుగాఉండడం!
తల పై ఎదో కమ్మినట్లు మబ్బుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శరీరంలో మీ కిడ్నీ సరిగా ఫిల్టర్ చేయనట్లయితే టాక్సిన్స్ మీ మెదడుపై ప్రభావం చూపుతాయి.ఒక్కొసారి మెదడు చీకట్లు కమ్ముకుంటాయి. దీనుకి కారణం శరీరానికి ఆక్సిజన్ అందాకపోవడం. అప్పుడే కళ్ళు తిరిగినట్లు ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి చిన్న చిన్న సమస్యలు సైతం కష్టంగా కనిపిస్తాయి.
8)ఏపటై టిస్ తగ్గడం!
కిడ్ని సమస్య ఉంటె మీఅహారం అరగక పోవడం. శరీరం అసహనంగా ఉండడం. దీర్ఘంగా అలసట గాఉండడం. ఈ కారణంగానే వాంతి వచ్చినట్లుగా ఉండడం. లేదా పొట్టలో సమస్యలు అరగక పోవడం లేదా విరేచనాలు. ఆకలి మండగిబ్చడం లేదా ఆహారం తీసుకోవాలని అనిపించక పోవడం వంటిలక్షణాలు ఉంటె త్వరగా మీరు బరువు కోల్పోతారు.
9)నోటి దుర్వాసన!
మీకిడ్నీ లో సమస్య వచ్చి ఫిల్టర్ జరగకుంటే శరీరంలోని వేస్టేజ్ బయటికి పోవడం వల్ల యురీమియా సమస్య వస్తుంది. ఈ కారణంగా నే మీ శ్వాస ఊపిరిలో దుర్వాసన వస్తుంది.శరీర రక్త కణాలలో టాక్సిన్ చేరి మెటాలిక్ గా మారి రుచిని కోల్పోతారు.
1౦)మూత్రం లో నురగా లేదా రక్తం పడడం లేదా రక్త స్రావం.లేదా మీ మూత్రం బ్రౌన్ రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీశరీరంలో అధికంగా ప్రోటీన్ చేరినా దీనిని ఆల్బుమిన్ ఉంటె అది కిడ్నీ సమస్యకు దారితీయవచ్చు. మూత్రం తెల్లగా లేదా బ్రౌన్ రంగులో కి మారడం ంటే కిడ్నీ లో లోపం ఉన్నట్లే అంటే కిడ్నీ సమస్య ఉన్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. మూత్ర నాళం ద్వారా రక్త శ్రావం కిడ్నీలో రాళ్ళు, ఇతర ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు గమనించిన వెంటనే మీరు దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించడం అవసరం తద్వారా కిడ్నీ మార్పిడికి పోకుండా కిడ్నీ లో వచ్చే తీవ్ర సమస్యను ముందుగానే గమనించి విలువైన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. లేదా కిడ్నీని రక్షించుకోవచ్చు.