భారతీయులు ఆహార ప్రియులు.  భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి.  ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం  చపాతీ,  రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు. అయితే ఒకే భోజనంలో చపాతీ,  అన్నం రెండూ తినడం మంచిదేనా అని కొందరి అనుమానం.  నిజానికి నేటికాలంలో హోటళ్లలో కూడా  ఇలాంటి మెనూనే లంచ్ లో ఇస్తంటారు.  అయితే రెండూ తినడం ఎంత వరకు మంచిది? తెలుసుకుంటే..

బోజనంలో చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం అనేది పూర్తీగా వ్యక్తి శారీరక స్థితి మీద ఆధారపడి ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. కానీ స్పష్టంగా చెప్పాలంటే మాత్రం చపాతీ, అన్నం రెండూ భోజనంలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచి ఛాయిస్ కాదని అంటున్నారు.

ఒక్క చపాతీ,  ఒక కప్పు అన్నం.. ఇది చాలా మంది ఎంచుకునే అలవాటు. దీన్ని చాలా ఇష్టంగా ఎంచుకుంటారు. పైగా దీన్ని చాలా బాలెన్స్డ్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.  కానీ చపాతీ, అన్నం.. రెండూ భోజనంలో తీసుకోవడం అయితే అస్సలు మంచిది కాదట.

చపాతీలోనూ, అన్నంలోనూ.. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.  రెండూ భోజనంలో తినడం వల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా శరీరానికి అందుతాయి. తద్వారా కేలరీలు కూడా ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు,  బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అన్నం అవాయిడ్ చేసే చర్యలో భాగంగా కొంచెం అన్నం,  చపాతీ అని తమ లంచ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది  రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.  అందుకే ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు తినకూడదు.

ప్రతి ఆహార పదార్థంలో ఉండే కార్బోహైడ్రేట్‌లకు  విభిన్నమైన శైలి ఉంటుంది.  గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్ వేరు,  అన్నంలో ఉండే కార్బోహేడ్రేట్స్ వేరు.. ఈ రెండింటికి విడివిడిగా తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  అందుకే ఈ కాంబినేషన్ తినడం మంచిది కాదు.

                               *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...