ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది. దీన్ని ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం మాత్రమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. హార్మోన్లను బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడేవారు దాన్ని సరైనా పద్ధతిలోనే వాడుతున్నారా లేదా అనేదాన్ని బట్టి పై ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని తప్పుగా వాడితే ప్రయోజనాలు చేకూరడానికి బదులు హాని కలుగుతుంది. అసలు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా వాడాలంటే..
ప్రయోజనాలు..
ఆపిల్ సైడర్ వెనిగర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. రోజూ 1 స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసుడు వేడి నీటిలో కలిపి తీసుకోవాలి. ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, ఇన్ఫెక్షన్ ల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ రోజూ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారికి కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
జుట్టు పెరగడం, చుండ్రు, దురద వంటి సమస్యలను తొలగించడానికి, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక మగ్ నీటిలో కలపాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ నీటిని మీ జుట్టుపై పోసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఎలా తాగాలి..
3 నెలల పాటు ప్రతిరోజూ 1 నుండి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ మొత్తం కంటే ఎక్కువ ఆపిల్ వెనిగర్ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. దంతాలు కూడా పసుపు రంగులోకి మారుతాయి.
*రూపశ్రీ.