నేటికాలంలో ప్రతివ్యక్తి ఏదొక వ్యాధితో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, వాపు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికి కారణం మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువే ఉంది. అంతేకాదు మధుమేహం నేటికాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే వీటన్నింటిని నుండి విముక్తి పొందాలంటే మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా చాలా మంది మొలకెత్తిన గింజలు తింటుంటారు. అందులో ప్రొటిన్, కార్బోహైడ్రెట్స్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీకో అద్భుతమైన హోం రెమెడీని పరిచయం చేస్తాం. ఈ మొలకలను నిరంతరం మీ డైట్లో చేర్చుకున్నట్లయితే ఎనిమిది రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం.
నానబెట్టిన మెంతిగింజలు:
నానబెట్టిన మెంతి గింజలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అల్పాహారంలో మొలకెత్తిన మెంతిగింజలను తప్పకుండా తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్ల తర్వాత ఇది చాలా ముఖ్యమైన అల్పాహారం. ఎందుకంటే ఇందులో అనేక పోషక అంశాలు ఉంటాయి. ఒక టీస్పూన్ మెంతి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, డయాబెటిస్ తగ్గిచడంతోపాటు.. జీవక్రియను వేగవంతం చేస్తుంది.
మెంతి గింజల ప్రయోజనాలు:
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
అధిక రక్తపోటును తగ్గిస్తుంది
విటమిన్, ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.
బాలింతల బలహీనతను తొలగిస్తుంది
జుట్టు, గోర్లు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
అధిక రక్త చక్కెరను నియంత్రిస్తుంది.
ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది.
మీ మెదడును మెరుగుపరచడానికి మీరు అల్పాహారంగా మెంతి గింజలను నువ్వులతో కలిపి తినవచ్చు. మెంతి గింజలు, జీలకర్రను రాత్రంతా నానబెట్టండి. ఉదయం మొలకెత్తిన ఖాళీ కడుపుతో తినండి. చక్కటి ఫలితం ఉంటుంది.