ప్రస్తుత కాలంలో సహజ సిద్ధమైనటువంటి బెల్లం వాడకం తగ్గించి.. రసాయనాలు కలిపే పంచదారను ఎక్కువగా వాడుతున్నాము. ఫలితంగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఆరోగ్యకరంగా జీవించాలి అనుకున్నట్లయితే పంచదార స్థానంలో సహజసిద్ధమైనటువంటి బెల్లం వాడితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా వాడాలని చెబుతున్నారు. ఎందుకంటే దీనికి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో దీన్ని తీసుకోవడం మీకు అమృతం లాంటిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

పాత కాలంలో మన పెద్దవారు భోజనం తర్వాత బెల్లం తినేవారు. నిజానికి బెల్లం పంచదారలా రసాయనాలతో శుద్ధి చేయరు. ఇందులో కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు  లభిస్తాయి. బెల్లం బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. ప్రస్తుతం బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం

కడుపులో గ్యాస్ సమస్యలు:

 గ్యాస్ సమస్యలను ఎదుర్కోవటానికి బెల్లం చాలా సులభమైన పరిష్కారం. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా  బెల్లం మీకు బాగా సహాయపడుతుంది.  బెల్లం ఒక సహజ సిద్ధమైన యాంటాసిడ్ లా పనిచేస్తుంది.  ప్రతిరోజు భోజనం చేసిన అనంతరం చిన్న ముక్క బెల్లం తినడం చాలా మంచిది అని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

జలుబు విషయంలో :

చలికాలంలో మీకు జలుబు ఉన్నప్పుడు బెల్లం ఉపయోగిస్తే చాలా మంచింది. దీని వేడి స్వభావం కారణంగా, ఇది మీకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. బెల్లంను పాలు లేదా టీలో ఉపయోగించవచ్చు, మీరు బెల్లంతో కషాయాలను కూడా తయారు చేసుకోవచ్చు.

చర్మానికి:

 బెల్లం మీ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రోజూ కొద్దిగా బెల్లం తింటే మొటిమలు రాకుండా, చర్మం మెరుస్తుంది.

గుండె ఆరోగ్యానికి:

 బెల్లంలో ఉండే పొటాషియం గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో మేలు చేస్తుంది. హృద్రోగులకు చక్కెర హానికరం, కాబట్టి బెల్లం తినడం చాలా ప్రయోజనకరం.

మలబద్ధకం నుంచి విముక్తి :

 మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే రాత్రి భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తింటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

గొంతు నొప్పికి మేలు చేస్తుంది:

అల్లంతో బెల్లం వేసి వేడి చేసి గోరువెచ్చగా తింటే గొంతు నొప్పి  మరియు  మంట నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో గొంతు కూడా మెరుగ్గా మారుతుంది. కీళ్ల నొప్పుల విషయంలో బెల్లం వాడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ అల్లం ముక్క బెల్లం కలిపి తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బెల్లం ఎంత తినాలి?

ఒక వ్యక్తి రోజూ దాదాపు 20 గ్రాముల బెల్లం తినాలి.