శరీరానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యం బాగా లేనప్పుడు పండ్లను బాగా తీసుకుంటే తొందరగా అనారోగ్యం నుండి బయటపడతారు. అయితే పండ్లు కూడా సీజన్ ను బట్టి తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభం కలుగుతుంది. ప్రస్తుతం చలికాలం సాగుతున్న తరుణంలో చలికాలంలో బొప్పాయి తింటే మంచిదని అంటున్నారు. బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
చలికాలంలో కాస్త వేడి గుణం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలి కారణంగా శరీరం డిస్టర్బ్ అవ్వదు. బొప్పాయిలో కూడా వేడి గుణం కలిగి ఉంటుంది. చలికాలంలో వీలైనపుడల్లా బొప్పాయిని తినాలి.
చలికాలంలో బొప్పాయిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయిలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు, చలికారణంగా ఎదురయ్యే తలనొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
బొప్పాయి పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఎంజైమ్ లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్దకం, మోషన్ కావడంలో ఇబ్బందులు, అజీర్తి వంటి సమస్యలు బొప్పాయి తినడం వల్ల అధిగమించవచ్చు.
బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి. కఠినమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె యవ్వనంగా ఉండాలన్నా, ఎంత వయసు పెరిగినా ఇంకా యవ్వనంగా ఉన్నవారిలా గుండె పనిచేయాలని కోరుకుంటున్నా బొప్పాయిని తినమని వైద్యులు చెబుతున్నారు.
బొప్పాయికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు చలికాలంలో కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కేవలం ఆహారంగానే కాకుండా చర్మ సంరక్షణలో కూడా బొప్పాయిని చేర్చుకోవచ్చు. బొప్పాయి ఫేస్ వాష్, బొప్పాయి ఫేస్ ప్యాక్ ట్రై చేయచ్చు.
చలికాలంలో వేడి ఆహారాల మీద అందకీ కన్ను ఉంటుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసే పకోడీలు, వడలు, సమోసా వంటి స్నాక్స్ ను ఇష్టపడతారు. వీటి వల్ల బరువు వేగంగా పెరుగుతారు. కానీ బొప్పాయి తీసుకుంటే ఆకలి ఎక్కువగా కాదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. కాబట్టి దీన్ని తింటే బరువు పెరగకపోవడమే కాకుండా.. బరువు తగ్గడం కూడా సులువు.
*రూపశ్రీ.