పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.   చాలా మంది  పండ్లను సలాడ్లు, జ్యూస్‌లు,  షేక్‌ల రూపంలో తీసుకుంటారు.ఒక్కోరకమైన పండు తినడం వల్ల ఒక్కో ప్రయోజనం లభిస్తుంది.  కానీ కొన్ని పండ్లు ఖాళీ కడుపుతో తింటే వాటి ప్రయోజనాలను రెట్టింపుగా లభిస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో పండ్లు అంటే కేవలం ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాగాలేనప్పుడు తినేవనే  అలవాటు వచ్చేసింది.  అయితే కొన్ని పండ్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  ఆ పండ్లు ఏంటో..అవి కలిగించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి?

ఆపిల్..

జామ..

నేరేడు..

పుచ్చకాయ..

కర్బూజ..

డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే పండ్లు తినవ్చచా..

ఖాళీ కడుపుతో పండ్లు తినడం  కంటే వాటిని ప్రోటీన్, కొవ్వు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో తినడం ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.

ఇలా చేయడం వల్ల, పండ్లలో లభించే చక్కెర పరిమాణం చిన్న ప్రేగులకు నెమ్మదిగా చేరుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగవు.

డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు..

పుచ్చకాయ..

లి చీ..

అరటిపండు..

మామిడి..

ద్రాక్ష..

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఎందుకు మంచిది?

పండ్లలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కడుపు పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు, అది పండ్లలో లభించే పోషకాలను బాగా గ్రహిస్తుంది.

ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు ఏవి?

విటమిన్ సి అధికంగా ఉండే కొన్ని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. ఖాళీ కడుపుతో వాటిని తినడం వల్ల గ్యాస్, అజీర్ణంతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయి.

శరీరాన్ని డిటాక్స్ చేసే పండ్లు..

కొన్ని పండ్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. నిమ్మకాయలు, ఆపిల్, నారింజ,  బెర్రీలు వంటి పండ్లు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి.

ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి,  కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. నిమ్మకాయ నీరు,  పుచ్చకాయ వంటి పండ్లను, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల డిటాక్స్  ప్రక్రియ వేగవంతం అవుతుంది.

                              *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...