ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు . ఆరోగ్యం బాగుండటం కోసం చాలామంది ఉదయాన్ని ఒక మంచి ఆహారపు అలవాటుతో ప్రారంభిస్తారు. కొందరు నిమ్మరసం, తేనె తాగుతారు. మరికొందరు గ్రీన్ టీ తాగుతారు. ఇంకొందరు ఇతర ఆరోగ్యకర ఎంపికల వైపు వెళతారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుని తాగడం చాలా అధ్బుతాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోరు వెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
నెయ్యి నీరు ఎలా తయారుచేసుకోవాలి అంటే..
స్వచ్చమైన ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేయాలి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి.
ప్రయోజనాలేంటంటే..
నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.
ఆవు నెయ్యి ఫ్రీ సెల్స్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఈ కారణంగా ఇది ధమనులు గట్టిపడకుండా చేస్తుంది.
నెయ్యి మెదడును లోపల నుండి బలోపేతం చేయడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో తయారుచేసుకుని లేదా ఇంట్లోనే తయారుచేసి అమ్మేవారి దగ్గర నెయ్యి కొనుక్కుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దేశీ నెయ్యి వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
నెయ్యి ఎముకలను బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా మంచిది. నెయ్యి శరీరంలో జీర్ణక్రియ ఎంజైమ్‌లను పెంచుతుంది.
*రూపశ్రీ.