భారతీయులకు టీ అంటే ఇష్టం. ముఖ్యంగా నగరవాసులు టీను ఎమోషన్ గా ఫీలవుతారు. టీ తాగాలని అనిపిస్తే ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళి టీ తాగేస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో టీ ఎక్కువగా తీసుకుంటారు. చలిని తప్పించుకోవడానికి వేడే వేడి టీ తాగుతుంటే అదొక చెప్పలేని అనుభూతి కలుగుతుంది. చాలామంది రోజు టీతోనే మొదలై టీతోనే ముగుస్తుంది కూడా. పట్టణాలలో చాలాచోట్ల 24గంటలు టీ ఉడుకుతూనే ఉంటుంది. చలికాలంలో టీ ఉత్తమ రోగనిరోధక శక్తిని పెంచేదిగా పరిగణించబడుతుంది. అయితే టీని ఎక్కువసేపు ఉడికిస్తున్నా, ఒకసారి చేసిన టీని మళ్ళీ మళ్లీ వేడి చేస్తున్నా, చలికాలంలో బాగుంటుంది కదా అని అల్లం టీ తాగుతున్నా ఆరోగ్యానికి ముప్పేనని వైద్యులు చెబుతున్నారు. అసలు టీ ఆరోగ్యానికి ఎలా హానికరమవుతుంది పూర్తీగా తెలుసుకుంటే..
టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే రోజులో కేవలం రెండు నుండి మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తాగకూడదు. ఇకపోతే టీని ఎక్కువ సేపు ఉడికించడం, ఒకసారి తయారైన టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ప్రమాదం. చల్లని వాతావరణంలో అల్లం టీ తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చలికాలంలో తరచుగా వచ్చే మూత్ర విసర్జన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ అల్లం టీ తాగవద్దని వైద్యులు చెబుతున్నారు. టీలో అల్లం, లవంగాలు, యాలకులు వేసి ఎక్కువ సేపు ఉడకబెడతారు. ఇలా ఎక్కువసేపు టీని ఉడకబెట్టడం వల్ల టీలో టానిన్ లు ఏర్పడతాయి. ఇది అసిడిటీకి అతి పెద్ద కారణం.
టానిన్ అనేది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. ఇది టీ ఆకులలో కనిపిస్తుంది. టానిన్‌లను పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు, అది యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్‌కు కారణమవుతుంది. టీ తాగిన తర్వాత గ్యాస్ ఎక్కువసేపు ఉంటే కడుపులో వాపు వస్తుంది. అందుకే పేగు సమస్యలు ఉన్నవారు టీ తీసుకోవడం తగ్గించాలని చెబుతారు. అంతే కాదు స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంటే టీని పూర్తీగా మానెయ్యాలి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ రోజుకు రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువ టీ త్రాగకూడదు. వీలైనంత వరకు అల్లాన్ని టీలో ఎక్కువ సేపు ఉడికించకుండా జాగ్రత్త పడాలి. అలాగే.. ఒకసారి చేసిన టీని చలికాలం కదా అని మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదం. జీర్ణాశయంలో పేగులను విచ్చిన్నం చేస్తుంది.
*నిశ్శబ్ద.