ప్రతిఒక్కరు ఎదో ఒక నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అసలు ఆ నొప్పులు ఎలా ఉంటాయి అంటే కొంచం గుచ్చుకున్నట్లుగా ఉంటె తీవ్రంగా  ఉంటుంది.సహజంగా సందర్బోచితంగా శరీరంలో నొప్పులు వస్తూనే ఉంటాయి.లేదా అంచెలు అంచెలుగా నొప్పులు వస్తూనే ఉంటాయి.అయితే కొన్నిరకాల్ నొప్పులు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోండి. ఈ నొప్పులు మీలోపల ఉన్న వాస్తవ పరిస్థితిని తెలియచేస్తుంది. క్యాన్సర్, ఆర్ధరైటిస్, ఇంఫ్లామేషణ్, వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితం ప్రమాదంలో ఉన్నట్లే అనిగమనించాలి. 7 రకాల నొప్పులను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం  చేయకండి.ప్రత్యేకంగా చాలా తీవ్రంగా ఉన్న లేదా దీర్ఘకాలం పాటు నొప్పులు కొనసాగినా సమస్యలే అన్నవిషయం గ్రహించాలి.

1 )పొట్టలో తీవ్రమైన నొప్పి..

పొట్టలో నొప్పి లేదా పొత్తికడుపులో నొప్పి రావడం సహజం.మీరు తీసుకున్న ఆహారం కావచ్చు.లేదా గ్యాస్ వల్ల కావచ్చు ఒకవేళ తీవ్రమైన నొప్పి కిన్దిభాగం లో ఎడమవైపు వస్తే అదితీవ్రంగా ఉంటె తక్షణం పరీక్షించాల్సిందే.ఆనోప్పి అపెండిసైటిస్ కావచ్చు. అపెన్ డిక్స్ లో ఇంఫ్లా మేషన్ కావచ్చు. ఇంఫ్లామేషన్ ను తొలగించేందుకు సర్జరీ చేయాల్సి రావచ్చు. ఇంఫ్లామేషన్ వచ్చిఅది బరస్ట్  కాక ముందే అభాగాన్ని తొలగించడం అనివార్యం.అలా కాక నిర్లక్ష్యం చేస్తే మరణించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట మధ్యలో లేదా పైభాగం లో అది లేదావెనుక వైపు పై భాగం లో అసహనంగా గాబరా పడడం. లేదా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం ప్యాంక్రియాస్ కారణం కావచ్చు. అందులో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉండవచ్చు.వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది.

2) వ్యాయామం అనంతరం అసహజంగా వచ్చే నొప్పి...

 మీరు వ్యాయామం చేసే సమయంలో బరువులు ఎత్తడం మీరు ఇబ్బందులు పడతారు.ఒకవేళ మీకు నొప్పి తీవ్రంగా ఉంటె పాదం అరికాలు నొప్పితో బాధపడితే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా వర్క్ అవుట్ తరువాత నొప్పి వారం రోజులపాటు అలాగే కొనసాగితే కాస్త అలోచించాల్సిందే.అక్కడ అరగడం లేదా విరగడం లేదాటీర్ కావడం అయ్యిఉండవచ్చు.అది మీనోప్పికి  కారణంగా చెప్పవచ్చు.

౩ )నొప్పితో పాటు వాపు...

ఏదైనా   వాపుతోపాటు నొప్పి వస్తే సంకేతం ఏమిటి అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు.కొన్ని గంటల తరువాత వాపు నొప్పి తగ్గనట్లయితే అది మరింత తీవ్రంగా మారితే డాక్టర్ ను తప్పనిసరిగా సప్రదించాలి. 

4)తీవ్రమైన తలనిప్పి...

తలనొప్పి తీవ్రంగా ఉంటె అది మైగ్రైన్ కావచ్చు.లేదా బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు చికిత్చలో భాగంగా ఉపసమనం కొసం వైద్యసహాయం తీసుకోవాలి  లేదా నొప్పినివారించే మండువడాలి. లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటె ఎప్పుడు అనుభవించని నొప్పి మిమ్మల్ని బాధిస్తుంటే.ఏదైనా ఒకవ్యాది వచ్చి ఉండవచ్చు.అదిఎదొ తెలుసుకోవాలంటే పరీక్షలు నిర్వహించాలి.కార్బన్ మోనాక్సైడ్ విషతుల్య పదార్ధాలు ఉండవచ్చు.దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ ట్యూమర్ కణి తలు ఏర్పడి ఉండవచ్చు.మీ జీవితం లో ఎప్పుడూ ఎవరూ ఎదుర్కిని తీవ్రమైన తలనొప్పి తప్పనిసరిగా అత్యవసర చికిత్చ అవసరం కావచ్చు.

5)చాతి నొప్పి...

అన్నిరకాల చాతినోప్పులు గుండె పోటు కాదు అన్న విషయం తెలుసుకోవాలి.అయితే చాతిలో నొప్పి అన్నది హార్ట్ ఎటాక్ గుండేనోప్పి లక్షణంగా చెప్పవచ్చు.మీచాతిపై ఎదో బరువుపెట్టినట్ట్లుగా ఉంటె మీరే కారు నడపడం మంచిది కాదు. చాతి లో నొప్పి వచ్చినప్పుడు అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి వెళ్ళండి.మీసమస్యను వివరించండి తగిన సమయంలో చికిత్చ అందించడం ద్వారా గుండెపోటుతో మరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ముఖ్యంగా ఇటీవలి కాలం లో ఉదయం వేళ లో మాత్రమే వ్యాయామం అనంతరం  గుండెపోటుతో మరనిస్తున్నఘటనలు  చూస్తున్నాం. కాబట్టి చాతి పై బరువుగా ఉన్న ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు.

6)పెద్ద పాదం లో నొప్పి...
 

మీపాదం లో నొప్పి వస్తే అది గౌట్ కావచ్చు దీనిని వైద్య పరిభాష లో గౌట్ ఆర్తరైటిస్ అంటారు. ఇది ఆర్తరైటిస్ నుండి వస్తుంది.చాలా నొప్పిగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా ఆహార పదార్ధాలు అరగక పోయినా ఆల్కాహాల్ ఎర్రమామ్సం సాఫ్ట్ డ్రింక్స్ ఇతర ఆహార పదార్ధాలు అయితే వీటినుండి ఉపసమనం పొందనికి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు.ఈసమస్యకు నిపుణుడైన ప్రత్యేక డాక్టర్ నుండి చికిత్చ తీసుకోవడం అవసరం. గౌట్ కు సరైన చికిత్చ చేయనట్లయితే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చు. 

7)నెలసరి వచ్చే సమస్యలో క్రామ్ప్...

నెలసరి సమస్యల కాలం లో స్త్రీలు తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు.ఈసమస్యను వైద్య పరిభాష లో మేన్స్టురియల్ క్రామ్స్ వల్ల కింది భాగం లో నొప్పి తీవ్రంగా ఉంటుంది.అయితే అది ప్రతినెలా స్త్రీలను వేదిస్తూ ఉంటుంది. అది చాలా సహజమైన నొప్పిగానే స్త్రీలు భావిస్తారు.అయితే నొప్పి తీవ్రత అధికంగా ఉంటె మీరు గైన కాలజిస్ట్ ను కలిసి డాక్టర్ సూచనల మేరకు పరీక్షలు నిర్వహించాలని లేదా తీవ్ర ద్సమస్యలు తప్పవు. అది ఒవేరియన్ క్యాన్సర్ ఎస్ టి డి క్యాన్సర్ కాని కణితలు కావచ్చు.అదనంగా వచ్చే నొప్పి ఏందో మెట్రిసెస్ కావచ్చు.అది త్వరితగతిన పరీక్షించాలి అలాగే ఉత్తమ చికిత్చ తీసుకోవాలి. ఏండో మెట్రిసెస్ వల్ల సంతనలేమి సమస్యలు వస్తాయి.కొన్ని సందర్భాలలో డాక్టర్స్ సర్జరీకి సిఫార్స్ చేయవచ్చు.సర్జరీ ద్వారా టిష్యు ను తొలగిస్తారు దీనివల్ల పిల్లలు కలిగే అవకాసం ఉందని  నిపుణులు తేల్చి చెప్పారు. నెప్పి ఎలాంటిదే అయినా ప్రాధమిక స్థాయిలో తక్షణం గుర్తించి అందుకు తగిన చికిత్చ తీసుకోవాలని సూచించారు.