కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ చలికాలంలో కొన్ని ఆహారాలు మీ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఎలాంటి ఆహారాలు చలికాలంలో తినకూడదో ఇప్పుడు చూద్దాం.

కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు...ఇది మంచి కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా వస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటిన్ , చెడు కొలెస్ట్రాల్ అయితే..అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటిన్ మంచి కొలెస్ట్రాల్ . హైర్ కొలెస్టెరోలేమియా అని పిలిచే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ శీతాకాంలో కొన్ని ఆహారాలు మీ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అవి ఎలాంటి ఆహారా పదార్థాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.నెయ్యి:

చలికాలంలో నెయ్యి చాలా ముఖ్యమైంది. మన ఆహారంలో రుచి, వాసనను పెంచేందుకు చేర్చే నెయ్యి మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. వ్యాయామం చేయనివారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి.

2. వెన్న:

వెన్ను సాధారణంగా వేడి వంటల్లో ఉపయోగిస్తారు. వెన్నలో సంత్రుప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

3. పనీర్:

పనీర్ భారతీయ వంటకాల్లో ముఖ్యమైంది. పనీర్ టిక్కా వంటి చలికాలపు వంటకాల్లో ప్రముఖమైంది. అయినప్పటికీ అందులో సంత్రుప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

4. రెడ్ మీట్ :

రెడ్ మీట్ చలికాలంలో ఇష్టమైన మాంసాహారం. అయితే ఇందులో సంత్రుప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

5. ఫ్రైడ్ స్నాక్స్ :

శీతాకాలంలో ప్రతిఒక్కరూ వేడిగా ఉండే ఆహారాన్ని తింటుంటారు. సమోసాలు, బాగెట్లు, వడలు వంటివి వేయించిన చిరుతిళ్లను ఇష్టపడతాము. స్నాక్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేలా  చేస్తాయి.